Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్పంచ్ సాబ్‌కు తొలి దెబ్బ… ఛోటా భీమ్ నేల మీదకు దించేశాడు…

April 29, 2026 by M S R

.

పంజాబ్, రాజస్థాన్… ఈ జట్లు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో మంచి పర్‌‌ఫామెన్స్ చూపిస్తున్న జట్లు… అసలు పంజాబ్ జట్టు అనగానే శ్రేయస్ అయ్యర్, ఓటమి ఎరుగని కెప్టెన్‌గా… 13 పాయింట్లతో టాప్ వన్ ప్లేసులో ఉన్నాడు కదా పాయింట్ల టేబుల్‌లో… మబ్బుల్లో ఉన్నాడు కదా… రాజస్థాన్ జట్టు తనను నేల మీదకు దింపింది… పంజాబ్ జట్టుకు మొదటి ఓటమిని రుచిచూపించింది రాజస్థాన్ జట్టు…

అఫ్‌కోర్స్, గెలుపూఓటములు సాధారణమే… కానీ పెద్దగా మిడిల్ ఆర్డర్ పర్‌ఫామెన్స్ సరిగ్గా లేకపోయినా సరే, కెప్టెన్ సరిగ్గా ఆడకపోతున్నా సరే… రాజస్థాన్ జట్టు మంచి గెలుపులు సాధిస్తోంది… పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య పోరు అంటే అందుకే క్రికెట్ ప్రేమికుల్లో ఓ ఆసక్తి ఏర్పడింది… హేమాహేమీల నడుమ పోరు కదా… అనుకున్నట్టే మంచి ఆసక్తికరంగా సాగింది పోరాటం…

Ads

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 222 పరుగులు చేసింది, టాప్ ఆర్డర్ దంచి కొట్టింది… అందరూ బాగా ఆడారు… మంచి స్కోర్… కానీ ఎప్పటిలాగే రాజస్థాన్ జట్టు ఛోటా భీమ్ వైభవ్ సూర్యవంశీ మీదే ఆశలు పెట్టుకుంది… ఎప్పటిలాగే ప్రతి బాల్‌నూ దంచిన బుడ్డోడు 16 బాల్స్‌లోనే 43 రన్స్ చేసి, మంచి పునాది వేశాడు… తను ఇంకాసేపు ఉండి ఉంటే కథ ఇంకా వేగంగా ముగిసేదేమో…

తరువాత ఎప్పటిలాగే కెప్టెన్ రియాన్ పరాగ్ నిరాశపరిచినా… యశస్వి జైస్వాల్ కుదురైన ఆట, ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్ కలిపి రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించారు… ఈ దెబ్బకు నాలుగో ప్లేసు నుంచి పాయింట్ల టేబుల్‌లో మూడో ప్లేసుకు చేరింది రాజస్థాన్ జట్టు…

ఇతర జట్ల మీద శ్రేయాస్ అయ్యర్ వ్యూహాలు బాగానే పనిచేశాయి గానీ… రాజస్థాన్ జట్టు మీద పనిచేయలేదు పాపం… మరనీ అర్షదీప్ సింగ్ అయితే ఏకంగా 17 రన్స్ ఎకానమీతో తీవ్రంగా నిరాశపరిచాడు… తనలో సరుకు అయిపోయినట్టుంది… ఆటలో మజా ఉండాలంటే వరుస గెలుపుల జట్టుకు బ్రేక్ పడాలి… అవును, రాజస్థాన్ జట్టు చేసింది అదే… పంజాబ్‌ను నేల మీదకు దించింది… ఇప్పుడు ఆట రక్తికడుతోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సోయి లేని సాయిపల్లవి… స్వయంకృతం, అతి తెలివి… ఎందుకంటే..?
  • ‘హాట్ స్టార్’ ఐతేనేం..? మనస్సుండదా..? ఆ కళ్లల్లో నీళ్లుండవా..?
  • ఎవడు ఈ సలీం డోలా..? డ్రగ్స్ దందాకే కాదు, ఉగ్రనిధులకూ దెబ్బ..!!
  • సర్పంచ్ సాబ్‌కు తొలి దెబ్బ… ఛోటా భీమ్ నేల మీదకు దించేశాడు…
  • దుబయ్ సొంత పెట్రో గేమ్… ఒపెక్ జట్టు నుంచి బయటికి… ప్రభావం..?
  • ఆషురెడ్డి రివర్స్ కట్నం కేసులో తెరపైకి వేణుస్వామి పేరు..!
  • ఈ వ్యవస్థలో వాళ్లకు ఏ హక్కులూ సాయాలూ అక్కర్లేదా..? అవి అస్థిపంజరాలా..?!
  • సోనియా నారంగ్… సోషల్ ప్రచారంలో నిజాలెన్ని..? అతిశయోక్తులెన్ని..?
  • 60 లక్షల సభ్యత్వాలు- ఓ నిజం… ఈ లెక్క కేసీయార్ కోసమే…
  • కుజదోషం ఎఫెక్ట్… ఆమె మనసు పారేసుకుంటుంది పాపం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions