.
Pardha Saradhi Upadrasta …. “ముందు మా దేశ ప్రజలు, తర్వాతే ప్రపంచ మార్కెట్” — భారత్ చక్కెర ఎగుమతులపై భారీ నిర్ణయం
భారత్ అధికారికంగా చక్కెర ఎగుమతులను నిషేధించింది.
DGFT (Directorate General of Foreign Trade) తాజా ఉత్తర్వుల ప్రకారం రా షుగర్, వైట్ షుగర్, రిఫైన్డ్ షుగర్ ఎగుమతుల స్థితిని “Restricted” నుంచి నేరుగా “Prohibited” గా మార్చింది.
ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుంది.
ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రపంచ మార్కెట్లలో ప్రభావం కనిపించింది.
📈 న్యూయార్క్ రా షుగర్ ఫ్యూచర్స్ 2% పెరిగాయి
📈 లండన్ వైట్ షుగర్ ధరలు 3% ఎగిశాయి
భారత్ ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది?
దేశీయ చక్కెర ధరలను నియంత్రించడానికి…
దేశంలో నిల్వలను కాపాడుకోవడానికి.., ఎల్-నినో కారణంగా చెరకు ఉత్పత్తి తగ్గే భయంతో వెస్ట్ ఏషియా యుద్ధ ప్రభావంతో పెరిగిన ఇంధన & రవాణా ఖర్చుల కారణంగా, ఎథనాల్ మిశ్రమ విధానానికి చెరకు ఎక్కువగా మళ్లిపోవడం వల్ల…
ప్రస్తుతం 2025-26 సీజన్‌లో భారతదేశ చక్కెర నిల్వలు కేవలం 45 లక్షల టన్నులకు పడిపోవచ్చని అంచనా. ఇది 2016-17 తర్వాత అత్యల్ప స్థాయి.
Ads
అసలు ప్రమాదం ఇక్కడే ఉంది…
ఇరాన్ యుద్ధం ➜ ఇంధన సంక్షోభం
ఇంధన సంక్షోభం ➜ ఎరువుల ధరల పెరుగుదల
ఎరువుల ఖర్చులు ➜ ఆహార ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల
ఆహార ఉత్పత్తి ఖర్చులు ➜ ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల
ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచ ఆహార ధరలు వరుసగా మూడు నెలలుగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు దేశాలు ఒక్కొక్కటిగా ఎగుమతులు ఆపడం, నిల్వలు పెంచుకోవడ, దేశీయ మార్కెట్‌ను కాపాడుకోవడం మొదలుపెడుతున్నాయి.
భారత్ చక్కెరతో ప్రారంభించింది.
రేపు బియ్యం, గోధుమలు, వంటనూనెలపై కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటే హెచ్చరిక, మా feda ప్రయోజనాలు కాపాడుకున్నాకనే మిగిలితే ఎగుమతి చేస్తాం.
అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి….
• అమెరికా & యూరోపియన్ యూనియన్‌కు ఉన్న ప్రత్యేక కోటా ఎగుమతులు కొనసాగుతాయి.
• ఇతర దేశాల ఆహార భద్రత కోసం ప్రత్యేక అభ్యర్థనలు వస్తే అనుమతులు ఇవ్వవచ్చు.
• ఇప్పటికే పోర్టులకు చేరిన సరుకులకు మినహాయింపు ఉంటుంది.
ఇది కేవలం చక్కెర విషయం కాదు…
ప్రపంచ సప్లయ్ చెయిన్ ఎంత సున్నితంగా ఉందో చెప్పే పెద్ద సంకేతం…
(Source: Reuters, DGFT Notifications) — ఉపద్రష్ట పార్ధసారధి
#India #SugarExportBan #FoodCrisis #GlobalEconomy #Inflation #FoodSecurity #ElNino #IranWar #WorldNews #PardhaTalks
Share this Article