.
ఏదో ఒకటి గెలుక్కోవడం, తరువాత సారీ చెప్పి లెంపలేసుకోవడం సినిమా సెలబ్రిటీలకు, ప్రత్యేకించి టాలీవుడ్ పెద్ద తలకాయలకు, అఫ్ కోర్స్, చిన్నాచితకా తలకాయలకూ పరిపాటే కదా.,. ‘ఎవరైనా బాధపడితే సారీ’ అని ఓ తిక్క కవరింగు…
అసలు గుంజీ గుంజీ అనే ఓ తిక్క కేరక్టర్ అల్టిమేట్… ఆ రేంజుకు ఇంకెవరూ చేరుకోలేరు… ఈటీవీ ప్రభాకర్ నువ్వు గర్వపడు, కాలరెగరేయ్ అన్నా… నీకేం తక్కువ, నీ పంపకంలో యాటిట్యూడ్ స్టార్ పదునెక్కిన తీరు నీకు గర్వకారణం…
Ads
సరే తాజాగా రాజేంద్ర ప్రసాద్, శివాజీల పిచ్చి కూతలను కాసేపు పక్కన పెడితే… ఈ కాస్త టెంపర్ కనిపించే మరో కేరక్టర్ హరీష్ శంకర్… ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ట్విట్టర్లో ఈసారి ఓపెనింగ్స్ తో మహేష్ బాబు సినిమా కలెక్షన్స్ కొట్టాలి అని పెడితే, మనోడు “తధాస్తు ” అని రిప్లై ఇచ్చాడంట… ఇంకేదో ట్వీటాడట కూడా…
అసలే మహేష్ బాబు ఫ్యాన్స్ కదా, ఊరుకుంటారా…? అసలు ఏ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు, అసలే మనం ఫ్యానిజం బతుకులీడుస్తున్నం కదా… అదే ట్విట్టర్‌లో హరీష్ శంకర్‌ను తగులుకున్నారట… దాంతో దిక్కులేక చివరకు ఇలా వివరణ ఇచ్చుకున్నాడు…

ఈ క్షమాపణ పత్రాన్ని తెలుగులో కింద ఇస్తున్నాను…
నిన్న నాకు చాలా బిజీగా గడిచింది… సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్ ప్రోమో ఫైనల్ చెక్స్, ప్రమోషన్లలో పాల్గొన్నాను… ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ గారి స్టూడియోకి వెళ్లాను…
ఈ సమయంలోనే, ప్రోమోను అభినందిస్తూ మెసేజ్ చేస్తున్న జర్నలిస్టులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు రిప్లై ఇస్తున్నాను… ఆ హడావిడిలో ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను… నిమిషం వ్యవధిలోనే నా టీమ్ ఆ విషయాన్ని గమనించి, ట్వీట్‌ను పూర్తిగా చదవమని నాకు చెప్పారు… వెంటనే నా తప్పు తెలుసుకుని ఆ ట్వీట్‌ను తొలగించాను…
సూపర్‌స్టార్ మహేష్ బాబు గారిపై నాకు అపారమైన గౌరవం ఉంది… నిజానికి, ‘వారణాసి’ చిత్రంతో ఆయన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించబడతాయని నేను ఎప్పుడూ నమ్ముతాను… ఇది కేవలం అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప, ఆయనను కానీ, ఆయన అభిమానులను కానీ బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు… ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమా గురించి నేను చేసిన ట్వీట్లు చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ, గౌరవం మీకు అర్థమవుతుంది…
అయినప్పటికీ, ఆ చిన్న పొరపాటు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, నేను హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను…. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అన్ని వర్గాల అభిమానుల ప్రేమ, మద్దతు అవసరం… నా సినిమా మరో 10 రోజుల్లో విడుదలవుతుండగా, ఇలాంటి పోస్ట్‌లు చేసేంత అవివేకిని కాను…
మరోసారి, జరిగిన పొరపాటుకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతూ, మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను…. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు….
గాలికి పోయే కంపను డ్యాష్ డ్యాష్ కు తగిలించుకోవడం దేనికి..? తరువాత దుమ్మూదుమారం రేగాక, తప్పనిసరై, విధిలేక, వేరే దిక్కులేక, భయపడి ఇలా లెంపలేసుకుని సారీ సారీ అని బతిమిలాటలు దేనికట...!!
Share this Article