.
John Kora ….. బిల్‌గేట్స్ ఒక టెక్నాలజీ దిగ్గజం. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థను నెలకొల్పి.. సామాన్యులు కూడా కంప్యూటర్‌ను వాడేలా చేసిన వాడనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ స్వచ్ఛంద సేవ పేరుతో మన తెలంగాణకు ఎంత అన్యాయం చేశాడో బహుషా చాలా మందికి తెలియదు.
మైక్రోసాఫ్ట్ ద్వారా ప్రపంచ కుబేరుడు అయిన బిల్‌గేట్స్.. ఆ తర్వాత కాలంలో తన భార్య (మాజీ) మిలిండాతో కలిసి ‘బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్’ను స్థాపించాడు. ఆ సంస్థ మన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంది.
Ads
2009లో PATH అంటే Program for Appropriate Technology in Health అనే అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ.. ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టింది.
ఆడవాళ్లలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే HPV వ్యాక్సిన్‌ను పరీక్షించడం కోసమే ఈ ప్రాజెక్ట్. అయితే ఇందుకోసం 10 నుంచి 14 ఏళ్ల బాలికలు అవసరం. అంతే కాకుండా చాలా నిధులు కావాలి. అప్పుడే బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించింది. వందల కోట్ల డాలర్లు గుమ్మరించింది.
డబ్బైతే వచ్చింది.. మరి బాలికలు ఎక్కడ? ఎస్.. అప్పుడే బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రంగంలోకి దిగారు. స్వచ్చంద సేవ పేరుతో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. భద్రాచలం, కొత్తగూడెం, తిరుమలాయపాలెం మండలాలతో పాటు గుజరాత్‌లోని వడోదరలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలను ఇందుకోసం తీసుకున్నారు.
పాపం.. ఆ పిల్లలకు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియదు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది మంది ఆశ్రమ పాఠశాల, హాస్టల్ విద్యార్థినులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ బాలికల అనుమతి లేకుండానే ట్రయల్స్‌లో భాగస్వామ్యం చేసింది బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్.
అయితే వ్యాక్సిన్ వికటించి అనేక మంది బాలికలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హాస్టల్ వార్డన్లకు లంచాలు ఇచ్చి.. వారి సంతకాలు తీసుకొని బాలికలకు వ్యాక్సిన్స్ ఇచ్చారు. కనీసం బాలికల తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు తెలియదు.

ఖమ్మం జిల్లా, వడోదర జిల్లాలో జరిగిన ఈ ట్రయల్స్‌లో అనేక మంది బాలికలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అంతే కాదు భద్రాచలం ప్రాంతంలో ఏడుగురు బాలికలు మరణించారు. ఈ ఘటనపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2013లో దీనిపై పూర్తి స్థాయి నివేదిక కూడా ఇచ్చింది.
PATH సంస్థ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించిందని.. గేట్స్ ఫౌండేషన్ బాలికలను ఒక గినియా పిగ్స్ (ల్యాబ్స్‌లో ఉపయోగించే పందులు)లా వినియోగించుకున్నారని వెల్లడైంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ నిధులతో నడిచే ఈ సంస్థ, వ్యాక్సిన్ తయారీ కంపెనీల లాభాల కోసం పనిచేసిందని స్పష్టమైంది.
ఈ ఘటన తర్వాత 2010లో కేంద్ర ప్రభుత్వం HPV వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేసింది. సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసులు నడిచాయి. దీని ఫలితంగానే ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది…. #భాయ్‌జాన్
Share this Article