Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!

April 23, 2026 by M S R

.

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.
క్యాషియర్ ఆమె బ్యాగులో ఒక టీవీ రిమోట్ గమనించాడు.
అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..
“మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?” అని.

ఆమె “లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా…”
అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.
నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!

Ads

కథ ఇంతటితో అయిపోలేదు ..!
క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.
ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!
“ఏమైంది..!?” అని క్యాషియర్ని అడిగింది.
అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు…”
నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.

కథ కొనసాగుతుంది ..!
భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.
నీతి : మీ భార్య శక్తిని, జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!

కథ ఇంకా అయిపోలేదు ..!
స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం,
“మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి” అని సూచించింది ..!
నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!

కథ_కొనసాగుతుంది ..!
ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను బయటకు తీసింది.
అది తన భర్త ఫోన్.
ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.
ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.
నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..!

కథ_ కొనసాగుతుంది ..!
ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.
ఒక నోట్ తలుపు మీద అతికించబడి ఉంది.
అందులో ఇలా రాసి ఉంది ..!
“రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..! అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు.
నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు….



ఇది సోషల్ మీడియాలో చాన్నాళ్లుగా కనిపిస్తున్న కథే… సరదాగా బాగుంటుంది… ఆ కథ ఆగినచోట మనం మొదలుపెట్టి ఓ ట్విస్టుతో ముగిస్తే..?
.

భర్త గారు ఇంటికి వచ్చేసరికి… ఆమె ఇంట్లోనే ఉంది… హాయిగా ఆన్‌లైన్‌లో ఏదో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని, టీవీలో ఏదో కొరియన్ డ్రామా చూస్తోంది… ఆయన నోరు వెళ్లబెట్టి చూస్తుండగా, ఆమె నవ్వుతూ ఇంకో బాంబు పేల్చింది.

“మీరు తాళం పట్టుకెళ్లారు కదా అని వాచ్‌మెన్ దగ్గరున్న స్పేర్ కీ తీసుకుని లోపలికి వచ్చాను. కానీ మీరు ఫోన్ మర్చిపోయారు కదా, మీ బాస్ నుండి వచ్చిన 10 మిస్డ్ కాల్స్ నేను లిఫ్ట్ చేయలేదు. బహుశా రేపు ఆఫీసులో మీకు ‘స్పెషల్ మ్యాచ్’ ఉంటుందేమో!” అని కన్నుగీటి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది.

ఆఖరి నీతి: టెక్నాలజీ ఎంత పెరిగినా… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…
  • ఈమె నోరువిప్పితే… ట్రంపు ఫ్యామిలీ బజారున పడటం ఖాయమేనా…
  • ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!
  • సరిగ్గా పోల్చాలంటే ఎస్‌.జానకి మీసాలు లేని కిశోర్‌ కుమార్‌..!!
  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…
  • నేరగాడి ప్రేమ కథ… ఈ రోతగాడి జీవితంలో మరో ఇంట్రస్టింగ్ పార్శ్యం…
  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions