Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇక పంజాబ్‌పై బీజేపీ కన్ను..! ‘ఆప్’ను మరింత తొక్కడమే టార్గెట్..!!

May 6, 2026 by M S R

.

బెంగాల్ కోట ఆక్రమించుకున్నాం… ఇక వాట్ నెక్స్ట్? బీజేపీ వర్గాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇదే చర్చ నిన్నటి నుంచీ… కాస్త వివరంగా చెప్పుకోవాలి ఇది… అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి కదా… ఇక ఈ సంవత్సరం ఎన్నికల్లేవు… వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది…

అవి కీలకమైన ఎన్నికలు… పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా… వీటిల్లో ఉత్తరప్రదేశ్ రాజకీయంగా ఎంత కీలకమైందో తెలుసు కదా… అక్కడ అధికారం నిలుపుకునే దిశలో బీజేపీ కాన్సంట్రేట్ చేస్తుంది… గత ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఒడిదొడుకులను ఎదుర్కుంది కదా… ఇప్పుడు అక్కడ అధికారాన్ని బలంగా కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీది…

Ads

తరువాత పంజాబ్… ఇప్పటికిప్పుడు పంజాబ్‌లో పెద్దగా సాధించేది ఏమీ లేకపోయినా… ఖలిస్థానీ శక్తులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది… ఈ దిశలో ఆప్‌ను బీజేపీ తక్కువ అంచనా వేసింది… ఢిల్లీలో రైతు ఉద్యమాల దగ్గర నుంచి ఆప్ రకరకాలుగా ఖలిస్థానీ శక్తులకు మద్దతుగా ఉంటూ వస్తోంది… పంజాబ్‌లో మళ్లీ ఖలిస్తానీవాదం పెరుగుతుండటంతో అకాలీదళ్ కూడా ఎన్డీయే నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది…

  • ఆప్‌ను నిర్వీర్యం చేయడం బీజేపీకి రాజకీయంగానే కాదు, వేర్పాటువాదం కోణంలోనూ అవసరం… ఫస్ట్ దెబ్బ మద్యం కేసు… తరువాత ఢిల్లీ పీఠం కొట్టేయడం… మొన్న ఆప్ రాజ్యసభ సభ్యుల్లో చీలిక… ఇప్పుడిక పంజాబ్‌లో మళ్లీ అకాలీదళ్ తదితర పాత మిత్రులతో కలిసి ఓ సంఘటన నిర్మాణం చేసి ఆప్‌ను దెబ్బ తీయాలనేది బీజేపీ ప్లాన్… ఆ దిశగా కసరత్తులే ప్రస్తుత ప్రాధాన్యం బీజేపీకి…

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… గతంలో జస్టిన్ ట్రూడో కెనడాలో సిక్కు ఎంపీల మీద ఆధారపడి ప్రభుత్వం కొనసాగిస్తున్న కాలంలో… ఖలిస్థానీ శక్తులు బలపడ్డాయి… నిజ్జర్ హత్య కేసులో కెనడా- ఇండియా సంబంధాలు కూడా ఒడిదొడుకులకు గురయ్యాయి… బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోనూ ఈ శక్తులు బలం పెంచుకున్నాయి… రీసెంట్‌గా ఒక వార్త దేశీయ మీడియాలో ప్రచారానికి నోచుకోలేదు గానీ… కెనడా నిఘా సంస్థ ప్రకటన ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సిందే…

  • ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపుల కార్యకలాపాలు కెనడా జాతీయ భద్రతకు ముప్పుగా మారాయనీ… కెనడా సంస్థలను వినియోగిస్తూ హింసాత్మక తీవ్రవాద అజెండాను ప్రోత్సహిస్తున్నట్లుగా కెనడా నిఘా సంస్థ పేర్కొంది… కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఎస్ఐఎస్) విడుదల చేసిన 2025 పబ్లిక్ రిపోర్ట్, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదుల (సీడీకేఇ) హింసాత్మక కార్యకలాపాలు కెనడా జాతీయ భద్రతకే కాకుండా దేశ ప్రయోజనాలకు కూడా ముప్పుగా కొనసాగుతున్నాయని తెలిపింది…

కొంతమంది ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా పౌరులతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు… వారు కెనడా సంస్థలను వినియోగించి తమ హింసాత్మక అజెండాను ప్రచారం చేయడంతో పాటు, నిధులు సేకరించి వాటిని హింసాత్మక కార్యకలాపాలకు మళ్లిస్తున్నారు” అని కెనడా ప్రభుత్వ వెబ్ సైట్లో శుక్రవారం విడుదలైన ఆ నివేదిక పేర్కొంది…

ఈ నివేదిక విడుదల కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది… ఎందుకంటే, గత ఏడాది ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబింగ్ ఘటనకు 40 ఏళ్లు పూర్తయ్యాయి… ఈ దాడికి సంబంధించి అనుమానితులు కెనడా కేంద్రంగా ఉన్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులకు చెందిన వారేనని నివేదిక గుర్తుచేసింది… ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా- ఇండియా సంబంధాలు  గత ఏడాది బాధ్యతలు స్వీకరించిన కెనడా ప్రధాని మార్క్ కార్నే హయాంలో మళ్లీ కాస్త చక్కబడుతున్నాయి…

సో, మరో బంగ్లాదేశ్‌గా మార్చబడుతున్న బెంగాల్‌ను మమత నుంచి విడిపించడంకన్నా పంజాబ్ మరీ ముఖ్యం… కాకపోతే అది బీజేపీకి ఒంటరిగా అస్సలు సాధ్యం కాదు… ఏం చేయాలనేదే ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తక్షణ కార్యాచరణ, మథనం…!! నిజానికి మమతకన్నా కేజ్రీవాల్ ఎక్కువ ప్రమాదకారి కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొన్ని జిల్లాల్లో జీరో సీట్స్..! ప్రాంతీయమా..? ఉపప్రాంతీయ పార్టీలా..?!
  • ఇక పంజాబ్‌పై బీజేపీ కన్ను..! ‘ఆప్’ను మరింత తొక్కడమే టార్గెట్..!!
  • క్రిస్టియన్… దళిత్ కాదు… తన కులానికీ ఓ చరిత్ర… హైదరాబాద్‌కూ లింక్స్…
  • కొరడా పట్టుకో సీఎం సారూ… లేకపోతే నీ కళ్లకే గంతలు కడతారు…
  • మమత మట్టికరిచింది… ఆ దుర్గగుడి తలుపులు తెరుచుకున్నయ్…
  • ‘‘తిక్కలదిర ఈ అక్క… వేగలేము ఈ అక్కతో… ఆడలేము తైతక్క…’’
  • నో… వోట్ల తొలగింపుతో బీజేపీకి ఫాయిదా అనేది ఉత్త బోగస్ వాదన…
  • ‘లాటరీ’ తగిలింది… ఆ ’ఫ్యామిలీ’ గెలిచింది… అల్లుడు కాబోయే మంత్రి…
  • అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!
  • బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions