.
ఆపరేషన్ సిందూర్ వెంటనే ఆపించాలంటూ పాకిస్థాన్ ఎందుకు అమెరికా కాళ్లావేళ్లా పడింది..? ఇది ఎప్పుడూ ఓ ప్రశ్నే..! ఊహాగానాలు బోలెడు, నిర్దారిత సమాచారం అత్యల్పం… మన దేశం- మన భద్రత అనే సోయి లేని మన ప్రతిపక్ష నేతలు ఏవో కూస్తుంటారు..? ఎన్ని జెట్లు కూలాయి, తొలిరోజే మనం చేతులెత్తేశామా అనే ప్రశ్నలు సంధిస్తుంటారు…
తాజాగా ఓ వార్త ఆపరేషన్ సిందూర్ ఎంత కచ్చితత్వంతో, పాకిస్థాన్ కీలక సైనిక స్థావరాలను దెబ్బతీశాయో, చివరకు మరమ్మత్తులు కూడా సాధ్యం గాకుండా ఎంత నష్టపరిచాయో చెబుతోంది… ఆ వార్త ఏమిటంటే..?
Ads
‘‘గతేడాది భారత వైమానిక దళం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ ధాటికి పాకిస్థాన్‌లోని అత్యంత కీలకమైన మురిద్ ఎయిర్ బేస్ పూర్తిగా నేలమట్టమైంది… చక్వాల్ సమీపంలోని ఈ వ్యూహాత్మక స్థావరంలో ధ్వంసమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్ధరించడానికి పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి… తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం, అక్కడ మరమ్మతులు చేయడం సాధ్యం కాదని తేలడంతో పాక్ అధికారులు ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు…
ఫిబ్రవరి 28న అందిన ఫోటోలలో అక్కడ కేవలం శిథిలాలు మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం… ప్రముఖ శాటిలైట్ అనలిస్ట్ డామియన్ సైమన్ విశ్లేషణ ప్రకారం, ఈ భవనం లోపలి ప్రధాన నిర్మాణం తీవ్రంగా దెబ్బ తింది… గతంలో ఈ విధ్వంసాన్ని కప్పిపుచ్చేందుకు పాక్ సైన్యం టార్పాలిన్ షీట్లను వాడినప్పటికీ, ఇప్పుడు అక్కడ ఏమీ మిగలలేదు…
2025 మే 10న భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిన 10 ప్రధాన పాక్ ఎయిర్‌బేస్‌లలో మురిద్ కూడా ఒకటి… ఇక్కడి నుంచే భారత్ పైకి డ్రోన్ల దాడులు సాగుతుంటాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు… రఫేల్ యుద్ధ విమానాల నుండి ప్రయోగించిన శక్తివంతమైన ‘SCALP’ క్షిపణుల వల్లే పాకిస్థాన్‌కు ఇంతటి భారీ నష్టం సంభవించిందని విశ్లేషిస్తున్నారు…
భారత గగనతలం నుంచే ప్రయోగించిన క్షిపణులు పాక్ భూభాగంలోని వ్యూహాత్మక లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించడం అగ్రరాజ్యాలను సైతం ఆశ్చర్యపరిచింది… మురిద్ ఎయిర్ బేస్ ను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు పాకిస్థాన్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు… అయితే భవనం పునాదులతో సహా కదిలిపోవడంతో దానిని పూర్తిగా తొలగించడమే ఉత్తమమని వారు భావించారు… ఈ పరిణామం పాక్ రక్షణ వ్యవస్థలోని బలహీనతలను మరోసారి బయట పెట్టింది…’’

మురిద్ ఎయిర్ బేస్ ఎందుకు కీలకం? మురిద్ ఎయిర్ బేస్ పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ముఖ్యమైన ఎయిర్ ఫోర్స్ సదుపాయం. ఇది ప్రధానంగా Pakistan Air Force కి చెందిన ప్రత్యేక యూనిట్ల కోసం ఉపయోగిస్తారు…
-
పాకిస్థాన్‌కు చెందిన UCAV (armed drones) ఆపరేషన్లు ఇక్కడి నుంచే జరుగుతాయని విశ్లేషకులు చెబుతారు…
-
పాకిస్థాన్ అణ్వాయుధ వ్యవస్థలను పర్యవేక్షించే Strategic Plans Division కు సపోర్ట్ చేసే కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇక్కడ ఉండే అవకాశం ఉందని కొన్ని రిపోర్టులు చెబుతాయి…
-
అయితే ఉపగ్రహ చిత్రాల్లో నేల కింద నిర్మాణాలు కనిపించడం వల్ల ఇది సాధారణ ఎయిర్‌బేస్ కాదని భావిస్తారు…
అణ్వాయుధాలు అక్కడ ఉన్నాయా? ఇది మాత్రం స్పష్టంగా ఎక్కడా అధికారికంగా నిర్ధారించబడలేదు… కానీ అనుమానం ఎందుకు వస్తుంది అంటే… పాకిస్థాన్ అణు కేంద్రాలకు దగ్గర ప్రాంతం, భూగర్భ నిర్మాణాలు, కఠినమైన భద్రత, ఉపగ్రహ చిత్రాల్లో కనిపించే బంకర్లు… అందుకే ఇండియా దాన్ని టార్గెట్ చేసి కొట్టింది…
పాకిస్థాన్ అణ్వాయుధాలకు ప్రధాన కేంద్రంగా సాధారణంగా చెప్పేది Kahuta Research Laboratories ప్రాంతం… మురిద్ బేస్ అక్కడి స్ట్రాటజిక్ నెట్‌వర్క్‌లో భాగమై ఉండొచ్చు అని మాత్రమే విశ్లేషకులు అనుకుంటున్నారు…
కమాండ్ – కంట్రోల్ నెట్వర్క్ పాకిస్థాన్ అణు వ్యవస్థను పర్యవేక్షించే ప్రధాన సంస్థ Strategic Plans Division… ఈ సంస్థకు చెందిన కమ్యూనికేషన్ లేదా కమాండ్ సపోర్ట్ ఫెసిలిటీలు మురిద్ బేస్‌లో ఉండొచ్చని కొన్ని రిపోర్టులు చెబుతాయి… అంటే యుద్ధ పరిస్థితిలో డ్రోన్లు, మిస్సైల్ యూనిట్లు, ఇంటెలిజెన్స్… ఇవన్నీ సమన్వయం చేసే కేంద్రంగా ఉండొచ్చు…
పాకిస్థాన్ అణ్వాయుధాలు ఎక్కడ ఉంటాయి? పాకిస్థాన్ తన అణ్వాయుధాల రక్షణ విశ్లేషణల్లో తరచూ వినిపించే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి…
1️⃣ కహూటా Kahuta Research Laboratories, పాకిస్థాన్ అణు ప్రోగ్రామ్‌కు గుండె అని చెప్పొచ్చు, యురేనియం ఎన్రిచ్మెంట్ ఇక్కడే జరుగుతుంది…
2️⃣ సర్గోదా ప్రాంతం Sargodha Air Base, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాటజిక్ వింగ్, అణ్వాయుధాలు మోయగల ఫైటర్ జెట్లు…
3️⃣ ఖుజ్దార్ – బెలూచిస్తాన్ Khuzdar, కొన్ని విశ్లేషణల ప్రకారం భూగర్భ స్టోరేజ్, రహస్య మిలిటరీ డిపోలు ఉండే అవకాశం…
ఏ దేశమైనా అణ్వాయుధాలను ఒక్కచోట దాచి ఉంచదు… విభజించి వేర్వేరు చోట్ల నిల్వ చేస్తుంటారు… పైగా వార్ హెడ్స్ వేరు, మిసైళ్లు వేరుగా ఉంచుతారు… ఏవేవి కీలక ప్రాంతాలో గుర్తించి మరీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది… అదీ కథ…
Share this Article