Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోలో బతుకే సో బెటర్ ! పెళ్లి కాలేదని ఎంతమాత్రమూ చింతించవలదు !

August 1, 2026 by M S R

.

మొగుడి పరిస్థితి రాను రాను బలహీనంగా మారుతోంది… అసలే ప్రియులతో కలిసి హతమార్చే కేసులు రోజూ చదువుతున్నాం కదా… ఇక చట్టాల్ని కూడా ఎడాపెడా ప్రయోగిస్తున్నారు… గృహహింస, కట్నవేధింపులు, లైంగికదాడి వంటి కేసులు పెట్టేస్తున్నారు… అవన్నీ దాటేస్తే భరణం, మనోవర్తి ఉండనే ఉన్నాయి, తాజాగా పోక్సో కేసులు కూడా పెట్టబడుతున్నాయి… దేశంలో వివాహవ్యవస్థే గందరగోళంలోకి జారిపోతోంది…

ఓ తాజా కేసులో… పిల్లల రక్షణ కోసం రూపొందించిన పోక్సో (POCSO) చట్టాన్ని కూడా వైవాహిక వివాదాల్లో ప్రతీకార ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలకు కారణమైన కేసు ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒక దంపతుల మధ్య చాలా కాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఆ వివాదాల మధ్య అమాయక పిల్లలే ప్రధాన ఆయుధాలుగా మారిపోయారు.

Ads

మొదట తండ్రి కేసు… తల్లి ఇంటికి వెళ్లిన సమయంలో తన కుమార్తెపై ఆమె మేనమామ (తల్లి సోదరుడు) లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

కొద్ది గంటల్లోనే ఎదురుదాడి … అయితే అదే రోజు, కొన్ని గంటల వ్యవధిలోనే మరో పోక్సో కేసు నమోదైంది. ఈసారి తల్లి తన కుమారుడితో ఫిర్యాదు చేయించింది. ఆ ఫిర్యాదులో భర్త సోదరి (పిన్ని) తనపై లైంగిక దాడికి పాల్పడిందని ఆ ఆరోపణ.

ఒకే కుటుంబంలో, ఒకే వైవాహిక వివాదం నేపథ్యంలో, కొద్ది గంటల వ్యవధిలో రెండు పోక్సో కేసులు నమోదు కావడం సుప్రీంకోర్టు దృష్టిని ఆకర్షించింది.

సుప్రీంకోర్టు ఏమంది? కేసును పరిశీలించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం, భర్త సోదరిపై నమోదైన కేసు విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేసింది.

తండ్రి కేసు నమోదైన వెంటనే ప్రతీకారంగా రెండో కేసు వచ్చినట్లు కనిపిస్తోందని, బాలుడి వాంగ్మూలం కూడా ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలకు పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదని కోర్టు గమనించింది. దీంతో భర్త సోదరిపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసింది.

‘పిల్లలను ఆయుధాలుగా మార్చొద్దు’ … ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వైవాహిక వివాదాల్లో చిన్నారులను లాగి, పోక్సో వంటి చట్టాలను ప్రతీకార సాధనంగా ఉపయోగించే ధోరణి పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు నిజమైన బాధితులకు న్యాయం అందించే వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించింది.

చట్టం బలహీనపడేది ఎవరి వల్ల? … పోక్సో చట్టం పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు రూపొందించబడింది. అలాంటి చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తే, ఒకవైపు నిర్దోషులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. మరోవైపు నిజంగా లైంగిక దాడికి గురైన చిన్నారుల కేసులపైనా అనవసర అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఫిర్యాదును అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇది ఒక్క పోక్సో సమస్యే కాదు… చాలా చట్టాల సమస్య!! సుప్రీంకోర్టు ఓ అపెక్స్ బాడీ, ఇలాంటివి తప్ప అన్నీ ఆలోచిస్తుంది..!!

చంద్రబాబు అయిదు వేలు ఇస్తానన్నాడు, నలుగురు పిల్లల్ని కనమన్నాడు వంటి శుష్క, నిరుపయుక్త నినాదాలకు ప్రలోభపడ్డారో... బతుకు బస్టాండే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తలెగరేసిన తెలంగాణ ! ఏ దొరవారు లేరనో అభివృద్ధి ఆగదు !!
  • సోలో బతుకే సో బెటర్ ! పెళ్లి కాలేదని ఎంతమాత్రమూ చింతించవలదు !
  • సీతకన్నా బాగుంది! ఇది ఓ ట్రోల్ పోలిక! ఇంతకీ ఈమె ఎవరంటే?!
  • దొరతనం ! అవలక్షణులను తెలంగాణపై రుద్దిన క్షుద్రరాజకీయం !!
  • “వైభవ్ సూర్యవంశీ – ఓవర్ హైప్‌తో అసలు ఒరిజినాలిటీకే గండం?”
  • ఖర్మాఖ్య ! అదిరె అభి సినిమా బెదిరె ! ఫస్టాఫ్ టోటల్ వేస్ట్ !
  • Untold Stories – రామాయణ్‌లో ఈమె ఎవరో, పాత్ర ఏమిటో ఊహించండి ?!
  • రేవంత్ సరైన చర్చ రేపాడు ! ఇవిగో కొన్ని ఇంజినీరింగ్ చేదు వాస్తవాలు !!
  • అజింక్యా అంటేనే అజేయుడు – స్థితప్రజ్ఞుడు… కానీ సరైన వీడ్కోలు లేదు!!
  • ఓ ప్రేమ పెళ్లి ! అత్యంత సంక్లిష్ట- సుదీర్ఘ విడాకుల కేసుకు చివరకు తెర !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions