.
Mohammed Rafee మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యం చెక్కు చెదరలేదని నిరూపించుకున్నారు! 16 మంది పోటీ పడినా, ఆ 16 పేర్లన్నీ ఢిల్లీకి చేరినా, ఆ సీటును తన మిత్రుడికే ఓకే చేయించుకున్నారు! పార్టీలో తనకున్న పట్టు మరోసారి చాటుకున్నారు!
ఇటీవల కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే ఏదో అన్నట్లు, రేవంత్ రెడ్డిని దగ్గరకు రానివ్వొద్దు అన్నట్లు AI తో డీప్ వీడియోలు చేసి వదిలిన వారికి చాచి చెంప దెబ్బ కొట్టినట్లే అయ్యింది! పార్టీ సీనియర్ నేతలు వి. హనుమంతరావు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ఒక్క సీటు కోసం రేసులో వున్నా సరే, అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గింది!
Ads
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఈ విషయం గురించి కదిలించినప్పుడు ఆయన దాటేసారు. తరువాత మాట్లాడదాం అనేశారు! అంటే అర్ధం రేవంత్ రెడ్డితో మాట్లాడాక తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పకనే చెప్పారు!
రేవంత్ రెడ్డి మరో మాట లేకుండానే తనకు నచ్చిన రెండు పేర్లు, తన ఉమ్మడి జిల్లాకు చెందిన పేర్లు మాత్రమే పంపించారు. అయితే వంశీ చంద్ రెడ్డి, కాదంటే నరేందర్ రెడ్డి! చివరకు నరేందర్ రెడ్డి పేరునే ఖరారు చేశారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులుగా, సీఎం పేషీలో కీలక వ్యక్తిగా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు.
వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదు! ఇద్దరూ కలసి ZPTC ఎన్నికల్లో తమ ప్రస్థానం నుంచి మిత్రులే! BRS, ఆ తరువాత TDP లోనూ ఇద్దరూ కొనసాగారు. ఇద్దరూ కాంగ్రెస్ లోకి అడుగు పెట్టారు! రేవంత్ రెడ్డికి వెన్ను దన్నుగా నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇక ఢిల్లీలో కూడా తన నమ్మకస్తుడు నరేందర్ రెడ్డి ఉండాలని ఆశించారు.
ప్రభుత్వానికి అవసరమైన పనులు త్వరిత గతిన చేసేందుకు తన మనిషి ఉండాలని ఈ నిర్ణయం తీసుకుని నరేందర్ రెడ్డికే రాజ్యసభ కేటాయించేసారు. మిగిలిన స్థానం అధిష్టానంకు వదిలేయగా, పార్టీకి సుప్రీం కోర్టులో అండదండలు అందిస్తున్న సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి వైపే మళ్ళీ మొగ్గారు.
సంగారెడ్డి సింహం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పే పని చేసినా స్టీరింగ్ తిరగలేదు! ఆయన జీవన్ రెడ్డి లేదంటే వి. హనుమంతరావు పేర్లు మాత్రమే బలపరచి వచ్చారు. కానీ, అధిష్టానం విన్నట్లు తలూపింది!
మహేష్ గౌడ్ మాత్రం వచ్చిన దరఖాస్తులన్నీ పట్టుకుని తిరిగారు! ప్రయోజనం లేదు! అధికారంలోనే కాదు పార్టీలోనూ తనదే పైచేయి అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు! కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం లాంటిది! ప్రాంతీయ పార్టీలు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు! ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి!
ఎంతో మంది సీనియర్లు తిమింగళాలు ఉంటారు! మరోవైపు ఫిర్యాదులు, ఉత్తరాలు రాసే బ్యాచ్ ఉంటుంది! ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు, అసంతృప్తులు అన్నీ షరా మామూలే! కానీ విజేత ఒక్కరే ఉంటారు! అతడే రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి! మిత్రుడు నరేందర్ రెడ్డికి అభినందనలు…. – డా. మహ్మద్ రఫీ
Share this Article