Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…

May 1, 2026 by M S R

.

మొన్నామధ్య మనం ఓ ముచ్చట చెప్పుకున్నాం గుర్తుందా..? తెలంగాణ గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మంచి మార్కులు, ర్యాంకులు సంపాదించారు… గ్రామీణ నేపథ్యం, పేదరికం, కులం, మతం, ప్రాంతం, ఏదీ ప్రతిభకు అడ్డురాదు… చదువుకునే పరిస్థితులు క్రియేట్ చేస్తే వాళ్లు అద్భుతాలు క్రియేట్ చేస్తారని చెప్పడానికి ప్రబల నిదర్శనం…

కానీ ఏం సుఖం..? రేవంత్ రెడ్డి సమాచార విభాగం ఘోర వైఫల్యం, తన టీమ్ ఫెయిల్యూర్… అందుకే ఏమాత్రం ఆ ఘనతను, సొసైటీకి ఆదర్శంగా ఉండగల సక్సెస్ స్టోరీని చెప్పుకోలేక చేతులెత్తేసింది… ఖచ్చితంగా… రేవంత్ రెడ్డి తన పాలనలో వైఫల్యాలు ఏమున్నాయి అంటే, టాప్ టెన్‌లో ప్రచార వైఫల్యం కూడా ఒకటి…

Ads

సీన్ కట్ చేస్తే… దీనికి పూర్తి కంట్రాస్టుగా… ఒక ఐడియల్ ప్రచారాన్ని చెప్పుకుందాం… ఏపీలో పదో తరగతి ఫలితాలు రిలీజయ్యాయి… ఏపీలో విద్యా మంత్రి లోకేష్… సారీ, తను యాక్టింగ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్… తను చెప్పిందే శాసనం… ఐనా సరే… తన ఊసు లేకుండా, తన డప్పు కొట్టుకోకుండా పత్రికలకు యాడ్స్ ఇచ్చాడు…

మనబడి

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా యాడ్స్… వాడో వీడో రాసేదేముంది..? ఎవడిని బతిమిలాడేదేముంది..? మన ఘనతను మనమే ప్రచారం చేసుకుందాం…. ఎస్, అదే కోణంలో… 8 మంది ప్రభుత్వ విద్యార్థులు ఏకంగా 600కు 595 మార్కులు… గ్రేట్… వాళ్ల మొహాలు, స్కూళ్ల పేర్లతో సహా… అదే చెబుతున్నది… మెరిట్‌కు కులం, ప్రాంతం, మతం, పేదరికం, గ్రామీణ నేపథ్యం అడ్డుకావు అని…  ఒరేయ్ మేమెవరికి తక్కువరా అన్నట్టుగా…

ఐతే ఇక్కడ మెచ్చుకునేది ఏమిటంటే..? యాడ్స్‌లో ఎక్కడా చంద్రబాబు ఫోటో లేదు… అదొక అబ్బురం… లోకేష్ ఫోటో లేదు, తను సంబంధిత మంత్రి అయినా సరే…. సరే, పవన్ కల్యాణ్ ఫోటో లేదు, తనకు లింక్ లేదు కూడా… ఎక్కడా కూటమి ప్రభుత్వం అనే జాడలు, ఛాయలు లేవు… ఒక్క అధికారి ఫోటో లేదు… ఐనా వాళ్లు పీకేదేముందిలే… కార్పొరేట్ యాడ్స్ అంటేనే అబద్ధాలు… కానీ ఇక్కడ నిజాయితీగా వివరాల ప్రకటన…

జస్ట్, ప్రతి ప్రభుత్వ విద్యార్థికీ ఓ అభినందన… ప్రతి ప్రభుత్వ టీచర్‌కూ ఓ గుర్తింపు… ఈ స్కూల్ మాది, ఈ వ్యవస్థ మాది అని ఓన్ చేసుకోవడం గొప్ప విషయం… నిజానికి ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన శ్రమ జగన్‌ది… ఆకునూరి మురళి శ్రమ… కానీ చెప్పుకునే తెలివి, సోయి ఎక్కడిది… అది లోకేష్‌కు ఉంది..!!

ఎస్, జగన్ ఫెయిల్యూర్ తన టీమ్ ఎంపికలో ఉంది… లోకేష్ సక్సెస్ తన టీమ్ ఎంపికలో ఉంది…!! అఫ్‌కోర్స్, జగన్‌కు సమజవుతుందని అనుకుంటే అది మన భ్రమ..!! ఇంత మంచి మార్కులు సంపాదించిన ప్రతి ప్రభుత్వ బడి విద్యార్థికీ ‘ముచ్చట’ అభినందనలు, ఆశీస్సులు..!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…
  • సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!
  • కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…
  • బెంగాల్ రిజల్ట్..! యాక్సిస్‌తోపాటు సట్టాబజార్ కూడా హేండ్సప్..!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • సుడిగాలి సుధీర్… తనను రేయ్, రా, థూ అనడం సమంజసమేనా…
  • ఓహ్… ఆషురెడ్డి కథ- వ్యథ ఇదా..? లండన్ సాఫ్ట్‌వేరుడే అసలు దోషి..!!
  • హన్మంతన్నా… అంతా నిమ్మళమేనా… మంచి గుర్తింపు ఇచ్చిండు సీఎం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions