Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!

April 8, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … అమెరికా, ఇజ్రాయేల్ Vs ఇరాన్, రష్యా, చైనా! Part 1…. నెతన్యాహు ట్రంప్ తో : 40 ఏళ్ళ నుండి ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఇరాన్ మీద దాడి చేసి అణు స్థావరాల మీద దాడి చేసి పనిలో పనిగా ఇరాన్ నాయకత్వాన్ని మార్చేద్దాం.
ట్రంప్ : ప్లాన్ సిద్ధంగా ఉందా?

నెతన్యాహు : ప్లాన్ సిద్ధంగా ఉంది. మాకు సహకారం కావాలి, మిగతాది మేము చూసుకుంటాం! డిఫెన్స్ సెక్రటరీ పెట్ హెగ్సెత్ ( Pete Hegseth ) తో వివరంగా చర్చించాం!
ట్రంప్ అమెరికా రక్షణ మంత్రి పెట్ హెగ్షేత్ తో : ఇరాన్ మీద దాడి కోసం నేతన్యాహు తో చర్చలు జరిపారా?
పెట్ హెగ్సెత్ : ప్లాన్ బాగుంది! IDF వేసిన ప్లాన్ కి మనం సహకరిస్తే చాలు, మూడు రోజుల్లో ఇరాన్ మనకి లొంగిపోతుంది.

Ads

ట్రంప్ హెగ్సెత్ తో : మూడు రోజులకి కలిపి ఎంత ఖర్చు అవుతుంది?
హెగ్సెత్ : మూడు రోజులకి కలిపి రెండు బిలియన్ డాలర్లకి మించదు.
ట్రంప్ నెతన్యాహుతో : మనం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అమలు చేస్తున్నాం…

 

  • Operation Epic Fury objectives :
    1.అయితోల్లా అలీ ఖోమెనీని బాంబు దాడిలో హత్య చేయడం.
    2.ఇరాన్ మిసైల్ స్టాక్స్ ఉన్న ప్రదేశాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం.
    3.ఇరాన్ మిసైల్ ప్రొడక్షన్ ఫాక్టరీలని ధ్వంసం చేయడం.
    4.ఇరాన్ లో ఉన్న నాలుగు అణు కర్మాగారాలని ధ్వంసం చేసి, ఇరాన్ అణు ఆయుధాలని తయారు చేయకుండా ఆపడం.
    5.అణుశక్తి టెక్నాలజీతో సంబంధం ఉన్న ఇరాన్ ఇంజినీర్లని హతమార్చడం.
    6.ఇరాన్ రివల్యూషనరి గార్డ్స్ కార్ప్స్ ( IRGC )లో పనిచేస్తున్న ప్రధాన సీనియర్ కమాండర్స్ ని చంపడం.
    7.ఇరాన్ కి ఆదాయం తెచ్చిపెట్టే ఖర్గ్ ఐలాండ్ స్వాధీనం చేసుకొని తద్వారా IRGC ని లొంగతీసుకొని ఇరాన్ ని స్వాధీనం చేసుకోవడం.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది ఇజ్రాయేల్ వ్యూహం! ఇజ్రాయేల్ వ్యూహం ప్రకారమే అమెరికన్ సైన్యం పనిచేసింది!
మరి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సఫలం అయ్యిందా?
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఆబ్జెక్టివ్స్ అన్నీ కాకపోయినా 80% పూర్తయినట్లే!
మరి 20% ఎందుకు మిగిలిపోయింది?
మోస్సాద్ ఇంటెలిజెన్స్ విఫలం అయ్యింది పాక్షికంగా!

ఫిబ్రవరి 28 న ఆయుతోల్లా అలీ ఖోమెనీ తన నివాసంలో ఉన్నాడని, యుద్ధం గురుంచి తన ముఖ్యులతో సమావేశం అవబోతున్నాడని అనే సమాచారం వరకూ సక్సెస్ అయింది మోస్సాద్!
ఇజ్రాయేల్ తన ఎయిర్ లాంచెడ్ టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ అయిన బ్లూ స్పారో ( Blue Sparrow – developed by Rafael Advanced Defence System ) తో నేరుగా ఖోమెనీ నివాసం మీద దాడి చేసి చంపేసింది. బ్లూ స్పారో టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించడానికి ఇజ్రాయేల్ పాత తరం మెక్ డోనల్ డగ్లస్ F-15 ఈగిల్ కి మార్పులు చేసి వాడింది.

ఖోమెనీ చనిపోయినప్పుడు ఖోమెనీతో సమావేశం అయిన వాళ్ళు అందరూ బ్లూ స్పారో దాడిలో చనిపోయారు కానీ ఇద్దరు మాత్రం తీవ్ర గాయాలతో బ్రతికి బయటపడ్డారు. ఒకరు ఖోమెనీ కొడుకు మొజ్తాబా ఖోమెనీ అయితే రెండవ వ్యక్తి IRGC కమాండర్.
ఆయుతోల్లా అలీ ఖోమెనీ సమావేశం అయ్యింది రాజకీయపరమైనది కానీ IRGC కమాండర్ అక్కడ ఎందుకు ఉన్నాడనేదే ప్రశ్న! గతంలో ఇజ్రాయేల్ ఇద్దరు అణు శాస్త్రావేత్తలని డ్రోన్ తో దాడి చేసి చంపినప్పుడు కూడా ఇదే కమాండర్ స్వల్ప గాయాలతో  బ్రతికి బయట పడ్డాడు! అతని మీద అనుమానం రావడానికి ఇదే కారణం!

మోస్సాద్ అదృష్టం తారుమారు!
సదరు కమాండర్ కి (పేరు బయటికి రాలేదు ) ఖోమెనీ నివాసం దగ్గర పని ఏముంటుంది అని ఇంటరాగెట్ చేయగా అసలు విషయం బయటపడి ఇజ్రాయేల్ అదృష్టాన్ని తారుమారు చేసింది!
ఇంటరాగేషన్ లో సదరు IRGC కమాండర్ మోస్సాద్ కి పనిచేస్తున్నాడని తెలిసింది. మొత్తం ఏడుగురు IRGC అధికార్ల పేర్లు బయటపెట్టాడు మోస్సాద్ తరుపున పని చేస్తున్న వాళ్ళవి! అదే రోజు గాయపడిన కమాండర్ తో పాటు మోస్సాద్ కోసం పనిచేస్తున్న మిగతా ఏడు మంది IRGC అధికారులని కాల్చి చంపేశారు!
IRGC నుండి మోస్సాద్ కి కనెక్షన్ కట్ అయిపోయింది!
ఈ ఉదంతం రష్యాలో జరిగిన సంఘటనలతో పోలి ఉంది.

గత నాలుగేళ్లలో పుతిన్ తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న నలుగురు హై రాంక్ జనరళ్ళకి మరణశిక్ష వేశాడు ఎలాంటి విచారణ లేకుండానే. మరో ఇద్దరు అధికారులని జైల్లో పెట్టాడు!
నాటోకి రహస్యంగా రష్యన్ దళాల కదలికల సమాచారాన్ని ఇస్తున్నారనే అనుమానంతోనే పుతిన్ కఠినంగా వ్యవహరించాడు!
యుద్ధం మొదలవక ముందు, యుద్ధం మొదలై జరుగుతున్నప్పుడు ఎవరి ఇంటెలిజెన్స్ సంస్థ ఎంత బాగా సమాచారం సేకరిస్తుందో ఆ దేశమే పైచేయి సాధిస్తుంది కానీ ఆధునాతన ఆయుధాలు అనేవి సెకండ్ కేటగిరీ లోకి వస్తాయి.
ఇజ్రాయేల్, అమెరికాలు పూర్తి స్థాయిలో సఫలం కాకపో వడానికి కారణం మిలిటరీ ఇంటెలిజెన్స్ విఫలం అవడమే!

సాధారణ పౌరుల సహకారం అనేది ఇరాన్ నుండి మోస్సాద్ పొందగలిగింది కానీ సౌదీ అరేబియా, కువైట్, UAE లలోని ఇరాన్ పౌరులు మొబైల్ ఫోన్ల ద్వారా IRGC కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ రావడమే ఇరాన్ దాడులు చేయగలిగింది. మోస్సాద్ కి ఇరాన్ నుండి తప్పితే మిగతా గల్ఫ్ దేశాలలో ఎవరూ సహకరించలేదు.
మోస్సాద్ అంచనాలు తప్పాయి!

మోస్సాద్ పుతిన్ నుండి, జీ జింగ్ పింగ్ నుండి ఇరాన్ కి హై ఇంటెలిజెన్స్ తో పాటు నావిగేషన్ వ్యవస్థని కూడా ఇచ్చి సహకరిస్తాయని ఊహించలేదు!
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ మీద అంచనాలు తప్పాయి!
ఇరాన్ దగ్గర మహా అయితే 2,500 బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయని అంచనా వేయడం ఒక తప్పు అయితే వాటి యాక్యురసి మీద వేసిన అంచనాలు కూడా తప్పాయి!

ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ వేగం 2025 జూన్ లో ఇజ్రాయేల్ మీద దాడి చేసినప్పుడు తక్కువగా ఉండడంతో ఇజ్రాయేల్ ఊపిరి పీల్చుకోగలిగింది!
గత నెల రోజులుగా ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ మిసైల్స్ వేగం ఎంత ఉందంటే అమెరికన్ నావీ కానీ, ఇజ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ కానీ ప్రభావం చూపలేనంతగా పెరిగిపోయింది! అంటే గత 2025 జూన్ కి 2026 ఫిబ్రవరికి పట్టుకోలేనంత వేగం పెరగడం ఇజ్రాయేల్ కి ఆశ్చర్యం వేసింది!

రష్యాతో పోలిక ఉంది!
2022 ఫిబ్రవరి 23 న రష్యా ఉక్రెయిన్ మీద మొదలుపెట్టిన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ లో మొదటి సంవత్సరం అంటే… 2023 ఫిబ్రవరి వరకూ పుతిన్ తనవద్ద ఉన్న పాత తరం మిసైల్స్ ని వాడాడు. 2023 ఆగస్టు నుండి ఫ్రెష్ స్టాక్ వాడడం మొదలు పెట్టాడు.
ఈ పాటర్న్ ని ఇజ్రాయేల్ ఊహించలేదు!

March 10 వరకూ ఇరాన్ తన పాత మిసైల్స్ ని వాడేసింది! మార్చి 11 నుండి లేటెస్ట్ మిసైల్స్ తో పాటు హైపర్ సానిక్ బాలిస్టిక్ మిసైల్స్ వాడడం మొదలుపెట్టేసరికి ఇజ్రాయేల్ దెబ్బతినడం మొదలయ్యింది.
ఇజ్రాయెల్ ఎంతలా దెబ్బతిన్నది అంటే కమ్యూనిటీ అండర్ గ్రౌండ్ షెల్టర్స్ లో దాక్కోవడానికి ప్రజలు ఇష్టపడక దగ్గరలోని ఎత్తయిన కొండలు, గుట్టల మీద ఉండడానికి ఇష్టపడుతున్నారు!

అండర్ గ్రౌండ్ షెల్టర్స్ సురక్షితం కావా?
ఇరాన్ ఇజ్రాయేల్ మీదకి ప్రత్యేకమైన బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తున్నది!
మిసైల్ వార్ హెడ్ ని ఒక టన్ను హై ఎక్స్ప్లోజీవ్ పేలుడు పదార్ధంతో నింపి ప్రయోగిస్తున్నది!
ఒక టన్ను వార్ హెడ్ అంటే మాటలు కాదు!

ఖోర్రంషేహర్ (Khorramshahr ) బాలిస్టిక్ మిసైల్ ని ఒక టన్ను పే లోడ్ తో ప్రయోగిస్తూ వచ్చింది అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఖోర్రంషెర్ ని అప్గ్రేడ్ చేసి 2 టన్నులు పే లోడ్ తో ప్రయోగిస్తున్నది ఇరాన్!
సాధారణంగా షార్ట్, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని ఒక టన్ను పే లోడ్ తో ప్రయోగిస్తారు! కమాండ్ సెంటర్స్, ఆయుధ డిపోలు, మిలిటరీ ఆయిల్ నిల్వలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎయిర్ బేస్ లని లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తారు. అదే 2 టన్నుల పే లోడ్ తో అయితే అండర్ గ్రౌండ్ బంకర్స్ లోపలికి చొచ్చుకు పోతాయి!
ఇజ్రాయేల్ విషయంలో జరిగింది, జరుగుతున్నది అదే!

ఇజ్రాయేల్ ఇరాన్ దాడులని తట్టుకోలేక ప్రజలని తరలించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందా?
గత కొంతకాలంగా ( march 24, 2026) ఇజ్రాయేల్ గ్రీకు ఐల్యాండ్స్ ని కొని యుద్ధ సమయంలో ప్రజలని అక్కడికి తరలించాలని ప్లాన్ లో ఉన్నది అనేవి ఆ రూమర్స్!
గ్రీకు ఐల్యాండ్స్ లో కొన్నింటిలో ఖాళీగా ఉన్నమాట వాస్తవం.
బెన్ని గంట్జ్ కాంప్ ( Benny Gantz camp ) కి చెందిన రాజకీయ నాయకులు గ్రీకు ఐల్యాండ్స్ ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తున్నది.

ఇజ్రాయెల్ గ్రీస్ దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ( Crete లో ) ఈ రూమర్స్ రావడానికి ప్రధాన కారణం.
బోర్డ్ అఫ్ హిమ్నుట ఆర్గనైజేషన్ ( a subsidiary of Jewish National Fund ) ఈ వార్తని ఖండించింది. మరో వైపు గ్రీస్ అధికారులు కూడా ఖండించారు! Contd.. Part 2

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!
  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట
  • ఈమె తెగువకు ఓసారి గట్టిగా చప్పట్లు కొడదాం… ఎందుకంటే..?
  • ‘‘నీ పో మోనే విజయ…’’ కేరళలో భలే పేలిన రేవంత్ రెడ్డి క్యాంపెయిన్…
  • మోడీ భాయ్… నీ చమురు జంఝాటం తరువాత… వెంటనే ఇది చూడు ఓసారి…
  • ఆ మోడీ ట్వీట్ 30.9 మిలియన్ రీచ్… అందులో ఓ అద్భుత విజయవార్త…
  • భవనాలతో రాజధాని రాదు… హైదరాబాదుతో అసలు పోలికే లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions