Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింగరాయ కొండకాడా… ఐటమ్ సాంగ్‌లో అర్చనా పూరన్‌సింగ్!

June 26, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. వెంకటేష్ ఖాతాలో మరో విక్టరీ ఈ కొండపల్లి రాజా . మనం తినే ప్రతి గింజ మీద తినే వాడి పేరు ఉంటుంది . అలాగే ఈ సినిమాకు కూడా చాలా మలుపులు ఉన్నాయి . 1992 లో తమిళంలో హిట్టయిన అణ్ణామలై సినిమా రీమేక్ హక్కులను కె వి వి సత్యనారాయణ కొనుగోలు చేసాడు .
చిరంజీవితో తీయాలనేది ఆయన ఆలోచన .

అనుకోకుండా ఫ్లైట్లో కలిసిన చిరంజీవికి కధ చెప్పటం ఆయన ఓకే అనటం ఆఘమేఘాల మీద జరిగిపోయింది . అదే రోజుల్లో సుందరకాండ షూటింగ్ కూడా జరుగుతుంది . ఆ షూటింగులో అణ్ణామలై రీమేక్ హక్కుల కొనుగోలు విషయం తెలిసిన వెంకటేష్ ఆ సినిమాలో కూడా తానే నటిస్తానని చెప్పటంతో మొహమాటం మీద కె వి వి సత్యనారాయణ కాదనలేక పోయారట . అలా చిరంజీవి నటించవలసిన హిట్ సినిమా వెంకటేష్ ఎకౌంట్లో పడిపోయింది .

Ads

ఈ సినిమాకు చాలా స్టోరీ ఉంది . తమిళంలో రజనీకాంత్ , శరత్ బాబు , ఖుష్బూ , రేఖ/ సుమతి ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ తమిళ సినిమాకు స్ఫూర్తి 1988 లో వచ్చిన ప్రాణస్నేహితులు . ఇందులో కృష్ణంరాజు , శరత్ బాబు , రాధ , సురేష్ , అరుణ  తదితరులు నటించారు .

ఈ తెలుగు సినిమాకు మాతృక హిందీలో ఖుద్ గర్జ్ . అందులో శతృఘ్న సిన్హా , జితేంద్ర , భానుప్రియ , అమృతా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు . ఆ హిందీ సినిమాకు స్ఫూర్తి ఇంగ్లీషులో Jeffrey Archer వ్రాసిన Kane and Abel నవల . తన అనుమతి లేకుండా ఆ కధను సినిమాగా తీస్తున్నందుకు కృష్ణంరాజు కె వి వి సత్యనారాయణ మీద కోర్టులో కేస్ కూడా వేసి తర్వాత ఏదో రాజీ పడ్డారట . ఇంత కధ ఉంది 1993 జూలైలో వచ్చిన ఈ కొండపల్లి రాజా సినిమాకు .

బహుశా ఈ సినిమా కధ తెలియని సినీ ప్రేమికులు ఉండరేమో ! చాలా తరచుగా ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . నేనే ఎన్నోసార్లు చూసి ఉంటా . టూకీగా ఏంటంటే : ఇద్దరు ప్రాణస్నేహితులు . ఒకరు పెద్ద హోటల్ ప్రొప్రైటర్ . మరొకరు పాలు పోసుకునే మామూలు మనిషి . డబ్బున్న మిత్రుడి తండ్రి విలన్ కోట శ్రీనివాసరావు .

వెంకటేష్ ని మోసం చేసి అతని స్థలాన్ని కాజేసి నిరాశ్రయుడిని చేస్తాడు . స్నేహితుల మధ్య తగాదాలు పెడతాడు . స్థానిక ప్రజాప్రతినిధి కాస్ట్యూమ్స్ కృష్ణ సాయంతో , స్వయంకృషితో కోటీశ్వరుడు అవుతాడు వెంకటేష్ . మిత్రుడిని ఓడిస్తాడు .

క్లైమాక్సులో ఇద్దరూ జరిగిన పొరపాట్లను తెలుసుకుని కలిసి విలన్లను మట్టుబెట్టటంతో సినిమా ముగుస్తుంది . రవిరాజా పినిశెట్టి స్క్రీన్ ప్లేని చాలా బిర్రుగా తయారు చేసుకుని ఎక్కడా బోరించకుండా స్పీడ్ స్పీడుగా లాగించేసాడు .

ప్రధాన పాత్రల్లో వెంకటేష్ , సుమన్ , నగ్మా , రేఖ/ సుమతి , సుజాత , కోట శ్రీనివాసరావు , కెప్టెన్ రాజు , వినోద్ , శ్రీకాంత్ , సుధాకర్ , సారధి , కాస్ట్యూమ్స్ కృష్ణ , యువరాణి , ఆలీ తదితరులు నటించారు . ఒక ఐటమ్ సాంగులో నటించిన అర్చనా పూరన్ సింగ్ అదరగొట్టేసింది . మాల్గాడి శుభ పాడింది పాట .

కీరవాణి సంగీత దర్శకత్వంలో పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది . పాటలన్నీ వెంకటేష్ , నగ్మా , అర్చనల పైనే . కొండపల్లి రాజా గుండె చూడరా , గువ్వం గుడు గుడు గువ్వా , దానిమ్మ తోట లోకి చెప్పవే రూటు , ఏ కాశీ లోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాక , అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా వచ్చాడే అంటూ సాగుతాయి పాటలు .

వెంకటేష్ , అర్చనలపై సింగరాయ కొండ కాడా ఆడ దిబ్బ కాడ అంటూ సాగే నిషా పాట చిత్రీకరణ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే . వేటూరి , భువనచంద్ర పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , శుభ శ్రావ్యంగా పాడారు . పరుచూరి బ్రదర్స్ మాటలు పదునుగా ఉంటాయి .

కన్నడంలోకి కూడా రీమేక్ అయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . An excellent entertainer . చూసి ఉండకపోతే చూడండి . ఇప్పుడు కేర్ బంజారాగా ఉన్న హాస్పిటల్ ఒకప్పుడు భాస్కర పేలస్ అనే హోటల్ . అందులో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉండేది . ఆ హోటల్నే ఈ సినిమాలో హోటల్ గా చూపారు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !
  • Destiny – మెస్సీ ముద్దాడే ఈ పసికందు..! ఈ ఫైనల్స్‌లో తనకే ‘పోటీదారు’ !!
  • శిశువులకు బంగారు ఉంగరాలు – విజయ్ వైఖరిపై సందేహాలు !
  • పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నయ్ ! అసలు గేమ్ షురూ !!
  • ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ఏమాత్రం సరిపోదు… అంతకుమించి..!!
  • మరీ గోకకు పవన్ !! నువ్వు వేళ్లు పెడితే… రేవంత్ కాళ్లు పెడతాడు !!
  • ఒక భూమనకూ- ఒక నాయుడికీ …. ఒక జగన్‌కూ ఒక బాబుకూ తేడా ఏమున్నట్టు..?!
  • ఏడుపుగొట్టు ట్రోలర్లు… చివరకు జానకమ్మ మనమరాలినీ వదల్లేదు !!
  • వనపర్తి ఆటో భరత్‌కు బండి సంజయ్ మాత్రమే ఎందుకు గుర్తొచ్చాడు..?!
  • మినిమం పీహెచ్‌డీ చేసినా… ఈ మార్పులు అర్థం కావడం కల్ల !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions