Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…

April 16, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘పార్టీ మారిన’ జీవన్‌రెడ్డిపై ఓ వ్యాఖ్య చేశాడు… ఇన్నాళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని, కమిట్‌మెంట్‌ను దెబ్బతీస్తూ… జీవన్‌రెడ్డి వెళ్లి కేసీయార్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు అని… చేతులు కట్టుకుని నిలబడటం అనేది ఓ విధేయత వ్యక్తీకరణ… ఎదుటివాడి ఆధిపత్యాన్ని అణకువగా అంగీకరించడం… సో, ఈ వ్యాఖ్య జీవన్‌రెడ్డికి సూటిగా తాకింది…

అసలే తన పార్టీ మార్పు మీద తన నియోజకవర్గంలోనే తనకు సానుకూలతను క్రియేట్ చేయకపోవడం, పార్టీ మార్పును వ్యతిరేకించే కేడర్ రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి, తమ పార్టీ విధేయతను, నిబద్ధతను చాటుకోవడం జీవన్‌రెడ్డికి ఇక వశపడటం లేదు… సో, ఇన్నేళ్ల రాజకీయ పరిణతి ఒక్కసారిగా మాయం అయిపోయి, ఏదేదో మాట్లాడేస్తున్నాడు…

Ads

రాయికల్‌‌లో ఎక్కడో మాట్లాడుతూ… ‘నేను కేసీయార్ ఎదుట చేతులు కట్టుకుని నిలబడటం ఏమిటి..? నేను కేసీయార్ సమకాలీనులం, కలిసి పనిచేస్తాం, కలిసి రాజకీయ ప్రయాణం చేశాం…’’ అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు… కానీ నప్పలేదు, సరికాదు… సమకాలీనుడు వేరు, సమస్కంధుడు వేరు… తనను తను హెచ్చించుకుంటున్నాడు జీవన్‌రెడ్డి… ఎలాగంటే..?

జీవన్ రెడ్డి

సమకాలీనుడు అంటే… ఒకే కాలంలో పనిచేసినవారు, గడిపినవారు… అంతే… ఒకే కాలంలో రాజకీయాలు చేయడం చిన్న విషయం… చిన్నాచితకా పదవుల్లో రాజకీయాలు చేయడానికీ, ఉన్నత పదవుల్లో రాజకీయాలు చేయడానికీ తేడా లేదా..? ఒకే కాలంలో పనిచేయడం అంటే ఒకే స్థాయిలో ఉండటం అని కాదు…

నేను, కేసీయార్ సమస్కంధులం అని చెప్పాలనేది జీవన్‌రెడ్డి భావన కావచ్చు బహుశా… కానీ సమస్కంధుడు అర్థం వేరు, అంటే సేమ్ రేంజ్, సమస్థాయి… జీవన్‌రెడ్డి ఎప్పుడూ ఒక మంత్రి అనే పదవిని దాటి, అదీ జగిత్యాల అనే భౌగోళిక పరిధినీ దాటలేకపోయాడు… కానీ కేసీయార్..? తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని స్వప్నించినవాడు… తను తొమ్మిదిన్నరేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి… అపారమైన సా‘ధన సంపత్తి’ సంపాదించి, ఏకంగా ప్రధాని పదవినే కలలు గన్నవాడు…

kcr

కానీ జీవన్‌రెడ్డి..? ఇదే కేసీయార్ మీద పదే పదే పోటీకి నిలబడుతూ… వైఎస్ మార్క్ సమైక్యవాద, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక కుట్రల్లో భాగస్వామి అయ్యాడు… ఇద్దరూ సమకాలీనులే గానీ సమస్కంధులు ఏమాత్రం కారు… అసలు విషయానికి వస్తే కేసీయార్ గడీలో కేటీయార్ ఇంకెవరూ సమస్కంధులు కాదు కదా, నెంబర్ టూ కూడా ఉండరు… చివరకు సొంత బిడ్డనైనా తరిమేయగలడు…

నరేంద్ర, విజయశాంతి, కేశవరావు, ఈటల రాజేందర్… ఎవరైనా సరే గడీ వీడివెళ్లాల్సిందే… కేశవరావు ఒక దశలో పార్టీ సెక్రెటరీ జనరల్… కానీ తనిప్పుడు ఎక్కడున్నాడు..? ఎందుకు..? ఇప్పుడైనా కేసీయార్ కరుణిస్తేనే జీవన్‌రెడ్డికి పదవి… జీవన్‌రెడ్డి అవసరం కేసీయార్‌కు లేదు, కేసీయార్ అవసరమే జీవన్‌రెడ్డికి ఉంది… అంటే, గడీలో దొరవారి ముందు చేతులు కట్టుకోవడమే…

కేసీయార్

సో, సేమ్ కాలంలో (సమకాలీనత) రాజకీయాలు చేయడానికీ సేమ్ స్థాయి (సమస్కంధత) రాజకీయాలు చేయడానికీ హస్తిమశకాంతరం..!! కేసీయార్ ఆలింగనంలో ఆప్యాయతలూ, ఆత్మీయతలూ ఉండవ్ మాస్టారూ… కొన్ని లెక్కలుంటాయి, కొన్ని ఎక్కాలుంటాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
  • సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!
  • ఆమె కథలో ఎన్ని ట్విస్టులో… ప్రతి ఫేకుగాడికీ ఆ పేరిప్పుడు లోకువ…
  • ఒక పోచారం… ఒక జీవన్‌రెడ్డి… జవాబుల్లేని కొన్ని ప్రశ్నలు…
  • అంజలి కడమ్..! హఠాత్తుగా తెరమరుగు… ఈరోజుకూ అజ్ఞాతమే…!!
  • ఐప్యాక్..! వ్యూహకర్తలు కారు… పక్కా స్కామర్లు… కోట్లకుకోట్ల దందాలు..!!
  • పూలు విసిరితే బాంబు అనుకుని… దళపతి భయంతో పరుగో పరుగు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions