.
తాటకి మమత పాలనలో టీఎంసీ నాయకులు అనేక అక్రమాలతో అడ్డగోలు సంపాదించారు… అది అందరికీ తెలిసిందే… మరీ ఓ నాయకుడి సంపాదన, అట్టహాసం, ఆడంబరం చూస్తే… అంబానీకి, ఆదానీకి కూడా అంత విలాసం చేతకాలేదేమో అనిపిస్తుంది… (గతంలో గాలి జనార్ధనరెడ్డి యవ్వారం చదివాం)… వరదలా వచ్చిపడుతున్న సొమ్ము, ఎలా ఖర్చు చేయాలో తెలియక ఇంటినే స్వర్ణమయం చేసుకున్నాడు… అదీ ఎవరికీ బయటికి కనిపించకుండా… రహస్య స్వర్ణ రాజ భవనం… ఆ వార్త ఏమిటంటే..?
బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో ‘రహస్య రాజభవనం’!.. ట్రాప్ డోర్ తెరిచిన పోలీసులకు షాక్! … పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది… ఎన్నికల అనంతర హింస కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ “బారే” ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించగా, బయటపడిన దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి…
Ads
సాధారణంగా బయటికి కనిపించే ఇంటి కింద… ఒక రహస్య ప్రవేశ ద్వారం (Trap Door) ద్వారా వెళ్లేలా ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన బేస్‌మెంట్‌ను పోలీసులు గుర్తించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది… ఆ రహస్య గదిలో కనిపించిన ఫర్నిచర్, అలంకరణలు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయినట్లు సమాచారం…
బంగారు రంగు చెక్కిన మంచాలు, ఖరీదైన సోఫాలు, రాజభవనాలను తలపించే ఇంటీరియర్, విలాసవంతమైన డెకరేషన్… ఇవన్నీ చూసి “ఇది నిజంగా ఓ రాజకీయ నాయకుడి ఇల్లేనా?” అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది… వైరల్ అవుతున్న ఫోటోల్లో గోల్డ్ ఫినిష్ ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది… ఆ ఫర్నీచర్‌కు బంగారు తాపడమా అని దర్యాప్తు చేస్తున్నారు…
ఈ వ్యవహారంలో మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే… పోలీసులు గుర్తించిన ఆ రహస్య నిర్మాణం బయటివారికి అసలు కనిపించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు… ఇంటి లోపలే దాచిన ప్రవేశద్వారం ద్వారా మాత్రమే లోపలికి వెళ్లేలా ఏర్పాటు ఉన్నట్లు వార్తలు వచ్చాయి…
ఇప్పటికే ఎన్నికల అనంతర హింస, బాంబు దాడులు, ఆయుధాల కేసుల్లో షమీమ్ అహ్మద్ పేరు వినిపిస్తుండగా… ఇప్పుడు ఈ “లగ్జరీ బేస్‌మెంట్” వ్యవహారం మరో కొత్త రాజకీయ దుమారానికి దారి తీసింది… ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం…
అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు “కిలోల బంగారం స్వాధీనం”, “పూర్తిగా బంగారంతో చేసిన ఫర్నిచర్” వంటి అంశాలను పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు… కానీ బయటపడిన విలాసవంతమైన జీవనశైలి మాత్రం తీవ్ర చర్చకు కారణమవుతోంది…
ఒకవైపు సాధారణ ప్రజలు ధరల భారంతో ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు ప్రాంతీయ స్థాయి నాయకుల ఇళ్లలో బయటపడుతున్న ఈ విలాసవంతమైన ప్రపంచం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది… మమత హయాంలో కొందరు టీఎంసీ నేతలు ఎలా బలిసిపోయారో అర్థమవుతోంది కదా..!!
Share this Article