Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రెండాకుల్లో ఒక ఆకు చీల్చిన షణ్ముగం ఎవరు..? ఏమిటీ నేపథ్యం..?!

May 12, 2026 by M S R

.

సివి షణ్ముగం… ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న పేరు ఇది… అన్నాడీఎంకే పార్టీని నిలువునా చీలుస్తున్న పెద్ద మనిషి… కరడుగట్టిన డీఎంకే వ్యతిరేకి ఈయన… 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏకంగా 30 మందితో వేరుకుంపటి పెడుతున్నాడు… పళనిస్వామి నాయకత్వంపై తిరుగబాటు… అంతేకాదు, టీవీకేకు సపోర్ట్ చేస్తామంటున్నాడు…

1) ఇదేదో డీఎంకే కూటమిలోని చిన్నాచితకా పార్టీలు గొంతెమ్మ కోరికలతో విజయ్ తలను వంచడానికి ముందే చేస్తే బాగుండేది… విజయ్ డీఎంకే చంకలో ఇరుక్కోకుండా అన్నాడీఎంకే తిరుగుబాటుదార్ల మద్దతుతో ఐదేళ్లూ స్థిర ప్రభుత్వం అందించేవాడు… (ఇప్పుడు లెఫ్ట్, వీసీకే, ఐయూఎంఎల్, కాంగ్రెస్ విజయ్‌తో ఎలా ఆడుకుంటాయో చూడబోతున్నాం)…

Ads

2) నిజానికి పళనిస్వామికి నాయకత్వ లక్షణాలు లేవు… ఇన్నేళ్లు ఆ పార్టీని అలా కాపాడటమే ఆశ్చర్యం… జయలలిత పోయాక అన్నాడీఎంకే మరీ దారుణంగా తయారైంది… పన్నీర్ సెల్వం స్టాలిన్ ఫోల్డ్‌లోకి వెళ్లిపోయాడు… చెప్పుకోదగిన నాయకులెవరూ లేరు, అంతా జయలలిత పెట్స్ కదా…

3) పళని తోక పట్టుకుని బీజేపీ తమిళ కావేరి ఈదుదామని అనుకుంది… అడ్డంగా బుక్కయింది… అన్నామలై ఎక్కడో కూర్చుని పకపకా నవ్వుతున్న సీన్ కనిపిస్తోంది… ఇప్పుడిక చీలికవర్గం మాకు ఎవరితోనూ పొత్తు లేదు అంటున్నాడు… అంటే బీజేపీ లేదు, ఎవరూ లేరుపో అన్నట్టు…

డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు నచ్చకే మేం తిరుగుబాటు పంథాలో పోతున్నాం అంటున్న షణ్ముగం వర్గం… పళనిస్వామి ఆలోచనలకు భిన్నంగా వేరే విప్‌ను ఎన్నుకున్నాడు… అంతుపట్టని వ్యవహారం ఏమిటయ్యా అంటే… విజయ్ కోరకపోయినా మద్దతు ఇస్తామని దేబిరించడం ఏమిటో..?

మొత్తానికి తమిళ రాజకీయాల్లో అడ్డదిడ్డం వ్యూహాలతో పరువు పోగొట్టుకున్న బీజేపీ ఇక ప్రస్తుతానికి సైలెంట్… గవర్నర్ ధోరణితో కూడా బీజేపీ బదనాం అయిపోయింది… అసలు ఇంతకీ ఎవరు ఈ షణ్ముగం..?

ఉత్తర తమిళనాడులో అన్నాడీఎంకెేకు బలమైన నాయకుడు… శక్తివంతమైన వన్నియార్ కులం… రాజకీయ కుటుంబమే… తండ్రి సి.వేణుగోపాల్ మాజీ ఎంపీ, అన్నాడీఎంకేలో పవర్‌ఫుల్ లీడర్… షణ్ముగం వృత్తిరీత్యా లాయర్…

తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చాక నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక… జయలలిత, పళనిస్వామి కేబినెట్లలో మంత్రి… 2022 నుంచి రాజ్యసభ ఎంపీ… మొన్న మళ్లీ ఎన్నికయ్యాడు అసెంబ్లీకి… సి. వి. షణ్ముగం ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి … కానీ దుందుడుకు పోకడ కూడా…


షణ్ముగం అనగానే గుర్తొచ్చే ఎపిసోడ్ ఒకటి చెప్పుకోవాలి… డీఎంకే ప్రభుత్వ ‘ఉంగళ్ కనవు సొల్లుంగ’ (మీ కలలు చెప్పండి) అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది ఆమధ్య… దాన్ని విమర్శించేందుకు విల్లుపురం నిరసన ప్రదర్శకు వచ్చాక, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్ని కలలను నెరవేరుస్తారా అని ప్రశ్నించాడు…

“నాకు నయనతార కలలో వస్తోంది, ఆమెను పెళ్లి చేసుకోవాలనే నా కలను నెరవేరుస్తారా?” అని అడిగాడు… ఈ వ్యాఖ్యకు వేదికపై ఉన్న కొందరు నవ్వగా, కార్యకర్తలలో ఒక వర్గం చప్పట్లు కొట్టింది… కానీ, వెంటనే ఏఐఏడీఎంకే మిత్రపక్షమైన బీజేపీతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది… నడిగర్ సంఘం కూడా ఈ చిల్లర వ్యాఖ్యల్ని ఖండించింది… అదీ షణ్ముగం అంటే..!!



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ హిందూ క్లిప్పింగ్ ఫేక్ అట..! ఇందిరాగాంధీ ఆ మాటే అనలేదట..!!
  • రెండాకుల్లో ఒక ఆకు చీల్చిన షణ్ముగం ఎవరు..? ఏమిటీ నేపథ్యం..?!
  • ఈ టీవీ ద్రౌపది వెన్నుచూపలేదు…! నిలిచింది – గెలిచింది…!
  • పాలమూరు, పోలవరంతో రేవంత్ లింకులు… ‘చంద్రబాబు’ ఉక్కిరిబిక్కిరి…
  • ఆటగాళ్లపై వలపువల..? సోషల్ పోస్టులపైనా కొత్త ఆంక్షలు..!!
  • బ్రాండెడ్ బతుకు కావాలి… భారీ భరణం ఇప్పించండి యువరానర్…
  • ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి… అనుకున్నా ఏదో నవ్వని…
  • తనికెళ్ల భరణి ‘ఆరాధన’ వెనుక అసలు మానసిక కారణం ఏమిటి..?!
  • సీఎం విజయ్ భార్య సంగీత గైర్హాజరు… సరైన నైతిక నిర్ణయం…
  • దేవుడి దగ్గర కూడా రాజస పోకడలే..! సుధారెడ్డి ఆడంబర ప్రదర్శన..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions