.
అందరిలోనూ ఓ ప్రశ్న… ఎంజీఆర్, జయలలిత తరువాత… ఎన్టీయార్ తరువాత… సినిమా ఆకర్షణతో సీఎంలు ఐనవారు లేరు కదా… తరువాతకాలంలో చిరంజీవి, కమలహాసన్, విజయకాంత్ తదితరులెందరో విఫలమయ్యారు కదా… మరి విజయ్ ఎలా ఈ ఫలితాలు సాధించాడు… తొలిసారి తమిళనాడులో ద్రవిడ పార్టీలకు భిన్నమైన ఓ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, సీఎం కాబోతున్నాడు ఎలా..?
ఇక్కడ ఇంకొన్ని అంశాలు… పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో కలిసేవరకూ నథింగ్… తనే గెలవలేకపోయాడు… రజినీకాంత్ పిరికి, ఏళ్లుగా ఫ్యాన్స్‌ను సస్పెన్స్‌లో పెట్టి చేతులెత్తేశాడు… చిరంజీవి ఏవో కొన్ని సీట్లు గెలిచీ కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేశాడు… సో, ఇక సౌత్ ఇండియాలో గతంనాటి సినిమా ఆకర్షణ వోట్లను రాల్చదు అనే భావన ఏర్పడింది కదా… మరి విజయ్ ఎలా గెలిచాడు..?
Ads
సింపుల్… విజయ్ విజయానికి కేవలం హీరో బాపతు ఆకర్షణ మాత్రమే కాదు, చాలా అంశాలు కలిసొచ్చాయి… 1) హీరోగా చాలా సంపాదించాడు… డబ్బుకు ఢోకా లేదు… 2) సినిమా హీరోగా ఆకర్షణ ఉండనే ఉంది… కొత్త వోటర్లు, యువత వోట్లు డీఎంకే నుంచి భారీగా టర్నయ్యాయి… 3) తను స్వతహాగా క్రిస్టియన్, దళిత్… దాంతో డీఎంకే పట్ల వ్యతిరేకంగా ఉన్న మైనారిటీలు, దళితులంతా తనకు అండగా నిలబడ్డారు… 4) తను బీజేపీ ఫోల్డ్‌లోకి వెళ్లకపోవడంతో దళిత్, మైనారిటీ వోటర్లకు కాన్ఫిడెన్స్ పెరిగింది…
5) డీఎంకే ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకత పెరిగి ఉంది… 6) డీఎంకే కుటుంబ పాలన, అవినీతి, చివరకు తన కొడుకునే డిప్యూటీ సీఎంను చేసి, తన వారసత్వాన్ని ప్రకటించడం కూడా వ్యతిరేకతకు దారితీసింది… పైగా ఉదయనిధి అజ్ఙాని… 7) జయలలిత తరువాత అన్నాడీఎంకేలో చరిష్మా ఉన్న లీడర్ ఎవడూ లేకుండా పోయాడు… 8) పళనిస్వామి కోసం బీజేపీ అన్నామలైని పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టడం కూడా అన్నాడీఎంకేకు మైనస్…
ఇలాంటి ఎన్నో కారణాలతో తమిళ రాజకీయాల్లో ఓ స్పేస్ ఏర్పడింది… ఇటు డీఎంకేకు, అటు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓ నాయకుడు కావాలి… అదుగో అది ఉపకరించింది విజయ్‌కు…! సరే, చివరి మెజారిటీ అంకెలు ఎలా ఉంటాయో గానీ, విజయ్ సీఎం కావడం తథ్యం… అయితే..?
ఫ్యాన్స్ వేరు… కార్యకర్తలు వేరు… ఓ సినిమా ప్రాజెక్టు వేరు… ఓ పార్టీ వేరు… సినిమా షూటింగ్, కథ వేరు… రాష్ట్ర పాలన వేరు… అన్నాడీఎంకేకు పెద్ద సమస్యలు ఉండవు గానీ డీఎంకే స్టాలిన్ మహా ముదురు, విజయ్‌కు నిద్ర పట్టనివ్వడు… డీఎంకేలు, బీఆర్ఎస్‌లు గట్రా అధికారంలో లేకపోతేనే అసలు సమస్యలు…
సో, విజయ్‌కు అనుకోకుండా ఓ మంచి అదృష్టం వరించింది, తొలి తమిళ క్రిస్టియన్ ముఖ్యమంత్రికి అభినందనలు… త్రిషకు కూడా..! పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి, సినిమాల్ని వదిలిపెట్టి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందాలి… (ఇతర తెలుగు, తమిళ నాయక హీరోల్లాగా గాకుండా)… అదే ఆశిద్దాం..!!
.
అయిదో పదో సీట్లు విజయ్‌కు అవసరం అయితే… కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతునిస్తాయా..? ఇస్తే ఇండికూటమి ఇచ్చుకుపోయినట్టే…!!
Share this Article