Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహేశ్ బాబు లుక్‌కు ఎఐ నగిషీలు- సిక్స్ ప్యాక్ ప్రయాసలు..?

November 28, 2026 by M S R

.

ఏ జానర్ సినిమా ఐనా సరే… ఇతర హీరోల్లాగా… మహేశ్ బాబు బాడీ ఎక్స్‌పోజ్ చేసినట్టు కనిపించదు… కొందరు హీరోలు కావాలని సిక్స్ ప్యాకులు, ఎయిట్ ప్యాకుల కోసం… కథలో అవసరం లేకపోయినా బాడీని ప్రదర్శించడానికి… ఏవేవో  ఇంజక్షన్లు, జిమ్ములు, సర్జరీలు మన్నూమశానాలు ఆశ్రయిస్తుంటారు… ఆ మొహాల్లో భావాలు పలకకపోయినా సరే…

ఈ దిశలో బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న పెద్ద హీరోల గురించీ, వారి మొహాల్లో అంతకుముందుండే జీవకళ చచ్చిపోయిన తీరూ గమనించాం… ఈ ధోరణికి మహేశ్ బాబు పూర్తిగా విరుద్ధం… కనీసం షర్ట్ విప్పి ఛాతీ కూడా ప్రదర్శించడు… అలాగని ఒబే బాడీ కూడా కాదు, ఫెయిర్ కలర్, స్లిమ్ బాడీయే కదా… ఐనా సరే తను తనలాగే ఉంటాడు…

Ads

ఐతే హఠాత్తుగా వారణాసి సినిమాకు సంబంధించిన ఏదో వార్తలో తన ఫోటో చూసి ఆశ్చర్యం కలిగింది… అందులో మహేశ్ బాబు సిక్స్ ప్యాక్‌తో ఏ ఆచ్ఛాదన లేకుండా కనిపిస్తున్నాడు… ఔనా… దర్శకుడు రాజమౌళి కాబట్టి, నీ పాత ధోరణి వదిలేయవోయ్, నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తాను నిన్ను అని షరతు పెట్టాడా..? విధి లేక మహేశ్ బాబు తలొగ్గాడా..?

నిజానికి ఇది చిన్న విషయం… కానీ ఇండస్ట్రీలో హీరోస్వామ్యం నడుస్తోంది… హీరోల పాదాల మీద పాకుతోంది… పెద్ద పెద్ద దర్శకులు సైతం హీరోలు చెప్పినట్టే కథలు మారుస్తున్న తీరు తెలుసు కదా… రామాయణంలో యశ్ నిర్మాత కమ్ నటుడు కాబట్టి, తన ఇమేజ్‌కు తగినట్టు రావణుడి పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దిన తీరు చూశాం కదా…

సో, ఈ వాతావరణంలో ఒక దర్శకుడు ఓ స్టార్ హీరోను చివరకు వేషధారణ విషయంలోనూ తను చెప్పినట్టు వినేలా చేయగలడా..? ఇదీ ప్రశ్న… తను ఎన్నిరోజులు చెబితే అన్నిరోజులు డేట్స్ ఇవ్వాలి, వేరే సినిమాలు చేయొద్దు, ఫోటోలు లీక్ చేయొద్దు, ఏమీ మాట్లాడొద్దు… కథలెంత వక్రగతితో ఉన్నా సరే, తెలుగు సినిమాను ఓ రేంజుకు తీసుకుపోయాడు కాబట్టి హీరోలు మారుమాట్లాడకుండాా తను చెప్పినట్టు ఆడుతున్నారా..?

mahesh babu

ఇదే అడిగితే ఓ సినిమా మిత్రురాలు, హహహ… అంత సీన్ లేదు, ఇది బాడీ ప్లస్ బాడీ డబుల్ +VFX + AI ఇంటిగ్రేటెడ్ ఇమేజ్ అని నవ్వింది… ఇప్పుడు మరింత ఆశ్చర్యం, చివరకు కథానాయకుల లుక్‌కు కూడా ఎఐ, గ్రాఫిక్స్ వాడుతున్నారా అని… ఇది ఎఐ చిత్రమో కాదో తెలియదు… నిజంగానే మహేశ్ బాబు లుక్ మార్చారో కూడా తెలియదు… కానీ రాజమౌళీ నువ్వు తోపువు సుమా అనాలనిపించింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహేశ్ బాబు లుక్‌కు ఎఐ నగిషీలు- సిక్స్ ప్యాక్ ప్రయాసలు..?
  • నోటిమాటలు చాలు… నోటరీలు కాపురాల్ని నిలబెట్టలేవు!
  • బుక్ చేసుకొండి- ‘ఆ నలుగురు’ వస్తారు, పాడె మోస్తారు, కట్టె కాలుస్తారు
  • గరివిడి నుంచి గరికపాటి వరకు… ఇద్దరూ లక్ష్ములే… ఇద్దరిదీ ఎదురీతే!
  • ఇండియాపై చైనా- పాకిస్తాన్- బంగ్లాదేశ్‌ ఉమ్మడి కుట్ర – పార్ట్ 1
  • కార్తీకదీపం వెలగాల్సిందే- విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్!!
  • నాన్న కుట్టి… సెంటిమెంట్ ఉంది… కనెక్టివిటీ ఏది ఆంటోనీ..?
  • తెలంగాణతనం అంటే రక్తపాతమేనా? ఇదేం ‘భోగి’రా శర్వానందూ..!!
  • ఓ రాత్రి- ముసురు, చీకటి, చలి – ఓ బస్టాపులో ఆ ముగ్గురు… తరువాత?
  • వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions