Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ పోలీసులు భేష్… కానీ ఈ దరిద్ర అన్వేషుడి కథ ముగియలేదు…

February 20, 2026 by M S R

.

ఇక్కడ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డిని, సీపీ సజ్జనార్‌ను, ఇతర పోలీసుల అధికారులను అభినందించాలి… ప్రత్యేకించి ఒక దశలో బెట్టింగ్ యాప్స్ విషయంలో సజ్జనార్ తదితరులు ఏ అన్వేష్ అనే కేరక్టర్‌ను సపోర్ట్ చేశారో… వాళ్లే తప్పు తెలుసుకుని, వాడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రద్దు చేయించారు… సూపర్…

దాదాపు 13 లక్షల ఫాలోయర్లున్న ఖాతా అది… కేసులు నమోదు చేయడమే కాదు, సీసీఎస్ పోలీసులు మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం మేనేజ్‌మెంట్) చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఇన్‌స్టా ఖాతా క్లోజ్… శుభం… కానీ సరిపోదు, ఆ కేరక్టర్‌కు సంబంధించిన యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎట్సెట్రా అకౌంట్లన్నీ క్లోజ్ కావాలి…

Ads

విదేశాల్లో దాక్కుని, నన్నేం చేయగలరు అని నీలుగుతున్నాడు కదా… లుకౌట్ నోటీసులు కూడా జారీ కావాలి… హిందూ పురాణ స్త్రీలను, దేవతలను, మొత్తం హిందూ మతాన్నే వాడు నీచమైన, వెకిలి, బూతు, వెగటు భాషలో వెక్కిరించాడు… వాడి డైలాగ్ డిక్షన్, వాడి వెటకారం… సొసైటీకి ప్రమాదకారి వాడు…

anvesh

ఎస్, హిందూ మతమే కాదు, ఏ మతాన్ని వెకిలి చేసినా సరే ఇలాగే సొసైటీ, ప్రభుత్వం వెంటపడాలి… అది ఏ మతమైనా సరే..! ఇలాంటి బ్యాక్టీరియాలకు పవర్‌ఫుల్ యాంటీ బయాటిక్స్ అవసరమే… వాడే చెప్పాడు ఏదో వీడియోలో… 14 ఏళ్ల అమ్మాయితో సంభోగం చేశానని, అదో ఘనతగా… అదీ వాడి రియల్ గుణం…

నిజానికి 8 నుంచి 10 కోట్లు ఆల్రెడీ సంపాదించాను, విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవడేం చేయగలడు అన్నట్టు వీడియోలు పెట్టాడు వాడు… ఆ బలుపు దిగాలంటే వాడి సోషల్ ఖాతాల రెవిన్యూ జీరో కావాలి, అంతేకాదు, వాడిని ఆ దేశం నుంచి ఇండియాకు డిపోర్ట్ చేయించాలి, తరువాత, ఇదే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించాలి… అసలే మన సీసీఎస్ పోలీసులు ఖతర్నాక్… ఒక్కరోజు ‘మర్యాదపూర్వక విచారణ’ చాలు…

వాస్తవంగా వాడి వీడియోలతో ఒక్కసారిగా దుమారం రేగాక… ఒకటీరెండు రోజులు చాలామంది వాడి యూట్యూబ్ ఖాతాకు, ఇన్‌స్టా ఖాతాకు రిపోర్టులు కొట్టడం స్టార్ట్ చేశారు జనం… రెండు రోజులకే చల్లపడిపోయారు… మొదటి రెండురోజులు వాడిని అన్‌ఫాలో చేశారు… కానీ తరువాత ఆపేశారు… ఎలాగూ ఆపేస్తారనే వాడి ధీమా… ఆగ్రహ ప్రకటనలో కూడా మనకు కన్సిస్టెన్సీ లేకపోవడం..!

అన్వేష్

జాగ్రత్త… వాడు కాళ్లబేరానికి వస్తాడు… కానీ వాడు ఓ మొండి బ్యాక్టీరియా… అంత త్వరగా చావదు… పోలీసులు పట్టు సడలించకూడదు… నిర్మూలనే బెటర్, అంటే వాడి రెవిన్యూ, వాడి బలుపు చావాలి…

అందుకే సర్, ప్లీజ్, వాడి యూట్యూబ్, వాడి ఫేస్‌బుక్ అకౌంట్లనూ క్లోజ్ చేయించండి… వాడిని ఇక్కడికి తీసుకు రండి..!! ఐబొమ్మ రవి కాదు, ఇదుగో ఇలాంటివాళ్లే అసలు డేంజరస్ క్రీచర్స్..!!

అన్వేష్

స్టిల్, వాడి బలుపు తగ్గలేదు… మరో ఇన్‌స్టా అకౌంట్ ఉందట, దాన్నుంచి తన సహజ మాటధోరణితో మరో పోస్ట్ పెట్టాడు… యూట్యూబ్ ఆదాయం ఉందిగా అంటున్నాడు… అదీ రెంటు చానెళ్లు ఉన్నాయంటున్నాడు… సో, హైదరాబాద్ పోలీసులకు ఏమైనా హింట్ అందుతోందా…? సేమ్, ఐబొమ్మ రవిలాగే ఇతనూ నన్నేం చేయలేరనే చాలెంజ్ చేస్తున్నట్టు అర్థమవుతోందా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కుదరదు..! ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఇప్పుడైతే అసాధ్యం..!!
  • నమ్మకాలు – అమ్మకాలు… అసలు ఎవరు ఈ జగ్గీ వాసుదేవుడు…
  • గుడ్ గోయింగ్… హైకమాండ్ సర్టిఫికెట్… రేవంత్ రెడ్డికి ఓ బూస్టప్…
  • హేమిటో… ఆ వయస్సులో వైవిజయతో స్టెప్పులు- రమ్యకృష్ణతో రొమాన్స్…
  • తెలంగాణ పోలీసులు భేష్… కానీ ఈ దరిద్ర అన్వేషుడి కథ ముగియలేదు…
  • చెత్తా ప్రచారాల్ని నమ్మకండి… ఏ బియ్యం బెటరో అర్థం చేసుకొండి…
  • పదేళ్లు వెనక్కి పోతారట… నమ్మితే పదేళ్లు ముందుకు వెళ్లిపోతారు…
  • అయ్యో భగవంతుడా… ఆ ముగ్గురినీ పెంచి పోషించేదెలా మాస్టారూ…
  • సర్వపిండి..! చివరకు దీన్ని కూడా భ్రష్టుపట్టించేస్తున్నారు… నిజం..!!
  • ఓ మాజీ జర్నలిస్టు… వెంట నడిచిన ఓ ఆటోడ్రైవర్… ఇదీ ఇంట్రస్టింగు కథే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions