Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘లాటరీ’ తగిలింది… ఆ ’ఫ్యామిలీ’ గెలిచింది… అల్లుడు కాబోయే మంత్రి…

May 5, 2026 by M S R

.

వేల కోట్ల రూపాయల లాటరీ, ఇతర దందాలు… దేశంలోని ప్రముఖ పార్టీలన్నింటికీ విస్తృతంగా, ధారాళంగా చందాలు… బోలెడు కేసులు… వివాదాలు… మనం ఈ ఎన్నికలకు ముందు చెప్పుకున్నాం కదా… ది ఫేమస్ లాటరీ కింగ్ Santiago Martin కుటుంబం ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగింది.., ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు మూడు వేర్వేరు పార్టీల్లో పోటీ చేయడం విశేషంగా నిలిచింది… మరి వాళ్లు గెలిచారా..? మార్టిన్ ఎత్తుగడ ఫలించిందా..? ఎస్…

ముందుగా ఆయన కథేమిటో, ఎత్తులేమిటో ఓసారి సంక్షిప్తంగా… పవర్ ఫుల్ ఫ్యామిలీ ఫార్ములా…: ఒకే కుటుంబం… మూడు పార్టీల్లో రాజకీయ పోటీ! బహుశా భారత దేశ రాజకీయ చరిత్రలో దీన్ని ఓ విశేషంగా చెప్పొచ్చునేమో… తమిళనాడు–పుదుచ్చేరి రాజకీయాల్లో ఈసారి ఈ  ఆసక్తికరమైన రాజకీయం పెద్ద చర్చనీయాంశంగా మారింది…

Ads

ఈ కుటుంబంలో ముఖ్యంగా దృష్టి ఆకర్షించిన పేరు Jose Charles Martin… మార్టిన్ కుమారుడైన జోస్ చార్లెస్ పుదుచ్చేరి రాజకీయాల్లో తనదైన స్థానం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాడు… ఆయన సొంతంగా పార్టీ ‘లక్ష్య జననాయక కచ్చి (LJK)’ను స్థాపించాడు.., NDA కూటమితో కలిసి ఎన్నికల రంగంలోకి దిగాడు… యువ నాయకుడిగా, తన తండ్రి వ్యాపార ప్రభావాన్ని రాజకీయాల్లోకి మలచాలన్న లక్ష్యం…

సింపుల్‌గా చెప్పాలంటే, తండ్రి ఈసారి ప్రయోగిస్తున్న ఓ విచిత్ర ఎత్తుగడ… కొడుకు బీజేపీ కూటమిలో ఉన్నాడు కదా… ఇదే సమయంలో, ఆయన తల్లి, అనగా మార్టిన్ భార్య Leema Rose Martin తమిళనాడులో AIADMK తరఫున పోటీ చేసింది… ఆల్రెడీ ఈ లాటరీ కింగ్ కుటుంబానికి డీఎంకేతో మంచి సంబంధాలు ఉన్నాయి కూడా… సో, రెండు ద్రవిడ పార్టీలూ మనవే…

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విశేషంగా వినిపించే పేరు టీవీకే విజయ్ కదా… అపూర్వ విజయం అందుకున్నాడు కదా… ఆ పార్టీలో కూడా తన కర్చీఫ్ వేశాడు మార్టిన్ ఎప్పుడో… అల్లుడిని దింపాడు… అల్లుడి పేరు ఆధవ అర్జున… ప్రస్తుతం టీవీకేలో నెంబర్ టూ…

జాగ్రత్తగా గమనించండి… వాళ్ల లాటరీ వ్యాపారానికి తమిళనాడు అడ్డా… అక్కడ కీలకమైన పార్టీలు, ప్లస్ కేంద్రంలో కీలకమైన పార్టీ ఏమిటి..? అన్నాడీఎంకే, డీఎంకే, టీవీకే, బీజేపీ… ఇంతే కదా… సో మార్టిన్ భార్యను అన్నాడీఎంకే నుంచి పోటీకి దింపాడు… అల్లుడిని టీవీకే నుంచి పోటీచేయించాడు… కొడుకు బీజేపీ కూటమి తరఫున పోటీ చేశాడు పుదుచ్చేరిలో… డీఎంకేతో సత్సంబంధాలు సరేసరి…

ఇదేమీ యాదృచ్ఛికం కాదు… పక్కా ప్లానింగ్… ఎవరు అధికారంలోకి వచ్చినా సరే, తన మాట చెల్లుబాటు కోసం ఎత్తుగడ… ఎందుకు అంటారా..? లాటరీ మార్టిన్‌గా చెప్పబడే ఈ గ్రూపు వ్యాపారం లాటరీ టికెట్లు… అనేక అక్రమాల కేసులున్నాయి… ప్రతి పార్టీలో తన వాయిస్ ఉండాలనే మార్టిన్ వ్యూహం విశేషమే కదా మరి…

మరి లాటరీ కింగ్ ఎత్తు పారిందా..? ఎస్, పారింది… శాంటియాగో మార్టిన్ కుటుంబం నుంచి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులు పోటీ చేసి, ముగ్గురూ విజయం సాధించారు…

  • లీమా రోజ్ మార్టిన్ (శాంటియాగో మార్టిన్ భార్య)…: ఈమె తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి AIADMK (అన్నాడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేసి, 2,739 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది… గెలుపు గెలుపే కదా… ఈమె ఈ ఎన్నికల్లో తమిళనాడులోనే అత్యంత ధనిక అభ్యర్థి…

  • జోస్ చార్లెస్ మార్టిన్ (కుమారుడు)…: ఈయన పుదుచ్చేరిలోని కామరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి తన సొంత పార్టీ ‘లక్ష్య జననాయక కచ్చి’ తరపున పోటీ చేశాడు… NDA (AINRC-BJP) కూటమి మద్దతుతో 10,205 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు…

  • ఆధవ్ అర్జున (అల్లుడు)…: శాంటియాగో మార్టిన్ కుమార్తె డెయిసీ భర్త అయిన ఈయన, TVK (తమిళగ వెట్రి కజగం) పార్టీ తరపున చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,302 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు… విజయ్ కేబినెట్‌లో మంత్రి కాబోతున్నాడట కూడా..! జయహో లాటరీ కింగ్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘లాటరీ’ తగిలింది… ఆ ’ఫ్యామిలీ’ గెలిచింది… అల్లుడు కాబోయే మంత్రి…
  • అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!
  • బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…
  • ఆ మమతా దిగిపోయింది… ఇక మిగిలింది ఒకేఒక లేడీ సీఎం…
  • మల్లాడికి ఆరో విజయం…, తమిళిసైకి ఏడో ఓటమి… కంట్రాస్టు…
  • మమత పతనం రెండేళ్ల క్రితమే చెప్పింది..! మరో రెండు కీలకం…!
  • మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…
  • మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…
  • నీ పో మోనే విజయ్… రేవంత్ స్లోగన్ పేలింది… విజయన్ ఇంటికి…
  • ఆ ‘కార్తీక దీపం’ ఆర్పాలని చూసిన స్టాలిన్… తనే ఆరిపోయాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions