Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేని- అమల ప్రేమ- పెళ్లి ‘నిర్ణయం’ అప్పుడే జరిగిపోయింది..!

April 12, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం , మగాడితో ఆడదానికేల పౌరుషం . 1991 ఫిబ్రవరిలో వచ్చిన ఈ నిర్ణయం సినిమా అనగానే ఎవరికయినా గుర్తుకొచ్చే పాట ఇదే . కాకపోతే ఇప్పుడు రెండో లైనుకి మహిళా సంఘాలు రచ్చ చేసేవి . 35 ఏళ్ళ కింద కాబట్టి వదిలేసారు .

ఈ సినిమా పాపులర్ అవటానికి ప్రధాన కారణాలు ఇళయరాజా సంగీత దర్శకత్వం , బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర , మనో , స్వర్ణలత గాత్ర మాధుర్యం . అలాగే సిరివెన్నెల వారి లిరిక్స్ , సుందరం మాస్టారు , తార , పులియార్ సరోజ నృత్య దర్శకత్వం . డ్యూయెట్లు కుర్ర ప్రేక్షకులను ఊపేసాయి .

Ads

ఓ పాపలూ పాపలు ఐ లవ్ యూ టీజింగ్ సాంగ్ , మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నులా డ్యూయెట్ బ్రహ్మాండంగా ఉంటాయి . అలాగే ఎంత ఎంత దూరం , ఎపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం డ్యూయెట్లు చాలా బాగుంటాయి . వెరశి అన్ని పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంటుంది .

జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పయినా పెడుతుంది అన్నట్లు కధంటూ ఉంటే ఎన్ని మలుపులయినా తిప్పొచ్చు . మళయాళంలో హిట్టయిన వందనం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , గీతాంజలిలో నటించిన గిరిజా షెట్లర్ లీడ్ రోల్సులో నటించారు . మళయాళం సినిమాకు దర్శకత్వం వహించిన ప్రియదర్శనే తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించారు . కధ , స్క్రీన్ ప్లే కూడా ఆయనవే .

హీరో నాగార్జున అల్లరితో ప్రారంభమయిన సినిమా మొదట్లో రొమాన్స్ , హిలేరిటీలతో ఉంటుంది . హీరోయిన్ అమల వెంటపడటమే చాలాసేపు సాగుతుంది . I hate you అన్న అమ్మాయి చేత ఐ లవ్ యూ ఎలా చెప్పించుకోవాలో షార్ట్ టర్మ్ కోర్సుని అందించాడు దర్శకుడు . ఆరోజుల్లో లైనేయటానికి చాలా టైం పట్టేది . ఇప్పుడంతా సూపర్ ఫాస్ట్ . Commercialism , materialism రోజులు కదా !

సమాంతరంగా స్థానిక రాజకీయ కం దాదాగిరి విలన్ , ఆ విలనుకు చంచాలు , వాళ్ళను కొమ్ము కాసే పోలీసాయన . వీళ్ళ దౌర్జన్యాలకు బలయిన ఓ కాలేజి ప్రొఫెసర్ , అతని రివెంజ్ ప్లానింగ్ సాగుతుంటుంది . ప్రేమించిన అమ్మాయికి టెలిఫోన్ రిపేర్ చేసే మనిషి కాదు పోలీస్ ఆఫీసర్ , తన తండ్రిని అరెస్ట్ చేయటానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అని తెలిసాక హీరో హీరోయిన్లు మనసులు విప్పి నిజాలు పంచుకుంటారు .

విలన్లు అంతా ఒకవైపు , బాధితులంతా ఒక వైపు పోలరైజ్ అవుతారు . ఈ క్రమంలో హీరో మిత్రుడు , పోలీస్ ఇనస్పెక్టర్ శుభలేఖ సుధాకర్ ప్రాణాలను కోల్పోతాడు . క్లైమాక్సులో ఫుట్ బాల్ కోర్టులో బాంబ్ ఉందని హడావుడి చేసి , ఆ గందరగోళంలో విలన్ని కాలేజి ప్రొఫెసర్ తనను తాను చంపుకుంటూ అతన్ని కూడా చంపేయటంతో హీరో మిషన్ పూర్తవుతుంది . హీరో హీరోయిన్లు తెర మీద ఒకటవుతారు . తర్వాత సంవత్సరానికి 1992 జూన్ పదకొండో తేదీన నిజ జీవితంలో ఒకటవుతారు .

పెళ్ళిళ్ళే కాదు ; పెటాకులు కూడా స్వర్గంలోనే నిర్ణయించబడతాయి . Man proposes ; God disposes అని అంటారు . నేను నా విద్యార్ధులకు చెపుతూ ఉంటా . అది కరెక్ట్ కాదు అని . కరెక్ట్ ఏమిటంటే it is only God who proposes and disposes also . రెండూ ఆయనే ; మానవుడు నిమిత్తమాత్రుడు మాత్రమే ఏమో అని .

It’s a movie of hilarity , romance , music , dance , suspense , action with excellent screen play and direction . Credit mainly goes to Mr Priyadarsan . నటనపరంగా నాగార్జున అల్లరి ప్రేమికుడిగా , ఈజీ టేకింగ్ ప్లే బాయ్ గా బాగా నటించాడు . అమల ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది . గ్లామర్ డాల్ .
ఇతర ప్రధాన పాత్రల్లో కాలేజి ప్రొఫెసరుగా మురళీ మోహన్ , నాగార్జున బకరా స్నేహితుడిగా శుభలేఖ సుధాకర్ , అతని భార్యగా రాజీవి , నాగార్జున తల్లిగా అన్నపూర్ణమ్మ నటించారు .

విలనుగా శరత్ సక్సేనా , పోలీస్ విలనుగా గిరిబాబు , ఇతర పాత్రల్లో సుత్తి వేలు , భీమేశ్వరరావు , అల్లు రామలింగయ్య , చారు హాసన్ , తదితరులు నటించారు . ఆంగ్లో ఇండియన్ ఆంటీగా సుకుమారిని ప్రేక్షకులు మరచిపోరు . గణేష్ పాత్రో డైలాగులు కూడా చాలా బాగుంటాయి .

ప్రముఖ నటుడు మురళీ మోహన్ స్వంత బేనర్ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా హిందీలోకి గిరఫ్తారీ టైటిలుతో , తమిళంలోకి సంభవం టైటిలుతో డబ్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది . సినిమా ప్రేమికులకు , సంగీత ప్రియులకు , నాగార్జున అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చుతుంది . చూసి ఉన్నా కూడా చూడవచ్చు . పాటల వీడియోలను ఎన్ని సార్లయినా ఎంజాయ్ చేయవచ్చు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…
  • వెంటాడే ‘మిన్నేటి సూరీడు’ భారతీరాజా… ఏదో తెలియని మత్తు…
  • తమిళ రాజకీయ నేతలకు కర్ణాటక అమ్మవార్లే ఎందుకు ప్రత్యేకం?
  • ప్రిపెయిడ్..! తనెవరికీ ఏమీ కాడు, తనకెవరూ మిగల్లేదు… ఫిక్సయ్యాడు..!!
  • M6… ఆరు నగరాలు… భారత భవిష్యత్తు… రేవంత్‌రెడ్డి భేషైన ప్రతిపాదన…
  • ఆ బెంచీ..! ఎన్ని జ్ఞాపకాల నెమరివేత..? ఎన్ని కన్నీళ్లు ఇంకిన వేదిక..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions