Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Balochistan – భారత్ Vs చైనా Vs అమెరికా! జియోపాలిటిక్స్ !!

August 11, 2026 by M S R

.

(  పొట్లూరి పార్థసారథి  )  ….. జియో పొలిటికల్ గేమ్!
భారత్ Vs చైనా Vs అమెరికా!
బలూచిస్తాన్ అనే ప్రాంతం ఎందుకంత ప్రాముఖ్యం ఈ మూడు దేశాలకి?
ఒకసారి బలూచిస్తాన్ భౌగొళిక స్వరూపం గురుంచి తెలుసుకుంటే అసలు విషయం అర్ధమవుతుంది.

బలూచిస్తాన్ అనేది ఖనిజ సంపదతో కూడుకున్న ప్రాంతం. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ఖనిజ సంపదలో 80% బలూచిస్తాన్ లోనే ఉంది.

Ads

బలుచిస్థాన్ లోని ఛాగై రస్-కోహ్ మాగ్మేటిక్ ఆర్క్ ( Chagai Raskoh Magmatic Arc ) అనే చోట కేంద్రీకృతమైన ఖనిజసంపద అపారంగా ఉంది కానీ ఈ ప్రదేశానికి చేరుకోవడం చాలా కష్టమైన పని. 1947 నుండి ఇప్పటివరకు సైన్యం అదుపాజ్ఞలలో పౌర ప్రభుత్వాలు ఉండడం వలన, బలూచిస్తాన్ లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడం వలన ఈ ప్రాంతం వెనుకపడిపోయి ఉంది.

బంగారం – రాగి : చాగై జిల్లాలోని రెకోడిక్ లో 5.9 బిలియన్ టన్నుల ముడి బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఆ నిక్షేపాలని వెలికితీసే పని చేయలేదు పాకిస్థాన్.

సైన్దక్ ( Saindak ) రాగి, బంగారు గనులని తవ్వి ప్రాసెస్ చేస్తున్నాయి చైనాకి చెందిన సంస్థలు. చైనాకి లాభాలు తెచ్చి పెడుతున్నాయి ఈ గనులు. కానీ చైనా ఒక్క డాలర్ కూడా పాకిస్తాన్ కి చెల్లించడం లేదు.  ఎందుకంటే పాకిస్తాన్ కి ఇచ్చిన అప్పుకి వడ్డీ కింద జమ చేసుకుంటున్నది ఈ గనుల మీద వచ్చే ఆదాయాన్ని.

కుక్కకి బిస్కెట్ వేసినట్లు పాకిస్తాన్ సైనిక జెనరల్స్ కి ముడుపులు చెల్లిస్తున్నది, అదీ పాకిస్తాన్ రూపాయల్లో మాత్రమే. ఒక చైనా యువాన్ (CNY ) కి 41 పాకిస్తానీ రూపాయలు వస్తాయి. చైనా పాకిస్తాన్ కి ఇచ్చిన అప్పు మొత్తం యువాన్లలోనే ఇచ్చింది. బలూచీలు దీనినే ప్రధాన అంశంగా తీసుకొని చైనా, పాకిస్తాన్ లకి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నారు.

బొగ్గు: బలూచిస్తాన్ లోని కొహ్లు జిల్లా (Kohlu District ) లో అపారమైన ఫస్ట్ క్వాలిటీ బొగ్గు నిక్షేపాలు కేంద్రీకృతం అయి ఉన్నాయి. ఈ ప్రాంతం రాజధాని క్వెట్టాకి దగ్గరలోనే ఉంటుంది. బలూచిస్తాన్ మొత్తం బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.

ఇనుము :చాగై జిల్లా (Chagai District ) లో 3 కోట్ల టన్నుల మెరుగైన ముడి ఇనుము గనులు ఉన్నాయి. మెరుగైన అంటే మలినాలు తక్కువగా ఉండడం వలన తక్కువ ఖర్చుతో ప్రాసెస్ చేసి ఇనుముని ఉత్పత్తి చేయవచ్చు. చాగై జిల్లాలో ఎక్కువగా ఉన్నా ఇతర చోట్ల కూడా ఇనుప ఖనిజం ఉంది కానీ ఇంతవరకు పరిశోధన జరగలేదు. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ భయంతో చైనా శాస్త్రవేత్తలు రిమోట్ ప్రాంతాలకి వెళ్లలేకపోయారు. పైగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆ ప్రాంతాలకి వెళితే ప్రాణాలతో తిరిగివస్తామని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో ఆగిపోయింది.

క్రొమైట్ (Chromite ): బలూచిస్తాన్ లోని ముస్లిం బాగ్ ( ఖిల్లా సైఫుల్లా అని కూడా పిలుస్తారు ), లస్ బెల ప్రాంతాలలో క్రొమైట్ నిల్వలు ఉన్నాయి కానీ ఇంతవరకూ వాటిని వెలికితీసే పని చేయలేదు.

పారిశ్రామిక ఖనిజాలు ( Industrial Minerals ) : జిప్సం ( Gypsum ), హై క్వాలిటీ ఒనిక్స్ / మార్బుల్ ( Onyx / marble ), గంధకం (Sulphur ), బేరేట్స్ ( Barytes ) ఉన్నాయి కానీ విస్తృత పరిశోధన జరగలేదు.

హైడ్రోకార్బన్స్ : బలూచిస్తాన్ అనే ప్రదేశం ఆయిల్, సహజవాయువు నిక్షేపాల మీద కూర్చొని ఉన్నది. సూయ్ గ్యాస్ ఫీల్డ్ (Sui Gas field ) లో 19 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ సహజ వాయువు నిక్షేపాలు ఉండగా, 6 ట్రిలియన్ బారెల్స్ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గాస్ ఫీల్డ్ పనిచేస్తుండగా సర్వే చేయాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి కానీ చమురు అన్వేషణ అనేది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇంతవరకు సర్వే చేయలేదు.

రేర్ ఎర్త్ మినరల్స్ : చైనా రేర్ ఎర్త్ మినరల్స్ కి ప్రపంచానికే ఒక హాబ్. చైనా తన సాటిలైట్స్ ద్వారా తీసిన ఛాయా చిత్రాలతో బలూచిస్తాన్ లో రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నాయని గుర్తించింది. కానీ భూమి మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే కానీ ఏవేవి ఎంత మొత్తంలో ఉన్నాయో ఒక నిర్ధారణకి వస్తుంది.

ఒక ట్రిలియన్ డాలర్ల విలువ చేసే సహజ సంపద కలిగివుంది బలూచిస్తాన్!
పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే చైనాకి అత్యంత విలువైన ప్రదేశం బలూచిస్తాన్!
బలూచిస్తాన్ ని చైనా ఎలా వదులుకుంటుంది?

చైనా 1990 వ దశకంలోనే రాబోయే 30 ఏళ్లలో రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని నడుపుతాయి అని తెలుసుకొని భారీగా పెట్టుబడులు పెట్టింది పరిశోధన, అభివృద్ధి కోసం. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఎంత అభివృద్ధి చెందింది అంటే పారిశ్రామిక వ్యర్ధాలని వదిలే డ్రైనేజి నీటి నుండి మినరల్స్ ని వేరుచేసే ప్రక్రియలో అన్ని దేశాలకంటే ముందు ఉంది. అసలు ఇలాంటి ఆలోచన వాళ్లకి వచ్చింది అంటే ఎంతగా పరిశోధనలు చేసి టెక్నాలజీని అభివృద్ధి చేసిందో కదా?
బలూచిస్తాన్ అనేది చైనాకి డాలర్ల వర్షం కురిపించే కల్పవృక్షం!

China Pakistan Economic Corridor – CPEC
1990 నుండి చైనాకి బలూచిస్తాన్ మీద కన్ను ఉంది. గ్వాదర్ పోర్టు కట్టింది బలూచిస్తాన్ ప్రావిన్స్ లోనే! CPEC కారిడార్ కోసం చైనా 500 బిలియన్ డాలర్లని ఖర్చుపెట్టింది. మలక్కా జలసంధిని భారత్ లేదా అమెరికా బ్లాక్ చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా రోడ్ మార్గం ద్వారా గ్వాదర్ పోర్టుకి చేర్చి, అక్కడ నుండి అరేబియా సముద్రం ద్వారా సరుకుల రవాణా కోసం అని అందరికీ తెలిసిన విషయం. కానీ గ్వదర్ పోర్టు కట్టింది బలూచిస్తాన్ నుండి సహజ వనరులని చైనాకి తరలించడానికే!

2014 మోడీ ఎరా మొదలయ్యింది!
2016 వరకూ చైనా తాను అనుకున్న పధకం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళింది. 2015 లో CPEC ప్రాజెక్ట్ లో భారత్ ని కూడా ఆహ్వానించింది చైనా కానీ మోడీ తిరస్కరించారు. జాతీయ, స్థానిక టీవి ఛానెల్స్ లో CPEC లో చేరకుండా మోడీ తప్పుచేస్తున్నారు అంటూ వక్తలు వాపోయారు. అవి చూసిన వాళ్లకి కూడా CPEC అనేది భారత్ కి కూడా లాభదాయకమే అనిపించింది కూడా!
కానీ…మోడీ & Co ప్లాన్ వేరే ఉంది!

2019, ఆగస్ట్ 5 న జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని తొలగించి తాను CPEC కి ఎందుకు వ్యతిరేకమో చెప్పకనే చెప్పారు మోడీ!
ఆర్టికల్ 370 ని తొలగించింది కేవలం జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాని తొలగించడమే కాకుండా PoJK ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి!

CPEC మార్గం PoJK నుండి గ్వదర్ పోర్ట్ వరకూ వెళుతుంది. భారత్ కనుక CPEC లో భాగస్వామిగా చేరి పెట్టుబడులు పెడితే PoJK ని స్వాధీనం చేసుకోవడంలో దౌత్యపరమైన, అంతర్జాతీయ చట్టపరమైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మోడీ CPEC ని తిరస్కరించారు.
So! చైనా తో పాటు పాకిస్తాన్ కి కూడా చెక్ పెట్టింది భారత్!

లాహోర్ నుండి బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకి వెళ్లే హై వే మీద ప్రతీ 30 km లకి ఒక పాకిస్థాన్ చెక్ పోస్ట్ ఉంటుంది! ఈ చెక్ పోస్ట్ లు పాకిస్థాన్ ఆర్మీ అధీనంలో ఉంటాయి!
లాహోర్ నుండి క్వేట్టా వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి మరీ వదులుతారు కానీ వీటిని దాటుకొని బలూచీలకి సప్లైస్ వెళ్లాయి అంటే RAW కి పాకిస్తాన్ సైన్యం సహకరించిందా?

చైనా దగ్గర ఉన్న ఒకే ఒక్క అవకాశం భారత్ లో రాజకీయ అస్థిరత కోసం ప్రయత్నించడం!
ఆ పని అమెరికాతో కలిసి మొదలుపెట్టింది! (ఇంకా చెప్పుకుందాం తరువాయి కథనాల్లో...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Balochistan – భారత్ Vs చైనా Vs అమెరికా! జియోపాలిటిక్స్ !!
  • Balochistan – ఓ కొత్త దేశం పురుడు పోసుకుంది – కానీ..?
  • వావ్… బాబు గారు ఆల్రెడీ ఎల్‌నినో సంక్షోభాన్ని దాటేశారట..!
  • మధ్యవర్తిత్వం చేసిన- ఆ జర్నలిస్టులు, లాయర్లపైనా కేసు ?!
  • బాపు అంటే..? ఇదుగో ఈ కథ చదివితే అర్థమవుతుంది ఆ పదం విలువ..!!
  • మొత్తం 1000 – రెండు లివర్లు ఎక్స్‌ట్రా… ఈ మీల్స్ ఆంటీ ఇక సినిమా ఆంటీ !!
  • పిచాయ్ భార్య కోపం- మ్యాప్స్ పుట్టుకకు బీజం..! ఈ కథ నిజమా? అబద్ధమా?
  • పాడిందే పాటరా ! మోదీ పేరెత్తలేక… రేవంత్ మీద పెడ శోకాలు !!
  • రావణాయణం – ఒక ‘విలన్’ వెనుక పది తలల మేధో వైభవం !
  • KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions