.
‘లవ్ ఓ లవ్’ మూవీ రివ్యూ: నవ్వులు పూయించే ప్రేమ పాఠం!
కథాంశం…: ప్రేమలో అబ్బాయిలు పడే కష్టాలు, అమ్మాయిల డిమాండ్ల వల్ల వారు ఎదుర్కొనే ఆర్థిక, మానసిక ఇబ్బందుల చుట్టూ తిరిగే కథే ‘లవ్ ఓ లవ్’. తన ప్రేయసి అవంతిక (నాగదుర్గ) వల్ల సర్వస్వం కోల్పోయిన రఘు (పవిష్ నారాయణ్), ఆమెకు బుద్ధి చెప్పడానికి ఆమె ముందు ఉంచిన ఒక వింత కండిషన్ ఏమిటి? ఆ కండిషన్ తర్వాత వారిద్దరి జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? అన్నదే ఈ సినిమా కథ.
నటీనటుల పనితీరు
పవిష్ నారాయణ్…: ధనుష్ మేనల్లుడిగా తన రెండో సినిమాతోనే మంచి నటనను కనబరిచాడు. ప్రేమలో విసిగిపోయిన అబ్బాయిగా, బాధపడే పాత్రలో పవిష్ సహజంగా నటించి మెప్పించాడు.
Ads

నాగదుర్గ…: తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన మన నాగదుర్గ, ఈ సినిమాతో హీరోయిన్‌గా మంచి ఎంట్రీ ఇచ్చింది. తన క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ, చివర్లో ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా నటించింది.
ఇతర పాత్రలు…: వనిత విజయ్ కుమార్, సెల్వ రాఘవన్, కె.ఎస్. రవికుమార్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా వీరి కామెడీ టైమింగ్ సినిమాకి ప్లస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్
కాన్సెప్ట్…: రియల్ లైఫ్‌లో అబ్బాయిలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను (క్రెడిట్ కార్డ్ బిల్లులు, షాపింగ్, అనవసరమైన ఖర్చులు) దర్శకుడు చాలా ఫన్నీగా చూపించారు.
ఫస్ట్ హాఫ్…: కామెడీ ట్రాక్ అదిరిపోయింది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి సీన్ నవ్వులు పూయిస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్…: హీరో హీరోయిన్‌కు పెట్టిన కండిషన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.
స్క్రీన్‌ప్లే & ఎడిటింగ్…: కథను నడిపించిన తీరు, ఎడిటింగ్ చాలా పద్ధతిగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్
క్లైమాక్స్…: సినిమా అంతా అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో రియలిస్టిక్‌గా నడిపించి, చివరిలో బలవంతంగా ఎమోషనల్ డ్రామాను జోడించడం కొంచెం అసహజంగా అనిపిస్తుంది. ముగింపు మరింత బలంగా ఉండాల్సింది.
డబ్బింగ్…: తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల సహజంగా లేదు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోవు.
సాధారణ పాయింట్..: ఇలాంటి కథలు గతంలో కొన్ని సినిమాల్లో చూసినట్లు అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం…: దర్శకుడు మగేష్ రాజేంద్రన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేసిన విధానం అభినందనీయం. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
చివరగా…. ‘లవ్ ఓ లవ్’ ప్రేమలో ఉన్న అబ్బాయిలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లోని కామెడీ, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి. క్లైమాక్స్ విషయంలో రాజీ పడకుండా ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఏదేమైనా, వీకెండ్ లో సరదాగా నవ్వుకోవడానికి, మీ లవర్ తో కలిసి చూడదగ్గ సినిమా ఇది… లవర్ లేదా..? సారీ!!
Share this Article