Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…

May 2, 2026 by M S R

.

కొన్ని ఫోటోలు మరుపుకు రావు… అంతులేని ఉద్వేగం, ప్రేమ… అన్నింటికీ మించి కడుపుతీపి… ఈ ఫోటో కూడా అదే… నిజానికి చాలామంది జర్నలిస్టులకు ఇది మామూలు ఫోటో… కానీ గొప్ప ఫోటో…

నెట్‌లో కనిపించే ఓ పోస్టు మనమూ చెప్పుకుందాం, కళ్లు చెమర్చేలా ఉంది…

Ads



శ్వాస ఆగిపోయింది కానీ… మమకారపు బంధం తెగిపోలేదు… అలలు ఓడిపోయాయి కానీ…. తల్లి ప్రేమ మాత్రం వీడిపోలేదు… అమ్మ మమకారానికి మరణం లేదని నిరూపించిన హృదయ విదారక దృశ్యం ఇది…

దేశాన్ని కలచివేస్తున్న జబల్‌పూర్ విషాదం: మధ్యప్రదేశ్ రాష్ట్రం, జబల్‌పూర్‌లోని బర్గి డ్యామ్ వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదం దేశవ్యాప్తంగా అందరి కళ్లను చెమర్చుతోంది,,. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక తల్లి- తన బిడ్డకు సంబంధించిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని ముక్కలు చేస్తోంది…

.
ప్రమాదం జరిగిన సమయంలో ఆ తల్లి తన ప్రాణం కంటే తన బిడ్డ ప్రాణమే ముఖ్యమని భావించింది… బిడ్డను తన గుండెలకు అద్దుకుని, లైఫ్ జాకెట్‌తో గట్టిగా చుట్టేసింది… చివరి శ్వాస వరకు తన బిడ్డను రక్షించుకోవడానికి ఆ తల్లి పోరాడింది…

నీటి అలలతో, మృత్యువుతో ఆ తల్లి పోరాడింది… “నీకేం కాదు, నేనున్నాను… నేనున్నంతవరకూ నువ్వుంటావు” అని తన బిడ్డకు ధైర్యం చెబుతూనే కన్నుమూసింది… జీవితం ఓడిపోయి ఉండవచ్చు కానీ, ఆ తల్లి ప్రేమ మాత్రం ఓడిపోలేదు… మమకారానికి అసలైన నిర్వచనం ఈ దృశ్యం…

సహాయక చర్యల్లో భాగంగా మృతదేహాలను వెలికితీసినప్పుడు, ఆ తల్లి తన బిడ్డను హత్తుకున్న స్థితిలోనే మరణించి ఉండటం చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు… మరణం కూడా ఆ తల్లి ప్రేమను, బిడ్డతో ఉన్న బంధాన్ని వేరు చేయలేకపోయింది…

(పాపం శమించుగాక… కామప్రకోపంతో, ప్రియుళ్లతో కలిసి, మొగుళ్లనే కాదు, పిల్లలనూ బలిగొంటున్న కామపిశాచుల కథలతో ఓసారి పోల్చిచూడండి, ఈ తల్లితనం ఎంత గొప్పదో…)

ఎక్కడైతే సంతోషంగా నవ్వులు వినిపించాలో, అక్కడ ఇప్పుడు మౌనం, తీరని వేదన మిగిలాయి… భగవంతుడు మరణించిన వారందరి సద్గతి కలిగించాలని, వారి కుటుంబాలకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుందాం….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…
  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions