.
‘‘గతంలో సారా తాగి 115 ఏళ్లపాటు బతికారు, కానీ ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు… రాష్ట్రంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని నేను అసెంబ్లీలో కోరతాను… సైంటిఫిక్‌గా సారా మనిషి ఆరోగ్యానికి హానికరం ఏమీ కాదు, ఇటీవల కొన్ని రాష్ట్రాలు సారా దుకాణాలు ప్రారంభించాయి… అసలు తెలంగాణలో సారా దుకాణాలు ఎందుకు బంద్ చేశారో క్లారిటీ రావాలి…’’ ఇవే కదా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు…
ఈ వ్యాఖ్యల మీద వ్యతిరేకత బాగానే వచ్చినట్టుంది, వెంటనే ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించాడు… నో, నో, నేను ఇప్ప సారాను ప్రమోట్ చేయాలని కోరుతున్నాననీ, తెలంగాణ సంప్రదాయ సారాగా గుర్తించాలని, అదే అసెంబ్లీలో మాట్లాడతాననీ, తన వ్యాఖ్యల్ని మీడియా సరిగ్గా రాయలేదనీ క్లారిటీ ఇచ్చాడు… వేల ఏళ్లుగా ఇప్ప పూల నుంచి సారా తయారు చేసేవారు, కానీ మద్యం అమ్ముకోవడం కోసం దాన్ని బంద్ పెట్టించారు, తెలంగాణ బ్రాండ్ ఇప్పసారా ప్రమోట్ చేస్తే ఆదివాసీ బిడ్డలకు ఉపాధి కలుగుతుంది అని చెప్పుకొచ్చాడు…
Ads
నిజానికి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా సరే, అందులో తను చింతించాల్సింది ఏమీ లేదు… ఎందుకంటే..? అనేకానేక కృత్రిమ పద్ధతుల్లో తయారైన నకిలీ సారా విస్తృతంగా లభిస్తోంది… అది అలవాటైన వాళ్లు ఒక్కరోజు అది దొరక్కపోయినా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు… గుడుంబా… ఇదే సమాజానికి హానికరం… దానికితోడు చీప్ లిక్కర్ కూడా గుడుంబాతో సమానం… ధర ఎక్కువ, చేటు ఎక్కువ… సో, వీటితో పోలిస్తే ప్రభుత్వమే నాణ్యమైన సారా అమ్మితే తప్పులేదు…

గతంలో ఎన్టీఆర్ కూడా వారుణి వాహిని పేరిట సారా పాకెట్లు అమ్మించాడు… సరే, తను ఖజానా ఆదాయం కోసం దాన్ని ప్రవేశపెట్టాడా..? మార్కెట్‌లో గుడుంబా నియంత్రణకు ఆలోచించాడా అనేది వదిలేస్తే చిన్న చిన్న పాకెట్లలో వారుణి వాహిని దొరికేది… ప్రభుత్వమే అమ్మేది… అప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న సారా బడా సిండికేట్ల వెన్నువిరిగింది…
- సరే, సారాను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చిన తనే తరువాత మద్యనిషేధం పెట్టాడు, చంద్రబాబు కుర్చీ ఎక్కాక దాన్ని ఎత్తిపారేశాడు… అదంతా వేరే కథ… కానీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దేశీ దారు పేరిట అమ్ముతూనే ఉంటారు… ఇక్కడే మరొకటీ చెప్పుకోవాలి… అది కేసీయార్ ఘనకార్యం గురించి…
తను అధికారంలోకి వచ్చాక ఈ గుడుంబా నియంత్రణకు సర్కారు ఆధ్వర్యంలోనే వారుణి వాహిని వంటి ప్రభుత్వ సారా దుకాణాలు తెరవాలని ఆలోచించాడు… ఇదీ అప్పట్లో సాక్షిలో వచ్చిన వార్త…

నిజానికి ఇది తప్పుడు ఆలోచన ఏమీ కాదు… కల్తీ సారా లేదా నాటు సారా మాఫియాలకు, ప్రమాదాలకు ఓ రకమైన నియంత్రణ… నిజానికి ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే నానారకాల బ్రాండ్ల చీప్ లిక్కర్ కన్నా మేలే… ఏపీలో జగన్ హయాంలో పెద్ద ఎత్తున సాగిన చీప్ లిక్కర్ వ్యవహారం – కుంభకోణం కథలు ఇంకా వార్తల్లో చదువుతూనే ఉన్నాం కదా… పేదల ఒళ్లూ, పర్సులు గుల్ల…
- ప్రభుత్వ సారా ఆలోచన చేసిన కేసీయార్ అది చేయకపోగా… కల్లు కంపౌండ్లు తెరిపించాడు… వాటిల్లో కల్తీ కల్లు ఏరులై పారింది… కొన్నిరోజులు ఎక్సయిజు శాఖ బెల్లం అమ్మకాలపై కూడా ఆంక్షలు పెట్టి దాడులు చేసింది… ఒకవైపు కల్తీ సారా నియంత్రణ అంటూ మరోవైపు కల్తీ కల్లుకు ప్రోత్సాహం… పక్కా కంట్రాస్టు… పరస్పర విరుద్ధ ధోరణులు…
జడ్చర్ల ఎమ్మెల్యే ఏ ఉద్దేశంతో సర్కారు సారా అని వ్యాఖ్యలు చేశాడో, మళ్లీ ఇప్ప సారా అని కవరింగు చేసుకున్నాడో గానీ… ప్రభుత్వ సారా అనేది నిజంగా డిబేటబుల్ సబ్జెక్టే..!! సారా తాగి 110 ఏళ్లు బతికేవాళ్లు, సారా హానికరం కాదు, మద్యంతో 80 ఏళ్లే బతుకుతున్నారు అనే వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరం, రంగు మద్యం (చీప్ లిక్కర్) ఎప్పుడూ ఎక్కువ ప్రమాదకరమే…
బీహార్‌లో మద్యనిషేధం ఓ ఫ్లాప్… గుజరాత్‌లో కొంత కంట్రోల్ ఉందంటారు… బీహార్‌లో మళ్లీ పాత కల్తీ సారా సిండికేట్లు ప్రాణం పోసుకున్నాయి… ఈ స్థితిలో ప్రభుత్వ నియంత్రణలో సారా అనేది ఆ మాఫియాలకు ఓరకమైన నియంత్రణ… అవును గానీ ఇక్కడే మరొకటీ చెప్పుకోవాలి…

- ఇవీ టాప్ లిక్కర్ సేల్స్ తాజా ఫిగర్స్… కర్నాటక టాప్… (బీర్లు గాకుండా ఇతర మద్యం కేసుల సంఖ్య ఇది)… తమిళనాడు సెకండ్, తరువాతే తెలంగాణ… మాట్లాడితే తెలంగాణవాళ్లు తాగుబోతులు అని ముద్రలు వేసి వెక్కిరిస్తుంటారు కదా… ఫోర్త్ ప్లేస్ ఏపీదే… తను తాగుతూనే తెలంగాణ వైపు చూపిస్తుంది ఏపీ… నిజానికి హైదరాబాద్ విడదీసి తెలంగాణ జిల్లాల లెక్కలు తీస్తే… ఏపీకన్నా తెలంగాణజనం సగటు మద్యవినియోగం తక్కువే ఉంటుంది..!!
Share this Article