.
సర్పంచ్ సాబ్ అలియాస్ శ్రేయాస్ అయ్యర్ అదృష్టం గురించి, ప్రతిభ గురించి, కసి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం… తను కెప్టెన్‌గా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ఫైనల్ చేరడం కంపల్సరీ… అంటే ఆ రేంజుకు తీసుకుపోతాడు… అది తన టీమ్ అదృష్టమా, తన అదృష్టమా వదిలేస్తే… వ్యక్తిగతంగా కూడా మెరిటోరియస్ తను…
కాకపోతే బీసీసీఐ కోచులు, పెద్దల కుళ్లు రాజకీయాల కారణంగా మన అఫిషియల్ జట్టుకు శ్రేయాస్‌కు ఎప్పుడూ ఎడమొకం, పెడమొకం… బట్, ఎప్పటికప్పుడు తను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు… పర్టిక్యులర్‌గా ఐపీఎల్… అదీ టఫ్ కాంపిటీషన్ ఉన్న లీగ్‌లో…
Ads
తాజాగా మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసుకున్నాడు… నిజంగా ఇది సాధ్యమవుతుందని బహుశా జట్టు ఓనర్ ప్రీతి జింతాయే ఊహించి ఉండదు… అఫ్‌కోర్స్, మంచి బ్యాటింగ్ పిచ్, ఢిల్లీ… కెప్టెన్ అద్భుత ఇన్నింగ్స్ 152… రెండే వికెట్ల నష్టంతో ఏకంగా 264 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు పంజాబ్ జట్టు మీద… ఐపీఎల్ రికార్డు స్కోర్ అది…
దీన్ని చేజ్ చేయడం సాధ్యమని ఎవడూ అనుకోడు, అఫ్‌కోర్స్, ఐపీఎల్‌లో ఏదైనా సాధ్యమే అయినా..! శ్రేయాస్ అయ్యర్‌కు విషమ పరీక్ష అనుకున్నారందరూ… కానీ తను సాధించాడు… ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ కలిపి పవర్ ప్లేలోనే దంచి కొట్టి, విజయానికి మార్గం వేశారు… కానీ తరువాత వరుసగా మూడు వికెట్లు పడిపోయి, మిగతా టార్గెట్ సాధ్యమేనా అనే స్థితిలో… శ్రేయాస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి… ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని భారీ చేజ్ సాధ్యం చేసి, విజయ ఢంకా మోగించాడు…
ఇక్కడ నేను చెప్పాలని అనుకున్నది… ఐపీఎల్ రికార్డు చేజులతో శ్రేయాస్‌కు ఉన్న లింకుల గురించి… అందుకే అనేది… నువ్వు తోపువురా అని..! ఈ మ్యాచ్ వదిలేస్తే, దీనికి ముందు టాప్ రన్ ఛేజింగ్… 2024లో 262 పరుగుల్ని పంజాబ్ ఛేదించింది.. గ్రేట్ ఛేజ్… అలాగే 2025లో హైదరాబాద్ జట్టు 247 రన్స్ ఇదే పంజాబ్ మీద ఛేజ్ చేసింది… అంటే టాప్ త్రీ ఛేజెస్ పంజాబ్ లింక్డ్…
.
ఈ మూడింట్లోనూ ‘శ్రేయాస్’ పాత్ర…. ఈ మూడు రికార్డు ఛేజింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ ఏదో ఒక రూపంలో (పంజాబ్ కెప్టెన్‌గా లేదా ప్రత్యర్థి కెప్టెన్‌గా) భాగమయ్యాడు…
-
పంజాబ్ vs ఢిల్లీ (2026) – 265 ఛేజ్….: ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు… ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల ఛేజింగ్‌లో శ్రేయాస్ కీలక పాత్ర పోషించాడు… 71 (36 బంతుల్లో)* పరుగులు చేసి అజేయంగా నిలిచి, పంజాబ్ జట్టును రికార్డు విజయతీరాలకు చేర్చాడు…
-
పంజాబ్ vs కోల్‌కతా (2024) – 262 ఛేజ్…: ఈ మ్యాచ్ జరిగినప్పుడు శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా ఉన్నాడు… దురదృష్టవశాత్తూ పంజాబ్ అద్భుత బ్యాటింగ్‌తో (బైర్‌స్టో సెంచరీ) శ్రేయాస్ నేతృత్వంలోని KKR జట్టుపై ఈ భారీ స్కోరును ఛేదించింది…
-
సన్‌రైజర్స్ vs పంజాబ్ (2025) – 247 ఛేజ్…: 2025లో పంజాబ్ కింగ్స్ 245 పరుగుల భారీ స్కోరు చేసినా, సన్‌రైజర్స్ దానిని ఛేదించింది…. ఈ మ్యాచ్‌లో కూడా పంజాబ్ టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్ కీలక ఆటగాడిగా/కెప్టెన్‌గా తన వంతు సహకారాన్ని అందించాడు…
చివరగా కీలక ప్రశ్న… మొన్న చెప్పుకున్నట్టే… శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ జట్టుకు ఎందుకు పనికిరావడం లేదు..!!
Share this Article