.
Mani Bhushan…. ప్రపంచంలో యూదులు, భారత దేశంలో గుజరాతీలు, మార్వాడీలు; తెలుగునాట కమ్మవారు, నెల్లూరు రెడ్లు… డబ్బు విషయంలో ఒకేలా ఆలోచిస్తారు.
సంపద- సద్వినియోగం- వృద్ధి అంశాల్లో వాళ్లకున్న అవగాహన, అంచనా, planning, money management అతి తక్కువమందిలో చూస్తాం.
నెలకొక గ్రాము బంగారం కొని పక్కన పడేసి, ఏడాదిలో తులంగా మార్చే తెలివితేటలు అందరికీ ఉండవ్! వాళ్లది “బిందువుతో బిందువు కలిసి సింధువగును (బూంద్ బూంద్ సే బన్ తా సాగర్)” పద్ధతి.
Ads
ప్రధాని మోడీ ‘బంగారం కొనొద్దు, దుబారా జోలికి వెళ్లొద్దు, నూనె వాడకం తగ్గించండి, ఫ్యూయల్ నియంత్రణ అవసరం, ఆడంబరాలు వద్దు’ అన్నారు. అవే కదా అన్నది. అంటే తప్పేముంది!
రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఆక్షేపణలు, విమర్శలు వస్తున్నాయి. వాటిలో మరీ సిల్లీగా “ప్రధానికి 50 కార్ల కాన్వాయి ఎందుకు? ఫ్లైట్లలో తిరగడమెందుకు? అంబానీ కోడలు, కృష్ణారెడ్డి భార్య Met Galaలో కోట్ల రూపాయల నగలతో తిరగాలా!” వంటివి.
ప్రధాని పదవికి కల్పించే భద్రత, వ్యాపారవేత్తలు ప్రదర్శించే హంగు ఆర్భాటాలు… పరోక్షంగా దేశానికి branding ఇస్తాయి. వాళ్లు national brand ambassador లు. Investment కి, imagery కి అవసరం. నువ్వు-నేను ఎన్ని చెప్పినా ఇంట్లోనే పట్టించుకోరు. ఎవడూ రూపాయి పెట్టుబడి పెట్టడు.
గమ్మత్తేమిటంటే… రసాయన రహిత ప్రకృతి సేద్యం పెరగాలని, థర్మల్ విద్యుత్ తగ్గించకపోతే వాయు కాలుష్యం పెరుగుద్దని, నూనె తగ్గించకపోతే cholesterol, heart blockage ప్రమాదం ఉందని తెగ హెచ్చరించే పర్యావరణ మిత్రులు కూడా PM Modi మాటల్లో తప్పులు వెదుకుతున్నారు. (యుద్ద ప్రమాదంలో మన విదేశీమారక ద్రవ్య నిల్వల మీద తీవ్ర ఒత్తిడి కూడా ఉంది)
ప్రధాని మోడీ చెప్పినవి నిత్యం మధ్యతరగతి ఇళ్లలో వినబడేవే! వాటిలో కొన్ని…
– బైక్ మీద బలాదూర్ తిరక్కు. ఎక్కడలేని డబ్బులు పెట్రోలుకే పోతున్నాయి.
– ఇంట్లో వండితే బయట అడ్డమైన తిండి తినేసి వంటికి తెచ్చుకోకు. సరైన నూనెలు వాడరు.
– Hi-breed తీసేస్తే బాగుణ్ణు. బతుకు “న ఘర్ కా, న ఘాట్ కా” అన్నట్టయింది.
– సోలార్ పవర్ పెట్టించుకుందాం. మనక్కావల్సింది వాడుకుని కరెంట్ అమ్ముకోవచ్చు కూడా.
– ఇక, మధ్యతరగతి ఆడంబరాలు అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫరు, కేటరింగు, హాలు+ డెకరేషన్, పెట్టిపోతలు, రిటర్న్ గిఫ్టులు, సంగీత్ మెహందీలు, ఒక్క రోజు వేషానికి మూతిమీసం గొరిగించుకున్నట్లు designer dressలు… అంటే నిశ్చితార్థం మొదలుకుని పెళ్లి వరకు కనీసం రూ. 30- 35 లక్షల ఖర్చు.
– ఈమధ్య birthdayలు, wedding dayలు జోరందుకున్నాయి.
వేడుకలు చేసుకోవాల్సిందే. ఆడంబరాలు తగ్గించుకోవలసిందే. మోడీ చెప్పినా మూలనున్న ముసలమ్మ చెప్పినా విషయం అదే!
అన్నీ negetive aspectలో చూడాలనుకోకండి. positive thinking పెంచుకోండి.
——-
Ps : నాకు Tagఆకులు కట్టాలని చూడకండి.
Share this Article