Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్ని బిల్లులకూ ఒకే ప్లాట్‌ఫామ్… తెలంగాణ సర్కారు ఇంట్రస్టింగ్ కసరత్తు…

May 15, 2026 by M S R

.

అడ్మినిస్ట్రేషన్… రాజకీయాలు వేరు- పరిపాలన వేరు… జనం సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటారు… టెక్నాలజీ పెరుగుతోంది… పౌర సదుపాయాలను టెక్నాలజీతో లింక్ చేయడమే కాదు, నాణ్యత పెంచడం కూడా పరిపాలన సామర్థ్యాన్ని సూచిస్తుంది… అదేసమయంలో ప్రజల్లో కూడా బాధ్యతను పెంచడం, సర్కారీ సేవలకు తగిన రుసుం చెల్లించడం కూడా ఓ అధ్యాయం…

ఇదెందుకు చెప్పుకోవడం అంటే…? సంక్షేమ పథకాలు, ఫ్రీబీస్‌తో ఖజానా మీద భారం వేయడం వేరు… అదే సమయంలో ప్రజలను కూడా జవాబుదారీ చట్రంలోకి తీసుకురావడం కూడా ప్రధానమే… ఇదెందుకు చెప్పుకోవడం అంటే..?

Ads

తెలంగాణ ప్రభుత్వం ఓ విశేష కసరత్తు చేస్తోంది… పర్టిక్యులర్‌గా హైదరాబాద్ కార్పొరేషన్ (అఫ్‌కోర్స్, మూడు కార్పొరేషన్లు) అదేమిటంటే..? పవర్ బిల్లు, వాటర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర అన్ని రకాల ప్రభుత్వ పన్నులు, ఛార్జీలను వసూలు చేసేందుకు ఓ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయడం… ప్లస్ ట్రాఫిక్ చలాన్లు కూడా…

పవర్ బిల్లు కడతా, లేకపోతే కట్ చేస్తారు, వాటర్ బిల్లు చూద్దాంలే, చలానా తరువాత కట్టొచ్చులే అనే సీన్ ఉండదు ఇక… అంతేకాదు, వాటర్ బిల్లుతోపాటు ఇన్నాళ్లూ సీవరేజ్ బిల్లును పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం… వాటర్ బిల్లులో 30 పర్సెంట్ వసూలు… అదే ముఖ్యం…

వాటర్ పేదలకు జీరో బిల్లు (రీసెంటుగా మూడు కార్పొరేషన్లలో కలిసిన శివారు మున్సిపాలిటీల్లో అదీ లేనట్టుంది…) కానీ కమర్షియల్, కార్పొరేట్, డొమెస్టిక్… వేర్వేరుగా టారిఫ్ వసూలు చేయాలి నిజానికి.., (పవర్ డిస్కమ్‌లాగా వాటర్ బోర్డును ఓ కంపెనీలాగా చేస్తే చాలా బెటర్… అవసరమున్నంత వాటర్ సప్లయ్ చేసేందుకు వీలుగా… అఫ్‌కోర్స్, సేమ్ పవర్ సప్లయ్‌లాగా…)

నిజంగానే వాటర్ బోర్డును కంపెనీలాగా చేయడమే కాదు… అన్ని కోణాలు, ప్రభుత్వం, కస్టమర్ కోణం నుంచి ఆలోచించి, నిర్ణయాలు ప్రకటించే రెగ్యులేటరీ కమిషన్ అవసరం… (పవర్ రెగ్యులేటరీ కమిషన్ ఫ్లాప్ అంటారా, ప్రజాకోణం లేదు అంటారా, అది వేరే సంగతి)… వాటర్‌ బిల్లుతో కలిపేయకుండా సీవరేజ్ ఛార్జీలు వేరు ఉండబోతున్నాయి…

అంతేకాదు, ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప… ఇక పీనల్ ఇంట్రస్టు మినహాయింపులు, వన్ టైమ్ సెటిల్మెంట్లు ఉండకపోవచ్చు కూడా…

నగర జీవికి… విశ్వనగర జీవి కావాలనుకునే కస్టమర్‌కు కావల్సింది ప్రధానంగా…. నీరు, పవర్, పారిశుధ్యం, రవాణా, భద్రత ఎట్సెట్రా… కనీస పౌర సౌకర్యాలు…!! ఎలాగూ కాలుష్య కారక పరిశ్రమల్ని మొత్తం బయటికి పంపించేస్తున్నారు హిల్ట్-పి పేరిట… ప్యూర్ స్ట్రాటజీ… సుంకిశాల, మల్లన్నసాగర్ నుంచి లింకేజీ, కృష్ణా పైపు లైన్‌తో అనుసంధానం, హిమాయత్‌సాగర్, గండిపేటలతో గోదావరి లింకేజీ తదితర పనులు పూర్తయితే ఒకటీ ఒకటిన్నర ఏళ్లలో ప్రతిరోజూ లేదా రోజువిడిచిరోజు నీళ్లిచ్చే స్థితికి చేరుకుంటుంది హైదరాబాద్…

ఒకవేళ ఈ ప్రభుత్వ సర్వీసు ఛార్జీల ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్ గనుక హైదరాబాదులో ఫ్లాలెస్‌గా సక్సెసయితే… అది వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ఇతర ప్రధాన నగరాలకూ విస్తరించొచ్చు… ఇంకా ఏమైనా ఫాయిదా ఉందా..? ఉంది…

గతంలో కేసీయార్ పిరియడ్‌లో ఇల్లు రిజిస్ట్రేషన్ జరగ్గానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగే సదుపాయం తీసుకొచ్చారు… దళారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు… సేమ్ అలాగే… కరెంటు కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు కూడా ఆటోమేటిక్‌గా రాబోయే రోజుల్లో మారిపోయేలా కసరత్తు చేస్తున్నారు… గుడ్, దళారులు, అధిక వ్యయం తప్పుతుంది…

పౌర సౌకర్యాలకు సంబంధించి… నాణ్యత ప్రధానం… ఈ ఛార్జీలన్నీ ఇంటిగ్రేట్ చేసి, ఓ కామన్ యూజర్ నంబర్ ఇచ్చి, కంబైన్డ్ వసూళ్లు గనుక జరిగితే గ్రేటే… సరే, ఈ దిశలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది… మంచీచెడూ ఉంటాయి… మెల్లిమెల్లిగా లోపాల్లేని సమీకృత ప్రభుత్వ చార్జీల ప్లాట్‌ఫామ్ అనేది మాత్రం ఓ ఇంట్రస్టింగ్, ఓ ఇంపార్టెంట్ కసరత్తే..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసు విచారణలో మరో పెద్ద మలుపు..!!
  • అన్ని బిల్లులకూ ఒకే ప్లాట్‌ఫామ్… తెలంగాణ సర్కారు ఇంట్రస్టింగ్ కసరత్తు…
  • రహస్య స్వర్ణ రాజ భవనం… ఆదానీ, అంబానీ కళ్లు కుట్టేలా…
  • అయ్యో సర్పంచ్ సాబ్..! ప్రీతి జింటాను దెబ్బతీసిన నీతా అంబానీ..!!
  • sugarexportban… ముందు మా దేశ ప్రజలు…. తర్వాతే ప్రపంచ మార్కెట్…
  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions