Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యో దేవుడా..? చివరకు నీ సన్నిధి డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రం ఐపోయిందా..?

April 29, 2026 by M S R

.

ఇప్పటికే వీవీఐపీ, ధనికుల దేవుడిగా మార్చేశారు తిరుమల వెంకన్న స్వామిని… సరే, నెయ్యికాని నెయ్యితో లడ్డూలు, పట్టులేని పట్టు శాలువాలు, కొనుగోళ్ల అక్రమాలు, అనేక అవకతవకలు, అన్యమతస్తుల పెత్తనాలు, కొలువులు… నానారకాలుగా భ్రష్టుపట్టించి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన కథలు అనేకం చూశాం…

వాడూవీడని ఏమీ లేదు… ఏ పార్టీవాడైనా అంతే… అందరికీ ఆ దేవుడు అలుసే.., ఎటొచ్చీ, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా, నమ్మకం కోల్పోక ప్రేమగా, భక్తిగా తనను దర్శించుకోవడానికి వచ్చే సామాన్య సగటు భక్తుడికే అంత దర్శనసులభుడు గాకుండాపోయాడు దేవుడు…

Ads

కనీసం తన ఆస్తులు, నగలనైనా రక్షించుకుంటున్నాడానేది సందేహమే… ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే ఓ వార్త… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనబడే హీరో కావ్య రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు…

(అవును, అతనే బాలయ్య మార్క్ కాల్పుల కేసులో ఉన్న బెల్లంకొండ సురేష్ కొడుకు ఈ సాయి శ్రీనివాస్… మస్తు పైసలున్నాయి కదా, ఇంకేం, మనమే హీరోలం అయిపోదాం అనుకుని ఈ సాయి శ్రీనివాస్, మరో కొడుకు గణేష్ కూడా హీరోలు అయిపోయారు… ఫ్లాప్… మొహాల్లో ఒక్క ఎమోషన్ పలికితే ఒట్టు… సరే, చాలామంది వారస హీరోలు వస్తుంటారు, పోతుంటారులే గానీ…)

బుధవారం రాత్రి, అంటే ఈరోజు రాత్రి అట్టహాసంగా, వైభవోపేతంగా తిరుమలలో పెళ్లి అట… మొత్తం 500 మంది అతిథులట… తరువాత మే ఒకటిన హైదరాబాద్‌లో రిసెప్షన్ అట, సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తాడట…

ఇవన్నీ సరే గానీ… తిరుమలలో 500 మందితో ఈ అట్టహాసపు పెళ్లి దేనికి..? చివరకు అనేకానేక అపభ్రంశాలకుతోడు ఇక తిరుమలను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా మార్చేస్తారా..? ఆ వాహనాల రద్దీ, పెళ్లి ఏర్పాట్లు, విందు భోజనాలు, కాలుష్యం, శబ్ద కాలుష్యం, లైట్లు, వేడుకలు, హంగామాతో అక్కడి భక్తి వాతావరణాన్ని మరింత కలుషితం చేయడమే… (అక్కడే సంగీత్ అనే రోత ప్రోగ్రామ్ కూడా ఉంటుందా లేదా క్లారిటీ లేదు)…

అసలు టీటీడీ ఇలాంటి ఫంక్షన్లపై… పెళ్లిళ్లపై కాదు, అవి మఠాల్లో, కాస్త పద్దతిగా, భక్తితో జరుగుతూనే ఉంటాయి… కానీ అట్టహాసపు పెళ్లిళ్లపై, అతిథుల సంఖ్యపై, పరిమితులపై ఎందుకు నిబంధనలు, ఆంక్షలు ఫ్రేమ్ చేయకూడదు..? ఎంతసేపూ ధనిక భక్తులు, షో మాస్టర్ల ఎదుట సాగిలబడడమేనా..?

కాస్త అప్పుడప్పుడూ భక్తి వాతావరణం, పవిత్రత, ధార్మికత, సగటు భక్తుడు గట్రా పట్టించుకొండి… అవునూ, ఈ 500 మందికి ఏ కోటాలో ప్రత్యేక దర్శనాలు కల్పిస్తారు స్వాములూ… అన్ని లైన్లూ ఆపేసి, వీళ్లకు ప్రత్యేక దర్శనాలిచ్చే అదృష్టాన్ని దేవుడికి కల్పించి, ఈ వీవీఐపీ అతిథుల సేవలో టీటీడీ బాధ్యులూ పునీతులైపోతారా..? ఏం టీమ్‌ను పెట్టావయ్యా చంద్రబాబూ… వీళ్ల దర్శనపుణ్యంలో నీకూ కొంత వాటా దక్కుతుంది… బీ హేపీ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యో దేవుడా..? చివరకు నీ సన్నిధి డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రం ఐపోయిందా..?
  • అసలే ఈవీవీ కదా… అప్పట్లోనే జబర్దస్త్ మార్క్ మూవీ తీసి వదిలాడు…
  • నేతి బీరకాయలో నేయి… తమిళనాట తెలుగువారి ఆధిపత్యం…
  • సోయి లేని సాయిపల్లవి… స్వయంకృతం, అతి తెలివి… ఎందుకంటే..?
  • ‘హాట్ స్టార్’ ఐతేనేం..? మనస్సుండదా..? ఆ కళ్లల్లో నీళ్లుండవా..?
  • ఎవడు ఈ సలీం డోలా..? డ్రగ్స్ దందాకే కాదు, ఉగ్రనిధులకూ దెబ్బ..!!
  • సర్పంచ్ సాబ్‌కు తొలి దెబ్బ… ఛోటా భీమ్ నేల మీదకు దించేశాడు…
  • దుబయ్ సొంత పెట్రో గేమ్… ఒపెక్ జట్టు నుంచి బయటికి… ప్రభావం..?
  • ఆషురెడ్డి రివర్స్ కట్నం కేసులో తెరపైకి వేణుస్వామి పేరు..!
  • ఈ వ్యవస్థలో వాళ్లకు ఏ హక్కులూ సాయాలూ అక్కర్లేదా..? అవి అస్థిపంజరాలా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions