Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అర్ధరాత్రి దాటింది… ఆ బస్టాపులో ఆమె ఒంటరిగా… ఏం జరిగింది..?

May 6, 2026 by M S R

.

అర్ధరాత్రి దాటింది… బస్టాండులో… ఓ మహిళ… ఒంటరిగా…! ఏమైనా సాయం కావాలా..? ఏమైనా సమస్యా..? ఇంత రాత్రి ఏం చేస్తున్నావు..? అని అడిగే మగాడు ఉంటాడా..? లేదు… ఉండడు… మరి ఎలాంటి మగాళ్లు కనిపిస్తారు..? సింపుల్… వస్తావా…? ఎంతివ్వాలి..? ఎటు వెళ్దాం… ఇవే ప్రశ్నలు మీదిమీదికొస్తూ..!

నిజమే కదా… అందరికీ తెలిసిందే కదా అంటారా..? అలా అర్ధరాత్రి దాటాక, అలా ఓ బస్టాపులో నిలబడి… ఫీల్డ్ సిట్యుయేషన్ ఏమిటో తెలుసుకోవాలని, అదుపు తప్పిన వాళ్లకు కాస్త కోటింగ్ ఇద్దామని అనుకున్నదెవరో తెలుసా..? ఇంకెవరు..? మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుమతి… అవును, విశ్వనగర తొలి లేడీ కమిషనర్ సుమతి…

Ads

ఆమే చేయగలదు ఇలాంటి సాహసం… 2001లో డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక… కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఇలాగే నిలబడింది ఆమె… ఆడది కనిపిస్తే అంగడి సరుకులాగే చూస్తాడు కదా మగాడు… అవే ప్రశ్నలు… ఎంత..? ఎక్కడికి..? వెళ్దామా..? సరే, వాళ్లను ఎలా డీల్ చేసిందనేది వేరే కథ… సరిగ్గా పాతికేళ్ల తరువాత… మళ్లీ అలాగే… ఈసారి దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్… అర్ధరాత్రి 12.30 తరువాత 3.30 గంటల దాకా…

ఇన్నేళ్ల కెరీర్‌లో… ప్రత్యేకించి ఎస్ఐబీ కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు చాలామందిని డీల్ చేసింది… ఇదెంత అంటారా..? అవును, స్వయంగా ఫీల్డ్ సిట్యుయేషన్ తెలుసుకుందామనే సాహసం, చొరవ… గ్రేట్… సేమ్ అప్పుడు కాజీపేటలోలాగే… ఈసారి గంజాయి మత్తుల్లో ఉన్నోళ్లు, పీకల్దాకా తాగినోళ్లు దాదాపు 40 మంది… అవే ప్రశ్నలు… మగాడు మారడు… మారలేదు… మరింత దిగజారి, మరింత ప్రమాదకరంగా…

sumathi ips

సరే, ఆమె ఆ 40 మందిని ఎలా పనిష్ చేసింది, ఎలా కౌన్సెలింగ్ ఇచ్చిందనేది మరో కథ… కానీ ఈరోజుకూ రాత్రిపూట ఆడది కనిపిస్తే… రక్షణ గాలిలోదీపం… ‘మనిషి మారలేదు, ఆతడి వాంఛ తీరలేదు’ అన్నట్టుగా… ఆమె అన్ని జాగ్రత్తలూ తీసుకుని పకడ్బందీగా వెళ్లి అలా నిలబడింది సరే… కానీ నిజంగానే ఏదో ఓ సమస్యతో ఓ సగటు మహిళ అలా నిలబడితే మగాళ్ల స్పందన ఏమిటి..? అదే ఈ కథ సారాంశం…

ఏదో ఓ మంచి పొజిషన్‌లోకి వచ్చాం కదానే ఓ సంతృప్తి స్థాయి పరిమితుల్లో తనను తాను బంధించుకోకుండా… సేమ్, కొలువు పట్ల మొదట్లో కనిపించిన అదే వర్క్ డెడికేషన్, వృత్తి పట్ల అదే గౌరవం ఇప్పటికీ చూపించే ఐపీఎస్ అధికారిణి సుమతికి అభినందనలు… (ఈ స్టోరీ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రజెంట్ చేసిన టీవీ9 కు కూడా…)

సుమతి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీజేపీ తమిళ తప్పుటడుగులు…! తత్వం తెలిసిందా మోటా భాయ్..?!
  • అప్పు చేయనివాడు గాడిద… ఇదొక అప్పానందలహరి…
  • అర్ధరాత్రి దాటింది… ఆ బస్టాపులో ఆమె ఒంటరిగా… ఏం జరిగింది..?
  • విజయ్ మెడలో కరుంగాలిమాల..! ఈ నమ్మకం, ఈ మాల విశిష్టత ఏంటంటే..?!
  • కొన్ని జిల్లాల్లో జీరో సీట్స్..! ప్రాంతీయమా..? ఉపప్రాంతీయ పార్టీలా..?!
  • ఇక పంజాబ్‌పై బీజేపీ కన్ను..! ‘ఆప్’ను మరింత తొక్కడమే టార్గెట్..!!
  • క్రిస్టియన్… దళిత్ కాదు… తన కులానికీ ఓ చరిత్ర… హైదరాబాద్‌కూ లింక్స్…
  • కొరడా పట్టుకో సీఎం సారూ… లేకపోతే నీ కళ్లకే గంతలు కడతారు…
  • మమత మట్టికరిచింది… ఆ దుర్గగుడి తలుపులు తెరుచుకున్నయ్…
  • ‘‘తిక్కలదిర ఈ అక్క… వేగలేము ఈ అక్కతో… ఆడలేము తైతక్క…’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions