.
గత రెండు కథనాల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన మూడు నమ్మలేని ఆపరేషన్లు చదివాం కదా… మరో రెండుమూడూ ఇలాంటివే…
1. మెరుపు దాడి: అయస్కాంత బాంబుల పర్వం (Magnetic Bombs) 2010 నుండి 2012 మధ్య కాలంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుసగా అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు… ఆ పద్ధతి చాలా వింతగా, భయంకరంగా ఉండేది…
Ads
-
ఆపరేషన్…: ఒక శాస్త్రవేత్త తన కారులో ఆఫీసుకో లేదా ఇంటికో వెళ్తుండగా, పక్కన ఒక మోటార్ సైకిల్ వేగంగా వచ్చేది…. ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి కారును దాటుకుంటూ వెళ్తూనే, ఒక చిన్న అయస్కాంత బాంబును (Magnetic Bomb) కారు డోర్‌కు తగిలించి వెళ్ళిపోయేవాడు…
-
ఫలితం..: బాంబు అంటుకున్న కొన్ని సెకన్లలోనే పేలిపోయేది… డ్రైవర్‌కు ఏమీ కాకుండా, కేవలం పక్కన కూర్చున్న శాస్త్రవేత్తనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి… మోటార్ సైకిల్ మీద వచ్చిన వారు ఎవరో, ఎటు వెళ్ళారో ఇరాన్ భద్రతా దళాలు కనుగొనే లోపే వారు మాయమైపోయేవారు…
2. ఆపరేషన్ హార్డ్ వేర్ (Supply Chain Sabotage) ఇది నేరుగా దాడులు చేయడం కంటే చాలా తెలివైన పద్ధతి… ఇరాన్ తన అణు రియాక్టర్ల కోసం అవసరమైన విడిభాగాలను (High-tech parts) ఇతర దేశాల నుండి రహస్యంగా కొనుగోలు చేసేది…
-
మొసాద్ ఎత్తుగడ…: మొసాద్ ఏజెంట్లు నకిలీ కంపెనీలను సృష్టించి, ఇరాన్ కొనే విడిభాగాలను తామే సరఫరా చేసేవారు…
-
ట్విస్ట్…: ఆ విడిభాగాలలో (ముఖ్యంగా వాక్యూమ్ పంపులు, ఎలక్ట్రానిక్ స్విచ్‌లు) లోపల అతి చిన్న పేలుడు పదార్థాలను అమర్చేవారు… అవి ఇరాన్ అణు కేంద్రంలో అమర్చిన కొన్ని నెలల తర్వాత లేదా ఒక నిర్ణీత సమయంలో పేలిపోయేలా చేసేవారు… దీనివల్ల ఇరాన్ శాస్త్రవేత్తలు అది “టెక్నికల్ ఫెయిల్యూర్” అనుకునేవారు తప్ప, మొసాద్ పని అని వెంటనే గుర్తించలేకపోయేవారు…
3. సైలెంట్ పాయిజనింగ్ (Silent Poisoning) కొంతమంది ఇరాన్ శాస్త్రవేత్తలు ఎటువంటి గాయాలు లేకుండా, అనుమానాస్పద స్థితిలో మరణించారు…
-
ఘటన…: ఉదాహరణకు, 2007లో అర్డెషిర్ హొస్సేన్ పూర్ అనే అణు శాస్త్రవేత్త “గ్యాస్ లీక్” వల్ల మరణించారని ఇరాన్ ప్రకటించింది… కానీ అది మొసాద్ చేసిన రేడియోధార్మిక విష ప్రయోగం (Radioactive Poisoning) అని పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తాయి… శత్రువు దరిదాపుల్లో లేకపోయినా, ఆహారం లేదా గాలి ద్వారా వారిని మట్టుబెట్టడం మొసాద్ శైలి…
వీటన్నింటి సారాంశం ఏమిటంటే… మొసాద్ తన ఆపరేషన్లలో “టెక్నాలజీ + హ్యూమన్ ఇంటెలిజెన్స్” ను కలిపి వాడుతుంది… వారు కేవలం డ్రోన్ల మీద ఆధారపడరు; క్షేత్రస్థాయిలో ఇరాన్ పౌరులలాగే జీవించే ఏజెంట్లను (Sleepers) దశాబ్దాల పాటు అక్కడ ఉంచుతారు… మరో వార్త ఇదుగో…

సో, ఖమేనీ కుటుంబం ఉన్న భవనాన్ని కచ్చితమైన సమాచారంతో గుర్తించి, నేరుగా అక్కడే అటాక్ చేసి, యుద్ధం ప్రారంభమైన కాసింత వ్యవధిలోనే హతమార్చడం మామూలు ఆపరేషన్ కాదు…
వెనెజులా మధురో అరెస్టు సమయంలో కూడా అమెరికా ఓ మైక్రోవేవ్ వెపన్ ఉపయోగించినట్టు చదివాం కదా… అదిప్పటి వరకు లోకానికి తెలియని కొత్త వెపన్… సో, ఇజ్రాయిల్, అమెరికాలు ప్రయోగిస్తున్న ‘‘యుద్ధతంత్రాలు’’ ఆశ్చర్యాన్నే కాదు, రాబోయే రోజులపై ఆందోళననూ రేకెత్తిస్తున్నాయి… అమెరికా తదుపరి టార్గెట్ బహుశా క్యూబా..?!
Share this Article