.
Subramanyam Dogiparthi ….. నర్తనశాల సినిమాలో విరాటరాజు కొలువులో ధర్మరాజు ఇద్దరు బిడ్డల గొడవలో తీర్పు చాలామందికి గుర్తుండే ఉంటుంది . ఆ కేసు లాంటి కేసు చుట్టూ తిరుగుతుంది 1990 సంక్రాంతి సీజన్లో విడుదలయిన ఈ జడ్జిమెంట్ సినిమా .
(నర్తనశాల సినిమాలో ఓ సీన్… నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు తల్లుల పంచాయితీ… కంకుభట్టు పాత్రలో ఉన్న ధర్మరాజు బిడ్డను రెండు ముక్కలు చేసి పంచుకొండి అని తీర్పు చెబుతాడు… వెంటనే అసలు తల్లి ‘వద్దు’ ఆమెకే ఇచ్చేయండి అని చెబుతుంది… ఆ వద్దు అని చెప్పిన తల్లే అసలు తల్లి అని అంతిమతీర్పు చెబుతాడు… తల్లి ప్రేమ…)
Ads
అయితే రెండు ఉదంతాలలో తేడా ఏంటంటే నర్తనశాల కధలో బిడ్డ ఒక్కతే . కానీ , ఈ 1990 సినిమాలో క్లైమాక్సులో ఇద్దరు ఒకే పోలికతో ఉండటం , అసలు కన్న తల్లి ఉదారంగా పెంచిన తల్లికే ఒక బిడ్ఢను ఇచ్చేందుకు క్లైమాక్స్‌లో అంగీకరించడంతో సమస్య పరిష్కారం అవుతుంది.
రామోజీరావు గారి ఉషాకిరణ్ మూవీస్ బేనర్లో వచ్చిన ఈ సినిమా కధను ఉషాకిరణ్ మూవీస్ వారి కధగా టైటిల్సులో వేసారు . డైలాగులను పరుచూరి బ్రదర్స్ వ్రాసారు . పాటల్ని వేటూరి , సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర పాడారు .
సినిమాలో మూడు పడుచు జంటలు , ఒక ప్రౌఢ జంట ఉంటాయి . పడుచు జంటలు శివకృష్ణ , యమున ; సుధాకర్ , ముచ్చెర్ల అరుణ ; వినోద్ కుమార్ , కల్పన . ప్రౌఢ జంట అన్నపూర్ణ , మన్నవ బాలయ్య . అన్నపూర్ణ డాక్టర్ , బాలయ్య మేజిస్ట్రేట్ . వినోద్ కుమార్ ఇనస్పెక్టర్ , కల్పన లాయర్ . ప్రేమించి పెళ్లి చేసుకుంటారు .
శివకృష్ణ , యమున గారడీ ఆటగాళ్లు . సుధాకర్ వ్యాపారస్తుడు , ముచ్చెర్ల అరుణ గృహిణి … కధ టూకీగా ఏంటంటే….: సుధాకర్ , అరుణ జంట బిడ్డ లక్ష్మి తప్పిపోతుంది . వాస్తవానికి రౌడీ చలపతిరావు ఎత్తుకుపోతాడు . మిస్సయిన బిడ్డ కోసం వెతుకుతున్న సుధాకర్ , అరుణలకు శివకృష్ణ , యమున వద్ద గారడీ ఫీట్లు చేస్తున్న గౌరి అదే పోలికలతో కనిపిస్తుంది .
ఈ గొడవ కోర్టుకు చేరుతుంది . మలుపులు తిరిగి చివరకు డాక్టర్ సాక్ష్యంతో సమస్య పరిష్కారం అవుతుంది . యమున , అరుణ ఇద్దరూ ఒకేసారి అన్నపూర్ణమ్మ హాస్పిటల్లో ప్రసవిస్తారు . అరుణ బిడ్డను కుక్క ఎత్తుకుపోతుంది . హాస్పిటల్ పరువు పోతుందని యమునకు పుట్టిన ఇద్దరు కవలల్లో ఒకరిని అరుణ పక్కలో పడుకోబెడుతుంది .
అంటే సినిమాలో ఇద్దరు బిడ్డలు ఉన్నారు . సుధాకర్ , అరుణ బిడ్డ దొరకటంతో సమస్య పరిష్కారం ఇంకా సులభం అవుతుంది . యమున ఒక బిడ్డను అరుణకు ఇచ్చేయమని మెజిస్ట్రేట్ గారికి చెప్పి అందరి మెప్పు పొందటంతో సినిమా శుభాంతం అవుతుంది .
కధకు ఆయువుపట్టయిన లక్ష్మి , గౌరి పాత్రల్ని అప్పుడు బేబీ సుజిత వేసింది . పసివాడి ప్రాణంలో నటించిన బేబీ సుజాత . జంటలన్నీ బాగా నటించాయి . నిర్మలమ్మ , మా గుంటూరు జయలలిత , చలపతిరావు , రాళ్ళపల్లి , మల్లికార్జున రావు , వంకాయల , తదితరులు నటించారు .
సినిమా బాగుంటుంది . చూడతగ్గ సినిమాయే . చూడబుల్ సినిమాగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు మోహన్ గాంధీదే . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article