.
అధికారం దక్కని చోట.. అపవాదులే ఆయుధాలా? ‘చాణక్య’ వ్యూహమా.. లేక కడుపుమంటా?
రాజకీయాల్లో శత్రువుకు మిత్రుడు మిత్రుడవ్వడం సహజం… కానీ, స్నేహితులే పరమ శత్రువులుగా మారడం, అది కూడా సిద్ధాంతాలను వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగడం ఒక విచిత్రమైన పరిణామం… ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సుబ్రహ్మణ్య స్వామి, మధు కిష్వర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుసరిస్తున్న తీరు సరిగ్గా ఇలాగే ఉంది… ఒకప్పుడు నరేంద్ర మోదీకి వీర విధేయులుగా, ఆయన ఇమేజ్‌ను ఆకాశానికి ఎత్తేసిన ఈ మేధావులు.. ఇప్పుడు అదే మోదీపై నిందల పర్వానికి తెరలేపడం వెనుక అసలు కథ ఏమిటి?
Ads
1. పదవి రాని చోట పుట్టిన పగ! సుబ్రహ్మణ్య స్వామి మేధస్సు గురించి ఎవరికీ సందేహాలు లేవు… కానీ, తనకంటే తక్కువ అనుభవం ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక మంత్రి పదవి ఇవ్వడం, తనను కేవలం రాజ్యసభ ఎంపీగా సరిపెట్టడం ఆయన అహం దెబ్బతినడానికి కారణమైంది… మూడు దఫాలుగా ఎదురుచూసినా మంత్రి పదవి దక్కకపోవడంతో, ఆ అసహనం ఇప్పుడు హద్దులు దాటింది… కేవలం విధానపరమైన విమర్శలు చేస్తే ఫర్వాలేదు, కానీ ఏకంగా మహిళా ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాలను కూడా శంకించే స్థాయికి ఆయన దిగజారడం మేధావి వర్గాల్లో చర్చనీయాంశమైంది…
2. ‘మోడీనామా’ నుండి ‘మోదీ వ్యతిరేకత’ వరకు… మధు కిష్వర్ ప్రయాణం ఇంకా విచిత్రం… ఒకప్పుడు కాశ్మీర్ వేర్పాటువాదుల వెనుక తిరిగిన ఆమె, 2014లో మోదీ హవా చూసి ప్లేటు ఫిరాయించింది… “మోడీనామా” అంటూ పుస్తకాలు రాసి ఆయనను ఆకాశానికి ఎత్తేసింది… అయితే, ఆమె ఆశించిన రాజ్యసభ సీటు గానీ, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు గానీ దక్కకపోవడంతో ఇప్పుడు ఆమె స్వరం మారింది… స్త్రీ అయి ఉండి, తోటి మహిళా నేతలపై ఆమె చేస్తున్న ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి…
3. కోటను కూల్చే ‘పలుగు-పార’ వ్యూహం … యుద్ధంలో నేరుగా ఫిరంగులతో కోటను కూల్చలేనప్పుడు, లోపల నుంచి పునాదులను మెల్లమెల్లగా తవ్వేయడం ఒక వ్యూహం… మోదీని అవినీతి కోణంలో గానీ, పాలనాపరంగా గానీ దెబ్బతీయడం సాధ్యం కాదని ప్రత్యర్థులకు అర్థమైంది.. ఆయనకున్న అతిపెద్ద బలం – “వ్యక్తిగత నైతికత”…
-
రాజకీయ సిద్ధాంతాలు, ఆచరణ, పోకడ, దూకుడు వంటి విషయాల్లో విభేదించేవాళ్లు సైతం నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతల వ్యక్తిగత జీవితంపై బురద జల్లడానికి పూనుకోరు… ఆ నైతికతను దెబ్బతీస్తే తప్ప ప్రజల్లో వారిపై ఉన్న నమ్మకాన్ని సడలించలేమని భావించిన ఈ ‘మేధావుల ముఠా’, ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి (Character Assassination) దిగింది…
4. 2029 లక్ష్యంగా ‘సైకలాజికల్ వార్’ 2029లో కూడా మోదీయే గెలుస్తారనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో, దేశ విదేశాల్లోని మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి… అదానీ -అంబానీ ఇష్యూలు పనిచేయకపోవడం, చైనా సరిహద్దు వివాదాలు ఓట్లు రాల్చకపోవడంతో.. నేరుగా వ్యక్తిగత ఆరోపణలే ఆఖరి ఆయుధంగా మార్చుకున్నారు…
రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, కానీ అవి వ్యక్తిగతంలోకి దిగజారకూడదు … ఒక కోటను కూల్చడానికి ‘పలుగు-పార’ పట్టిన వీరు, తాము చేస్తున్న ఆరోపణల వల్ల తమ సొంత ప్రతిష్టే మంటగలుస్తోందని మర్చిపోతున్నారు…
నింద వేసినప్పుడు తటస్థులు “ఏమో జరిగి ఉండవచ్చు” అని చర్చించుకోవడమే వీరికి కావలసిన విజయం… మరి ఈ బురద జల్లుడు రాజకీయాలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారో కాలమే నిర్ణయించాలి… మోడీ స్పందించేలా చేసి, మరింత గోకి, మరింత బురద జల్లాలనేది ప్లాన్… మోడీకి కూడా ఈ విషయం తెలుసు… అందుకే ఎప్పటిలాగే ఓ నవ్వు నవ్వేసి, వదిలేస్తున్నాడు..!!
Share this Article