Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకరు ఐపీఎస్… మరొకరు ఐఐటీ… కొత్త డీజీపీ కుటుంబ నేపథ్యం…

May 1, 2026 by M S R

.

రాష్ట్ర అత్యున్నత పోలీస్ హోదాలోకి చేరాక సహజంగానే ఆ అధికారి వ్యక్తిగతం, ప్రాంతీయత, కుటుంబం, కెరీర్ వంటి వివరాలపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడుతుంది… సీవీ ఆనంద్… ప్రస్తుతం తెలంగాణ కొత్త డీజీపీ… ఆ పోస్టు దాకా కెరీర్ పయనం అంత సులభమేమీ కాదు… ప్రతి ఐపీఎస్ కూడా డీజీపీ పోస్టు దాకా చేరాలని ఆశపడటమూప సహజమే… మరి ఆయన వ్యక్తిగతం, కుటుంబం ఏమిటో పరిశీలిస్తే… ఓ ఆసక్తికరమైన ఆదర్శ మార్గం కనిపిస్తుంది…



సివిల్ సర్వీసెస్‌లో టాప్ ర్యాంకు సాధించాలని కొందరు… ఐఐటీలో సీటు సంపాదించాలని మరికొందరు కలలు కంటారు… కానీ, ఒకే ఇంట్లో ఈ రెండు అత్యున్నత శిఖరాలను అధిరోహించిన జంట ఉంటే…?  తెలంగాణ పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన సీవీ ఆనంద్ (1991 బ్యాచ్ ఐపీఎస్, ఆయన భార్య లలితా ఆనంద్ కుటుంబం అదే… అంతేకాదు, వయసు కేవలం అంకె మాత్రమేనని చెప్పే జంట వీళ్లు…

Ads

క్రికెట్ గ్రౌండ్ నుంచి పోలీస్ బాస్ వరకు: సీవీ ఆనంద్ ‘ఆల్ రౌండ్’ ప్రదర్శన! … సీవీ ఆనంద్ పక్కా హైదరాబాద్ బిడ్డ… బేగంపేట హెచ్‌పీఎస్‌లో చదువుకున్న ఆయన, చదువుతో పాటు క్రికెట్‌లోనూ ‘సిక్సర్లే’… నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తూనే హైదరాబాద్ క్రికెట్ టీమ్ తరఫున ఆడాడు… ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన తను టీమ్ ఇండియా అండర్-19 జట్టులోనూ చోటు దక్కించుకుని ఇంగ్లాండ్‌లోనూ తన బ్యాట్ ఝులిపించాడు…

అయితే, ఒక దశలో క్రికెటా? చదువా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన సివిల్స్‌నే ఎంచుకున్నాడు… లేకపోతే ఇండియా జట్టు తరఫున కూడా క్రికెట్ ఆడేవాడేమో బహుశా… సివిల్స్ మొదటి ప్రయత్నంలోనే, కేవలం 21 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎస్ సాధించడంతో ఇక మిగిలిన బతుకంతా ఖాకీమార్గంలోనే నడవక తప్పలేదు… అఫ్‌కోర్స్, ఇప్పటికీ క్రికెట్, టెన్నిస్‌ తన ఫిట్‌నెస్ బాటలు…

40 ఏళ్లలో ఐఐటీ… 57 ఏళ్లలో అరంగేట్రం: లలితా ఆనంద్ ‘వండర్’!

లలితా ఆనంద్ ప్రయాణం మరీ ప్రత్యేకం… తనదీ తెలంగాణే… భర్త కెరీర్, పిల్లల పెంపకం కోసం తన చదువును మధ్యలో త్యాగం చేసిన ఆమె, పట్టుదల ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూపించింది…

  • ఐఐటీ పీహెచ్‌డీ…: 40 ఏళ్ల వయసులో పుస్తకాలు పట్టి, ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ (మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్) పూర్తి చేసింది…

  • ప్రొఫెసర్‌గా…: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో రీసెర్చర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించింది…

  • కళా ప్రస్థానం…: ఇక్కడితో ఆగిపోలేదు… చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడానికి 57 ఏళ్ల వయసులో భరతనాట్యం అరంగేట్రం ఇచ్చి అందరినీ అబ్బురపరిచింది….

ఈ దంపతుల పెద్ద కుమారుడు చామ మిలింద్ తన తండ్రి బాటలోనే క్రికెట్ రంగాన్ని ఎంచుకున్నాడు… ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, హైదరాబాద్ ప్రొఫెషనల్ క్రికెట్‌లో కీలక ఆటగాడు ఇప్పుడు… ఒకరు పోలీస్ సేవలో సమాజానికి కాపలా… మరొకరు విద్యా- కళా రంగాల్లో రాణింపు… ఇంట్రస్టింగ్…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకరు ఐపీఎస్… మరొకరు ఐఐటీ… కొత్త డీజీపీ కుటుంబ నేపథ్యం…
  • హహహ…! బిడ్డింటికి దారేది..? స్పూఫ్… నవ్వు ఆపుకుంటున్నవ్ కదరా..!!
  • గెలిచిన గుజరాత్ పైకి ఎక్కలేదు… ఓడిన బెంగుళూరు దిగిపోలేదు…
  • హిమాలయాల నిశ్శబ్దంలో ఓ అద్భుతం… అలీనా వెట్రోవా ‘పునర్జన్మ’ కథ…!
  • కోర్టు వర్చువల్ విచారణ సందర్భంగా అశ్లీల వీడియోల ప్రదర్శన
  • టీఆర్ఎస్… పార్టీ పేరు, అనుమతి… బభ్రాజమానం- భజగోవిందం…
  • చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
  • ‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?
  • TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!
  • ఆ అసందర్శపు, అసంగత ప్రశ్నకూ… ఆమె పరిణత జవాబు సూపర్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions