.
ప్రైవేటు హాస్పిటల్స్ అంటేనే దోపిడీ… కార్పొరేట్ యాజమాన్యాలే కాదు, ఎవడికి ఎంత దొరికితే అంత దోచుకుంటున్నారు… రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు… అందుకే చాలామంది అంటుంటారు… కార్పొరేట్ వైద్యం చేతికి చిక్కకుండా, ఏ నిద్రలోనో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతే అంతకుమించిన సుఖమరణం మరొకటి ఉండదు అని…
ఢిల్లీలో ఓ అంకాలజీ కుంభకోణం… ఇది మరీ దారుణం…. ఓసారి వివరాల్లోకి వెళ్దాం… ఢిల్లీలోని ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రులలో జరుగుతున్న ఒక దారుణమైన నకిలీ మందుల రాకెట్‌ను దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి… ప్రాణాలను రక్షించే Keytruda (pembrolizumab) అనే ఖరీదైన మందు సీసాలను (vials), వాడిన తర్వాత పారేయకుండా వాటిలో చౌకబారు యాంటీ ఫంగల్ మందులను నింపి, అమాయక రోగులకు విక్రయిస్తున్నట్లు తేలింది…
Ads
-
మోసం తీరు…: ఆసుపత్రిలోని ఫార్మసిస్టలులు, సపోర్ట్ స్టాఫ్ వాడేసిన ఖాళీ ‘కీట్రూడా’ సీసాలను సేకరించేవారు…. 100 mg బరువుండే ఒక్కో అసలు సీసా ధర దాదాపు ₹1.5 లక్షలకు పైగా ఉంటుంది…
-
నకిలీ తయారీ…: ఈ ఖాళీ సీసాలలో కేవలం ₹100–₹200 విలువ చేసే యాంటీ ఫంగల్ మందును నింపి, మళ్లీ సీల్ చేసేవారు…
-
విక్రయ ధర…: వీటిని ₹40,000 నుండి ₹90,000 మధ్య ధరలకు, భారీ తగ్గింపు పేరుతో రోగులకు విక్రయించేవారు….
-
బాధిత ఆసుపత్రులు…: రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (RGCIRC), ఫోర్టిస్, మిలీనియం క్యాన్సర్ సెంటర్, వెంకటేశ్వర హాస్పిటల్ వంటి ప్రముఖ సంస్థల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి…
ఆసుపత్రులు కఠినమైన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి…
-
వ్యర్థాల నిర్వహణ…: వాడిన సీసాలను పగులగొట్టడం లేదా నాశనం చేయడంలో సిబ్బంది విఫలమయ్యారు…
-
నిఘా లోపం…: ఆసుపత్రి సిబ్బంది తమ బ్యాగులలో ఈ ఖాళీ సీసాలను బయటకు తీసుకెళ్తున్నా ఎవరూ గమనించలేదు….
-
నమ్మకద్రోహం…: ఒక నిందితుడి వద్ద ఏకంగా 519 ఖాళీ కీట్రూడా సీసాలు, భారీ నగదు లభించాయి… అతను దాదాపు 15 ఏళ్లుగా ప్రముఖ ఆసుపత్రులలో ఆంకాలజీ మేనేజర్‌గా పనిచేశాడు…
క్యాన్సర్ చికిత్స కోసం లక్షల రూపాయలు వెచ్చించి, ఆశతో ఎదురుచూసే రోగులను ఈ ముఠా నిలువునా ముంచింది… కనీసం ఎనిమిది మంది రోగులు ఈ నకిలీ మందును తీసుకున్నట్లు గుర్తించారు… వీరిలో ఒకరు సరైన మందు అందక మరణించడం ఈ కుంభకోణం తీవ్రతను తెలియజేస్తోంది…
ఈ దుస్థితి మారాలంటే… వాడిన వెంటనే ఖరీదైన మందుల సీసాలను తప్పనిసరిగా క్రష్ (Crush) చేయాలి… ప్రతి వయల్ (Vial) ఎక్కడికి వెళ్తుందో డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించాలి… వైద్యులు రోగులు బయట కొన్న మందుల బ్యాచ్ నంబర్లు, మూలాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి… రోగులు కూడా తక్కువ ధరకే వస్తున్నాయని నకిలీ మందుల బారిన పడకుండా, అధీకృత ఫార్మసీల నుండే మందులు కొనాలి…
ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసి విచారణను వేగవంతం చేశాయి… వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దకపోతే ఇలాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉంటాయి… ఇంకెన్ని అక్రమాలు, ఇంకా ఏయే రూపాల్లో బలిగొంటున్నాయో..!!
Share this Article
