Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాటి తెలంగాణ జీవిత చిత్రణ… ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి…

February 8, 2026 by M S R

.

చిల్లర దేవుళ్లు …. చిల్లర దేవుళ్లు సినిమా విడుదలయ్యిందా అని ఎవరో అడిగారు ఆ మద్దెల .. ఒకవేళ అయ్యుంటే ఫ్లాప్ అయ్యే ఉంటుంది కదా అన్నారు లాయరు గారు …

అంచేతన నేను చెప్పేదేంటంటే … ఆ సినిమాను తారకరామా వారు విడుదల చేశారు. బెజవాడ రామా టాకీసు వారి చేతుల్లోనే ఉండేదని నా అనుమానం. అందులోనే ఈ చిల్లర దేవుళ్లు ఆడింది .

Ads

చిల్లర దేవుళ్లు సినిమా 1977 మార్చి 11న విడుదలైంది. దాశరథి రంగాచార్య నవల చిల్లర దేవుళ్లు అప్పటికే అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ కూడా పాపులర్. చాలా మంది చదివేశారు. నేను మానికొండ లైబ్రీలో చదివాను…

తెలంగాణ పోరాట నేపధ్యంలో రంగాచార్య గారు రాసిన నవలల పరంపరలో ఇది ఒకటి. ఆ తర్వాత మోదుగు పూలు, జనపథం వచ్చాయి.

తెలంగాణ నుంచీ తెలంగాణ వరకు … అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచీ నక్సల్బరీ రాజకీయాలు తిరిగి తెలంగాణలో సాయుధ పోరాట రాజకీయాలకు కొలిమి ఊదే వరకు … పరిణామాలు అన్నీ – మార్క్స్ టూ మావో… ఈ నవలలన్నీ సీరియల్ గా సీరియస్ గా చర్చించాయి.

అలాంటి సిరీస్ లో భాగంగా వచ్చిన చిల్లర దేవుళ్లు  నవలను వరంగల్ కి చెందిన మాధవరావు డైరక్షన్ లో తెరకెక్కించారు. సినిమా ఆర్ధిక విజయం సాధించలేదు. పాటలు అప్పటికే హిట్ అయి ఉండడం వల్ల రెండు వారాలు రన్నింగ్ కలక్షన్ వచ్చింది.

అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి సెకండ్ రిలీజు , అక్కినేని ఆలుమగలు విడుదలవడంతో ఇది పూర్తిగా అడుగంటింది.

చిల్లర దేవుళ్లు

…………..
ఇందులో … ఏటికేతంబట్టి ఎయిపుట్లు పండించి గంజిలో మెతుకెరుగరన్నా … అనే పాటయూ … శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అనే పాటయున్నూ తప్ప కడమావన్నీ ఆత్రేయే రాసినారు. (కలువకు చంద్రుడు ఎంతో దూరం, పాడాలనే ఉన్నదీ విని మెచ్చే మనిషుంటే)..,

……
ఈ రెండూ కూడాను … తెలంగాణ ప్రాంతపు జానపద గీతాలనే తీసుకోవడం జరిగింది. ఏటికేతంబట్టి పాట ఆకాశవాణి గాయకుడు నరసింహమూర్తి పాడారు. అతనే పెండ్యాల సంగీత దర్శకత్వంలో … సతీ సావిత్రిలో కృష్ణంరాజుకు ప్లేబ్యాక్ పాడారు. అయితే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోలేదు.

ఒంగోలులో ఆకాశవాణి వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎనభై ఒకటి ప్రాంతాల్లో … ఆయన వేదికపై పాడగా విన్నాను. ఆయన ప్రధానంగా ఆకాశవాణికి చెందిన జానపద గాయకుడుగానే ఎక్కువ పాపులర్. అలా చిల్లర దేవుళ్లు సినిమా శానా పాత విషయాలను గుర్తు చేసింది… …………….. Bharadwaja Rangavajhala



నెట్‌లో ప్రముఖ చిత్ర సమీక్షకుడు వారాల ఆనంద్ రాసిన రివ్యూ కనిపించింది… సినిమా విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాసిన సమీక్ష…

చిల్లర దేవుళ్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాటి తెలంగాణ జీవిత చిత్రణ… ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి…
  • తల్లిగర్బంలోనే జ్ఞానబోధ..! ప్రభుత్వ దవాఖానాల్లో ‘గర్భసంస్కార్’..!
  • అతి ‘చిన్న’ జియ్యరుడు..! హిందూ మత సంఘటనకే ఓ పే-ద్ధ ప్రమాదుడు..!!
  • ఆ మంచు గడ్డల్లో … చావుకు ఎదురీదుతూ… బరువులు మోసే కొలువు…
  • కొంపముంచిన అక్రమ సంబంధం… కటకటాలపాలైన దొంగ జ్యోతిష్కుడు…
  • సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!
  • ఇండియన్ నేవీలో FIC … మానవరహిత హైటెక్ పెట్రోలింగ్ బోట్స్…
  • అదుగో పొగ… ఇదుగో బురద… ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్థమా..? దహనమా..?
  • AI వ్యూహంలో చిక్కుకున్న భారత్… మిషన్లకు అందని సూర్య మ్యాజిక్..!
  • నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions