Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడైతే శోభన మోహన్‌బాబును మూడు చెరువుల నీళ్లు తాగించేది..!!

April 18, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. తమిళంలో సూపర్ హిట్టయిన Poothea Paathai (అంటే నూతన మార్గం) సినిమాకు రీమేక్ 1991 లో వచ్చిన ఈ రౌడీ గారి పెళ్ళాం . తమిళంలో పార్తీబన్ , సీత లీడ్ రోల్సులో నటించారు . తర్వాత తెలుగు , హిందీ , కన్నడ భాషల్లోకి రీమేక్ అయింది . అన్ని భాషల్లోనూ బాగా ఆడింది .

మన తెలుగు వెర్షన్ మోహన్ బాబు స్వయంగా నిర్మించారు . కధను మన వాతావరణానికి అనుకూలంగా మార్పులు చేసుకున్నారు నిర్మాత మోహన్ బాబు , రచయితలు పరుచూరి బ్రదర్స్ . వాళ్ళే డైలాగులను కూడా వ్రాసారు . ఫొటోగ్రఫీ డైరెక్టరుగా పాపులరయిన కె యస్ ప్రకాష్ దర్శకుడు .

Ads

ఓ కుంతీపుత్రుడు లేదా కుప్పతొట్టి పుత్రుడు సమాజం మీద ద్వేషాన్ని పెంచుకుంటూ గాలికి , ధూళికి , ఆవారాగా పెరుగుతాడు . ఎంత చిల్లర బతుకంటే కేవలం వెయ్యి రూపాయలకు పెళ్ళి పీటల మీదకు వెళ్ళనున్న పడతిని మానభంగం చేసే అంత చిల్లర సరుకు . బతుకు నాశనమయిన ఆ పడతి సహనంతో , పట్టుదలతో ఆ చిల్లర రౌడీ మనసును మార్చి , జయించి సన్మార్గంలో పెడుతుంది .

ఈ చిల్లర రౌడీ రాంబాబుని పదికీ పరక్కీ వాడుకునే రాజకీయుడు కోట శ్రీనివాసరావునే జైలుకు పంపుతాడు రౌడీ గారు . ఆ కక్షతో మాజీ రౌడీ మీద కక్ష పూని హీరోయిన్ శోభన అన్నను రెచ్చగొట్టి టిఫిన్ కేరియర్ బాంబుని ఏర్పాటు చేస్తాడు . ఆమె తన చెల్లెలే అని తెలియని ప్రసాద్ బాబు చెల్లెలు శోభన మరణానికి కారణం అవుతాడు . క్లైమాక్సులో కోట శ్రీనివాసరావుని ప్రసాద్ బాబే ఏసేయటంతో సినిమా ముగుస్తుంది . ఇదీ టూకీగా కధ .

ఇలాంటి వేషాలు ఎన్నో వేసిన మోహన్ బాబుకి ఈ పాత్ర కొట్టిన పిండి . రౌడీ షేడుని , సంస్కరించబడ్డాక ఉదాత్త షేడునీ చక్కగా చూపారు . హీరోయిన్ శోభన చలాకీగా నటించింది . స్వతహాగా నర్తకి అయిన ఆమె డాన్సుల్లో అందంగా నర్తించింది . సినిమా విజయానికి వీరిద్దరితో పాటు బప్పీలహరి సంగీతం , జాలాది , సిరివెన్నెల , గురుచరణ్ , రసరాజుల పాటలు , వాటిని పాడిన బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , చిత్ర ప్రధాన పాత్ర పోషించారు .

ముఖ్యంగా గురుచరణ్ వ్రాసిన బోయవాని వేటకు గాయపడిన కోయిలా అనే పాట జేబుదాస్ కంఠం నుండి చాలా శ్రావ్యంగా వచ్చింది . సూపర్ హిట్ సాంగ్ అయింది . అలాగే జాలాది వ్రాసిన కుంతీకుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం పాటని కూడా జేసుదాస్ చాలా శ్రావ్యంగా పాడారు .

మోహన్ బాబు , శోభన మీద రెండు డ్యూయెట్లు ఆకుందా వక్కిస్తా , అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు కూడా బాగా చిత్రీకరించబడ్డాయి . ఈ రెంటిలో మొదటి పాటను రసరాజు వ్రాస్తే , రెండవ దానిని సిరివెన్నెల వారు వ్రాసారు . యమా రంజు మీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుందీ రోజు హాట్ సాంగ్ మోహన్ బాబు , మా గుంటూరు జయలలితల మీద ఉంటుంది . హుషారుగా కూడా ఉంటుంది . గురుచరణ్ వ్రాసారు . డాన్సుల్ని సుందరం , ప్రభుదేవా కంపోజ్ చేసారు .

ఇతర ప్రధాన పాత్రల్లో నర్రా , అన్నపూర్ణమ్మ , రజిత , శివపార్వతి , బాబూమోహన్ , కాకర్ల , వినోద్ , బ్రహ్మానందం , వాసుకి (పాకీజా)  తదితరులు నటించారు . బ్రహ్మానందం , పాకీజాల శోభనం ప్రహసనం కాస్త విసిగించినా బాగానే పాపులరయింది .

ఓవరాల్ చూడతగ్గ సినిమాయే . మోహన్ బాబు కెరీర్లో అతనికి పేరు తెచ్చిన సినిమాలలో ఒకటి ఇది . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . యూట్యూబులో ఉంది . మోహన్ బాబు , శోభన అభిమానులు చూడొచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions