Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అట్టడుగున ఆ నాలుగు జట్లు..! ఏవీ ఆ పాత మెరుపులు..?

April 18, 2026 by M S R

.

ఒకప్పటి చాంపియన్ జట్టు కేకేఆర్… కానీ ఇప్పుడు టేబుల్‌లో చిట్టచివరన… అన్నీ వరుస ఓటములతో కునారిల్లుతోంది… అసలు చివరి నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల వైఫల్య కారణాల్ని ఓసారి పరిశీలిస్తే, ఆసక్తికరమైన విశ్లేషణలు ఎన్నో కనిపిస్తాయి… ప్రత్యేకించి కెప్టెన్లు, కోచ్‌లు, మెంటార్లు, ప్లేయర్ల వైఫల్యాలే కాదు, మేనేజ్‌మెంట్ బ్లండర్స్ కూడా…

ఐదుసార్లు ఛాంపియన్లయిన ముంబై (MI), చెన్నై (CSK) తో పాటు బలమైన కోల్‌కతా (KKR), లక్నో (LSG) జట్లు పాయింట్ల పట్టికలో చివరి నాలుగు స్థానాల్లో (7, 8, 9, 10) ఉండటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది….

Ads

దృశ్యం 1: వ్యూహాత్మక తప్పిదాలు (KKR vs LSG) …  ఒక చోట పట్టింపులేనితనం (అనావృష్టి) కనిపిస్తుంటే, మరోచోట మేనేజ్‌మెంట్ అతి జోక్యం (అతివృష్టి) జట్టును ముంచుతోంది…

  • KKR (అనావృష్టి)…: కోల్‌కతాలో యాజమాన్యం పట్టింపులేనితనం స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా 6 మ్యాచ్‌లు ఓడినా (6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు, 1 నో-రిజల్ట్), దిద్దుబాటు చర్యలు లేవు… సునీల్ నరైన్ లాంటి ఆటగాడిని ఎక్కడ వాడుకోవాలో కూడా తెలియని స్థితి… టైమౌట్ సమయంలో కూడా ప్లేయర్లకు సరైన దిశానిర్దేశం చేయించే ‘శ్రద్ధ’ ఇతర జట్లది… ప్రతి మ్యాచ్ తరువాత సమీక్ష, దిద్దుబాటు ఉండాలి, అది కేకేఆర్ జట్టులో లేదు… అంతులేని నిర్లిప్తత ఇక్కడ…

  • LSG (అతివృష్టి)…: లక్నోలో పరిస్థితి దీనికి భిన్నం. ఇక్కడ మేనేజ్‌మెంట్ అతి జోక్యం జట్టులో గందరగోళాన్ని సృష్టిస్తోంది. కెప్టెన్ల మార్పిడి (రాహుల్ స్థానంలో పంత్), సోషల్ మీడియా వివాదాలు, ప్రతి చిన్న విషయానికి మేనేజ్‌మెంట్ స్పందించడం, పాత కెప్టెన్ పట్ల అమర్యాద, ప్లేయర్ల స్వేచ్ఛను, స్పూర్తిని, ఐక్యతను హరిస్తోంది. ఫలితంగా అక్కడ ‘అతివృష్టి’ వల్ల పంట దెబ్బతింటోంది…

దృశ్యం 2: సీనియర్ల భారం & మెరిట్ లేమి (CSK vs MI) … మరోవైపు ముంబై, చెన్నె ఐపీఎల్ దిగ్గజాలు సీనియర్ల భారంతో చతికిలబడుతున్నాయి. కొత్త రక్తాన్ని ఎక్కించుకోవడంలో ఈ రెండు జట్లు విఫలమయ్యాయి.

  • MI (ముంబై ఇండియన్స్)…: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లపై అతిగా ఆధారపడటం, కొత్తగా వచ్చిన మెరిట్ ప్లేయర్లను సరిగ్గా వాడుకోకపోవడం వల్ల ముంబై 5 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో 9వ స్థానంలో ఉంది. జట్టులో సమన్వయం కంటే వ్యక్తిగత ప్రదర్శనలకే ప్రాధాన్యత కనిపిస్తోంది.

  • CSK (చెన్నై సూపర్ కింగ్స్)…: చెన్నై కూడా ఇదే దారిలో ఉంది. అనుభవం ఉన్న ఆటగాళ్లే ఆయుధాలు అనుకుని, మారుతున్న ఫాస్ట్ క్రికెట్ (T20) వేగాన్ని అందుకోలేకపోతున్నారు. 5 మ్యాచ్‌ల్లో 3 ఓటములతో 8వ స్థానంలో ఉన్న సీఎస్కే, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో వెనుకంజ వేస్తోంది.

సారూప్యత: కెప్టెన్ల నిర్లిప్తత …. ఈ నాలుగు జట్లలోనూ కనిపిస్తున్న ప్రధాన లోపం కెప్టెన్ల నిస్సహాయత.

  • కేకేఆర్‌లో అజింక్య రహానేకు పట్టు లేదు.

  • లక్నోలో రిషబ్ పంత్ మేనేజ్‌మెంట్ నిర్ణయాల మధ్య నలిగిపోతున్నాడు.

  • సీఎస్కే, ఎంఐలలో నాయకత్వ మార్పులు, సీనియర్ల ఆధిపత్యం వల్ల కొత్త వ్యూహాలు అమలు కావడం లేదు. సంజు శామ్సన్ టీమ్‌లోకి వచ్చినప్పటికీ, చెన్నె మేనేజ్‌మెంట్ రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. ముంబై జట్టులో హార్డిక్ పాండ్యా వ్యూహాలు వికటిస్తున్నాయి.

కోచ్‌లు, మెంటార్ల ప్రయోగాలు వికటించడం.. పాత పద్ధతులనే పట్టుకుని వేలాడటం వల్ల ఈ ‘బిగ్ ఫోర్’ జట్లు ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరుకున్నాయి. ఆర్ఆర్, పంజాబ్ (PBKS), బెంగళూరు (RCB) జట్లు ‘మెరిట్’, ‘చురుకైన నిర్ణయాల’తో దూసుకుపోతుంటే, ఈ నాలుగు జట్లు మాత్రం తమ అంతర్గత లోపాలతోనే కుస్తీ పడుతున్నాయి… Brand Value Vs Field Reality ….

  • కేకేఆర్ వదులుకున్న శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్‌ను టాప్ ప్లేసులో ఉంచాడు… తనకు ఆ జట్టు స్వేచ్ఛ ఇచ్చింది, మంచి ప్లేయర్లను ఇచ్చింది, పైగా తన సొంత చొరవ, దూకుడు… పైకి కామ్‌గా కనిపిస్తాడు గానీ శ్రేయాస్ ఇప్పుడు అందరి నోళ్లలోనూ నలుగుతున్న పేరు… గౌతమ్ గంభీర్, గమనిస్తున్నావా..?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏలియన్స్ గుట్టు తెలిసిన సైంటిస్టులు మాయం..! ఎవరి పని..?!
  • అసలు ప్రశ్న అలాగే ఉండిపోయింది..! ఎన్ని పెంచాలి, ఎలా పెంచాలి..!!
  • అట్టడుగున ఆ నాలుగు జట్లు..! ఏవీ ఆ పాత మెరుపులు..?
  • ప్రకాష్ ఆంటోనీ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…
  • నో బొట్టు, నో మణికట్టు పట్టీలు, నో సిందూరం… లెన్స్‌కార్ట్ వివాదం ఏమిటంటే..?
  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions