.
అసలే క్రికెట్, అందులోనూ టీ20… అందులోనూ ఐపీఎల్ అంటే ఏదైనా జరగొచ్చు… ఎప్పుడూ ఒక జట్టు ఒకే రీతిలో ఆడాలని ఏమీ లేదు… హఠాత్తుగా ఒక జట్టు పుంజుకోవచ్చు, ఒక జట్టు అకస్మాత్తుగా డీలాపడిపోవచ్చు… ఐతే అసాధారణత్వం (abnormality) సందేహాలను లేవనెత్తుతుంది… అసలే ఫిక్సింగులు, బెట్టింగుల ప్రపంచం ఇది…
ఇదెందుకు చెప్పుకోవడం అంటే..? రాత్రి హైదరాబాద్ జట్టు గుజరాత్ జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది… గుజరాత్ కేవలం 168 రన్స్ చేసింది… ఇప్పుడు ఇది తక్కువ స్కోరే… కానీ తరువాత బ్యాటింగు చేసిన మరీ 86 పరుగులకే ఔట్ అయిపోయింది… హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్, కమిన్స్ వంటి మంచి బ్యాటింగ్ లైనప్ ఉండీ, మరీ అంత తక్కువ స్కోర్‌కు ఎలా ఔటయ్యారు..? (ఇంతకన్నా తక్కువకు ఔటయిన ఉదాహరణలు ఉండవచ్చుగాక)…
Ads
కానీ ఇది నిజమైన ఓటమేనా..? నిజానికి హైదరాబాద్ జట్టు మొదట్లో పేలవంగా ఆడినా, తరువాత బాగా పుంజుకుంది కూడా… మ్యాచులు చూస్తున్నప్పుడు ఏదో ఫిక్సింగ్ యవ్వారం ఉన్నట్టుగా ఏమీ అనిపించలేదు… హఠాత్తుగా మంచి బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం కూడా యాదృచ్ఛికమే కావచ్చు, ముంబై ఇండియన్స్ నిర్వాకం చూశాం కదా…
కానీ..? వరుసగా ఆరు మ్యాచులు గెలిచిన పంజాబ్ జట్టు శ్రేయాస్ నేతృత్వంలో దూసుకుపోతోంది… కానీ హఠాత్తుగా వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయింది… ఇదీ అసాధారణమే అనిపిస్తోంది… మొదట్లో పడుతూ లేస్తూ వచ్చిన గుజరాత్ కూడా ఇప్పుడు వరుసగా అయిదు మ్యాచులు గెలిచింది… ఇదుగో ఇందుకే హైదరాబాద్, పంజాబ్ ఫ్యాన్స్‌లో ఏవో సందేహాలు మొదలవుతున్నాయి…

మొదట్లో బాగానే ఆడిన రాజస్థాన్ రాయల్స్ కూడా హఠాత్తుగా పరాజయాల బాట పట్టింది… మొదట్లో పేలవంగా ఆడి, అందరికన్నా ముందే ప్లేఆఫ్ బరి నుంచి పోయినట్టే అనుకుంటున్న చెన్నై జట్టు అనుకోకుండా పుంజుకుంది… టేబుల్‌లో 5వ స్థానం చేరింది… హేమిటో…
ప్రస్తుతం గుజరాత్ 16 పాయింట్లతో పాయింట్ల టేబుల్ టాప్ వన్ ప్లేసులోకి చేరింది… ప్లేఆఫ్‌కు చేరినట్టే… బెంగుళూరుకు, పంజాబ్‌కు మూడు, హైదరాబాద్‌కు రెండు మ్యాచులున్నాయి… బహుశా కంఫర్ట్‌గానే టాప్ 4 ప్లేసుల్లో ఉంటారేమో… ఏమో, చెప్పలేం… అంతా మాయ… ఏమైనా జరగొచ్చు..!!
అన్నట్టు… ఐపీఎల్ ఫైనల్ వేదిక బెంగుళూరు నుంచి అహ్మదాబాద్‌కు మారడం దేనికి సంకేతం..?
Share this Article