Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!

May 14, 2026 by M S R

.

నిదా ఖాన్ గుర్తుంది కదా… ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుని, ఓ ముఠా తయారు చేసి, టీసీఎస్‌లో మతమార్పిళ్లకు ప్రయత్నించిన కేరక్టర్… తన అరెస్టుకు సంబంధించిన ఫాలో అప్ ఈ కథనం… అధికారం ఉంది కదాని చట్టాన్ని చుట్టచుట్టాలని చూస్తే ఏమవుతుందో మహారాష్ట్రలో ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్‌కు అర్థమైంది…

టీసీఎస్ కార్యాలయంలో సంచలనం సృష్టించిన నిదా ఖాన్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడమే కాదు, అక్రమ కట్టడాల కూల్చివేత వరకు వెళ్లింది… నేరస్తులకు ఆశ్రయం కల్పించిన ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చెప్పడానికి ఈ ‘బుల్డోజర్’ చర్య ఒక ఉదాహరణగా నిలిచింది…

Ads

ఆశ్రయం ఇస్తే.. అడ్రస్ గల్లంతే!

పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నిదా ఖాన్‌ను తన ఇంట్లో దాచిపెట్టడం మతీన్ పటేల్ చేసిన మొదటి తప్పు… సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేసి ఆమెను పట్టుకోవడమే కాకుండా, అసలు ఈ కార్పొరేటర్ గారి ఆస్తుల జాతకం ఏంటో తీయాలని మున్సిపల్ అధికారులను రంగంలోకి దింపారు… ఇంకేముంది… దర్యాప్తులో మతీన్ పటేల్ నివాసం, కార్యాలయం రెండూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు తేలింది…

కోర్టు నో.. బుల్డోజర్ ఎస్!

మున్సిపల్ అధికారులు మే 9న నోటీసులు ఇవ్వగానే, మతీన్ పటేల్ అలవాటు ప్రకారం కోర్టుకు వెళ్లి ‘స్టే’ తెచ్చుకోవాలని చూశాడు… కానీ, 72 గంటల గడువు ముగిసినా, న్యాయస్థానం నుండి ఎలాంటి ఊరట లభించలేదు… కోర్టు పిల్ (PIL) ను తిరస్కరించడంతో అధికారులు ఇక వెనక్కి తగ్గలేదు… భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు గర్జించాయి… గంటల వ్యవధిలోనే కార్పొరేటర్ గారి అక్రమ సామ్రాజ్యం నేలమట్టమైంది…

ముఖ్యమంత్రి సీరియస్.. సీటుకు ఎసరు!

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ చాలా కఠినంగా ఉంది… కేవలం ఇల్లు కూల్చివేతతోనే ఈ కథ ముగిసిపోదు… ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు దాచడం, నేరస్తులకు సహకరించడం వంటి అంశాలను సీరియస్‌గా తీసుకున్న ఔరంగాబాద్ మేయర్ సమీర్ రాజూర్కర్… మతీన్ పటేల్ కార్పొరేటర్ పదవిని రద్దు చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టాడు…

మరోవైపు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ఇది ‘రాజకీయ కక్ష’ అని గగ్గోలు పెడుతున్నా, “చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది… ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ, నేరస్తులకు రక్షణ కవచంలా మారకూడదు… ఒకవేళ మారితే, వారి పదవితో పాటు పరువు, ఆస్తి కూడా గాలిలో కలిసిపోతాయనేది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?
  • భారీ మలుపు తిరిగిన ‘అదృశ్య సరస్వతి’… త్రివేణీ సంగమం…!!
  • What is Real Success..? నిజమైన సక్సెస్ స్టోరీ అంటే ఏమిటి..?
  • పాకిస్థాన్‌కు సింధుగండం… ఇండియా జలాల మళ్లింపు షురూ…
  • ఆలీకి ఆది నుంచీ అలవాటే… పిచ్చి కూతలు, ఇప్పుడు తిక్క యాడ్స్…
  • వద్దూవద్దన్నా మద్దతు..! జోసెఫ్ విజయ్ కథే మారిపోయిందిగా..!!
  • చక్రపాణి – నాగిరెడ్డి… బాపు – రమణ… సేమ్ మామ – అప్పు..!
  • బుట్ట నిండా ఇడ్లీలు… రైల్వే స్టేషన్‌లో ఓ పెద్దాయన… ధర కేవలం రూపాయి…
  • మమత తేరుకుంటే… మళ్లీ ఈ దేశభద్రతకే ప్రమాదం… ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions