Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!

May 5, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనరుపై యస్ గోపాల్ రెడ్డి నిర్మించిన 13 వ సినిమా 1992 ఏప్రిల్లో వచ్చిన ఈ అల్లరి పిల్ల . మళయాళంలో సూపర్ హిట్టయిన కిళుక్కుం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , రేవతి లీడ్ రోల్సులో నటించారు . హిందీలోకి ముస్కురాహట్ అనే టైటిలుతో రీమేక్ అయింది . హిందీలో జే మెహతా , రేవతి , అమ్రీష్ పురి , అనిల్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు .

మన తెలుగు సినిమాలో సురేష్ , మీనా హీరోహీరోయిన్లుగా నటించారు . మీనాను షీరో అని అనవచ్చేమో ! సినిమా ప్రారంభంలో మతి స్థిమితం లేని పిల్లగా , తర్వాత తాత సత్యనారాయణని అల్లరి పెట్టే పిల్లగా వైవిధ్య నటనను చూపింది .

Ads

టూకీగా కధ ఏమిటంటే…. తండ్రిని వెతుక్కుంటూ ఓ అనాధ యువతి మీనా తిరుపతి చేరుతుంది . గైడ్ కం టాక్సీ డ్రైవరుగా పనిచేసే సురేష్ ఆమెకు సంరక్షకుడు అవుతాడు . ఆమె గురించి పత్రికల ద్వారా తెలుసుకున్న సురేష్ , అతని స్నేహితుడు చిన్నా ఆమెను అప్పగించి డబ్బు సంపాదిద్దామని ప్లాన్ చేస్తారు .

ఈలోపు సురేషుకి మీనా తానెందుకు తిరుపతి వచ్చిందో సురేషుకి చెపుతుంది . రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సత్యనారాయణ వద్దకు పనిపిల్లగా చేరుస్తాడు . క్లైమాక్సులో సత్యనారాయణ పెద్ద కొడుకు ఈశ్వరరావు అక్రమ సంతానమే మీనా అని తెలవటం , వెతుక్కుంటూ వచ్చిన తండ్రి , తాతలను కలవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

మళయాళంలో హిట్టయిన ఈ సినిమా తెలుగులో ఏవరేజ్ గానే ఆడినట్లుంది . కోడి రామకృష్ణ దర్శకుడు . విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో వెన్నెలకంటి పాటల్ని , గణేష్ పాత్రో డైలాగులను వ్రాసారు .

అన్ని పాటల్లోకి తూరుపు సింధూరపు మందారపు హిందోళపు అంటూ సాగే పాట , దాని చిత్రీకరణ బాగుంటాయి . మీనా నృత్యం కూడా బాగుంటుంది . అలకలకు లాలి జో , భలే చాన్స్ భలే చాన్స్ , ఇంటా ఇంటా పాటలు బాగుంటాయి .

ఇతర పాత్రల్లో చిన్నా , సత్యనారాయణ , లతాశ్రీ , ఈశ్వరరావు , ఫణి , కల్పనారాయ్ , సూర్యకళ , చిడతల అప్పారావు  తదితరులు నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు , ముఖ్యంగా మీనా అభిమానులు చూడవచ్చు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!
  • బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…
  • ఆ మమతా దిగిపోయింది… ఇక మిగిలింది ఒకేఒక లేడీ సీఎం…
  • మల్లాడికి ఆరో విజయం…, తమిళిసైకి ఏడో ఓటమి… కంట్రాస్టు…
  • మమత పతనం రెండేళ్ల క్రితమే చెప్పింది..! మరో రెండు కీలకం…!
  • మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…
  • మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…
  • నీ పో మోనే విజయ్… రేవంత్ స్లోగన్ పేలింది… విజయన్ ఇంటికి…
  • ఆ ‘కార్తీక దీపం’ ఆర్పాలని చూసిన స్టాలిన్… తనే ఆరిపోయాడు…
  • కేసీయార్‌పై మరో పిడుగు..! కరెంటు అక్రమాలపైనా సీబీఐ ఎందుకంటే..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions