Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందుకే సాక్షిలో పనిచేయడానికి చాలా మంది రిపోర్టర్లకు ఇష్టం…

June 22, 2026 by M S R

.

అందుకే సాక్షిలో పనిచేయడానికి చాలా మంది రిపోర్టర్లకు ఇష్టం… ఇక్కడ ఎవరూ ఏదీ పట్టించుకోరు… సబ్ చల్తా. అంత బ్రహ్మాండంగా ఆ సిస్టమ్ తీర్చిదిద్దిన మహానుభావులు ఎందరో, అందరికీ తెలుగు పాత్రికేయం అద్భుతంగా రుణపడి ఉంటుంది పాపం.

విషయం ఏమిటంటే..? నా దృష్టికి ఓ విషయం వచ్చింది, నిజానికి ఇందులో ఏముందిలే అనిపించింది చూడగానే… కానీ తరచి చూస్తే ఏడాది  క్రితం నాటి ఓ పాత కథనాన్ని యథాతథంగా అవే ఫోటోలు, అవే ఓపీనియన్స్, అదే టెక్స్ట్ తో పంపించినా సరే, సాక్షి అచ్చేస్తుంది, కళ్లకద్దుకుని.

Ads

గతంలో ఈనాడులో క్వాలిటీ సెల్ అని ఓ విభాగం ఉండేది, ఆంధ్రజ్యోతిలో ఉందో లేదో తెలియదు గానీ, పాపం సాక్షిలోనూ గతంలో ఒకటి ఉండేది, ఇప్పుడుందో లేదో తెలియదు, కనీసం నామ్‌కేవాస్తే కొనసాగిస్తున్నారో లేదో కూడా తెలియదు.

నిజానికి పత్రిక ఇజ్జత్ పోవద్దూ అంటే, ఓ క్వాలిటీ సెల్ ఉండాలి, అందులో ఉండేవాళ్లకు పాత్రికేయ స్పృహ కూడా ఉండాలి, యాజమాన్యానికి పత్రికలో లోటుపాట్లను చెబుతూ ఉండాలి, అఫ్‌కోర్స్, మేనేజ్‌మెంటే అలా ఏడిస్తే ఎవరూ ఏమీ చేయలేరు, అది వేరే విషయం.

ఈ సందేహం ఎందుకు వచ్చిందీ అంటే, ఈ రెండు వార్తలు చూడండి.

సాక్షి

ఇది మే 13, 2025 నాడు పబ్లిష్ చేశారు. ఇదుగో ఈ క్లిప్పింగ్ చూడండి.

సాక్షి

నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ (బాల్కొండ) నుంచి జనరేటైన వార్త. అప్పుడూ ఇప్పుడూ నవీన్ యాదవ్ అనే బాధిత రైతే కనిపిస్తాడు కథనాల్లో. అదే కంటెంటు దాదాపుగా ఆ కథనంలో, ఈ కథనంలో. అదే ఇష్యూ.

సో, అందుకే చెప్పింది, సాక్షిలో పనిచేయడం ఈజీ. ఏదో ఒకటి రాసేస్తే సరి, పేజీ నిండిందా లేదాని డెస్కు చూసుకుంటుంది. సిస్టం చూసుకోవాల్సిన బాధ్యులు ఎవరి పర్సనల్ యవ్వారాల్లో వాళ్లు బిజీగా ఉంటారు. శుభం. ఏమిటిలా అని అడిగేవారు ఉండరు, అసలు వాళ్లకు తెలిస్తే కదా. ముందే చెప్పుకున్నాం కదా, సాక్షిలో సబ్ చల్తా… జగన్ సర్, మీరు గ్రేట్ సర్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కొలువు – కొడుకును అమెరికాలో చదివించడం ఏమంత కష్టం?
  • ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?
  • గంజి వంపేద్దాం ! ఇప్పుడు WHO చెప్పిందే మన బామ్మలూ చెప్పారు !!
  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions