Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంజలి..! ఇలాంటి మణిరత్నం క్లాసిక్స్ మళ్లీ ఎప్పుడు చూస్తామో..!

February 11, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. Hats off to Mani Rathnam . అసలీ కధ ఆయనకు ఎలా తట్టిందో ? బహుశా గీతాంజలి హేంగోవర్ ఏమో ! అది అయినా కాకపోయినా అంజలి సినిమా మాత్రం ఓ గొప్ప సినిమా .

ఇంతమంది పిల్లలతో సినిమా తీయటం సాధారణమైన విషయం కాదు . ఈ సినిమా అనగానే నాకు గుర్తుకొచ్చే సినిమా 1960 లో వచ్చిన పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం . అది కూడా డబ్బింగ్ సినిమాయే .

Ads

అయితే ఈ అంజలి సినిమా ఘర్షణ సినిమా లాగానే డబ్బింగ్ సినిమా అని అనిపించదు . డైరెక్ట్ టేక్ అనే అనిపిస్తుంది . ఒక దురదృష్టవంతురాలయిన బిడ్డ కధ ఇది . బిడ్డలు ఎలాంటి మానసిక , శారీరక వైకల్యం లేకుండా పుట్టడం కూడా అదృష్టమే .

చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాలలో చెపుతూ ఉంటారు . అన్ని అవయవాలతో మనల్ని దేవుడు సరిగ్గా పుట్టించినందుకు మనం ఆ భగవంతునికి కృతజ్ఞులం అయిఉండాలి . Of course . భగవంతునితో పాటు మన తల్లిదండ్రులకు కూడా అని నేను అంటాను .

ఓ జంటకు ఇద్దరు పిల్లల తర్వాత మానసిక వైకల్యంతో ఒక బిడ్డ జన్మిస్తుంది . ఆ బిడ్డ చనిపోయిందని భార్యకు చెప్పి రహస్యంగా పెంచుతూ ఉంటాడు . అపార్ధం చేసుకున్న భార్యకు తప్పనిసరి పరిస్థితుల్లో నిజం చెప్పి ఆ బిడ్డ అంజలిని ఇంటికి తెచ్చుకుంటారు .

మొదట ఇంట్లో ఉన్న కూతురే అంజలిని చెల్లెలుగా స్వీకరిస్తానికి టైం పడుతుంది . ఆ తర్వాత ఆ కాలనీలో పిల్ల సైన్యం కూడా అంజలిని తమ జట్టులో కలుపుకుంటారు . సినిమా క్లైమాక్సులో అంజలి మరణం అందరినీ కలచివేస్తుంది . ప్రేక్షకులు కూడా భారమైన హృదయాలతో థియేటర్ల నుండి బయటకు వస్తారు .

నటనపరంగా ప్రతి ఒక్కరిని మెచ్చుకోవలసిందే . ముందుగా అంజలి పాత్రధారి బేబీ షామిలిని , ఆ తర్వాత అంజలి అన్న అక్కలుగా నటించిన రోజారమణి కుమారుడు తరుణ్ , శృతిలను మెచ్చుకోవాలి . ముగ్గురూ బాగా నటించారు . ఆ తరువాత పిల్లలను అందరినీ .‌

సినిమాలో పాటలన్నీ పిల్లల మీదనే . పెద్ద ఆరిందాల్లాగా డాన్సించారు . వీళ్ళందరి చేత డాన్సింపచేసిన డాన్స్ మాస్టర్ సుందరాన్ని , దర్శకుడు మణిరత్నాన్ని అభినందించాలి .

తల్లిదండ్రులుగా రఘువరన్ , రేవతి గొప్పగా నటించారు . ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో… ఇతర పాత్రల్లో ప్రభు , జనక్ రాజ్ , శాంతిప్రియ , ప్రదీప్ శక్తి , చారుహాసన్ , శరణ్య , తదితరులు నటించారు . వీరందరివీ కాసేపు కాసేపు ఉండే పాత్రలే . సినిమా అంతా తల్లిదండ్రులు , పిల్లల మీదే నడుస్తుంది .

షామిలి

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . అంజలి అంజలి అంజలి పాట సూపర్ హిట్ సాంగ్ . తెలుగు పాటల అనువాదం రాజశ్రీ చేసారు . ఆయనకు కొట్టిన పిండేగా . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , అనితారెడ్డి , జూనియర్ సింగర్లు చాలామంది పాటల్ని శ్రావ్యంగా పాడారు .

తమిళంలో ఈ సినిమాకు జాతీయ , రాష్ట్ర స్థాయిలలో అవార్డుల వర్షం కురిసింది . సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు కూడా . 14 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది .

సినిమా యూట్యూబులో ఉంది . ప్రతీ సినిమా లవర్ చూడవలసిన సినిమా . ముఖ్యంగా పిల్లలకు చూపాలి . ఒకప్పుడు స్కూల్ పిల్లల కోసం ఆదివారాలు స్పెషల్ షోలు వేసేవారు . ఇప్పుడు చాలా స్కూల్సులో దియేటర్లు ఉంటున్నాయి కాబట్టి స్కూల్సులోనే వేయవచ్చు . వైకల్యం ఉన్న పిల్లల విషయంలో ఉదారంగా ఉండాలనే సందేశం పిల్లలకు వెళుతుంది .

నేను పరిచయం చేస్తున్న 1235 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు



ఇది ET అనే హాలీవుడ్ సినిమాకు ప్రేరణ అంటారు, అలాగే 1979 లో ప్రసారమైన టీవీ కథ Son-Rise: A Miracle of Love కూడా...

అంజలి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంజలి..! ఇలాంటి మణిరత్నం క్లాసిక్స్ మళ్లీ ఎప్పుడు చూస్తామో..!
  • హిందూ మహా సముద్రంలో ఇండియాకు రెండు ‘సెక్యూరిటీ గార్డులు’…
  • ఆ జర్నలిజాన్ని మార్కెట్ తిరస్కరించింది… వాషింగ్టన్ పోస్ట్ వైఫల్యం అదే…
  • కాళ్లు తోక… చేతులే మొప్పలు… ఒళ్లు వలను కొరికి బయట పడ్డ చేపపిల్ల…
  • ఏమోయ్ జై షా… ఒక పాకిస్థానీ ఉగ్ర బంకర్ పేల్చిన ఖర్చు తెలుసా నీకు..?!
  • ఎవరీమె..? అస్సాం ముఖ్యమంత్రి ఎందుకు వేటాడుతున్నాడు..?
  • మంచు అల్లుడు గారు… కామెడీ విలన్ నుంచి ‘మంచి’ పాత్రల్లోకి…
  • ‘సర్’.., భలే చెప్పారు సర్… మమత క్షుద్ర విన్యాసాలకు సుప్రీం చెక్…
  • జియర్ పుణ్యమాని… జిజ్ఞాస పెరిగింది… ఇదీ హిందూ ధర్మపరంపర…
  • వైర్‌లెస్ కరెంటు – భూమిపైనే సూర్యుడు… భవిష్యత్తు ‘శక్తి’ మార్గాలు ఇవే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions