.
కొన్ని చిత్రమైన సర్వేలు జరుగుతాయి… పేరున్న సర్వే ఏజెన్సీలు కాబట్టి వాళ్ల సర్వే అంశాల్లో మస్తు ప్రామాణికత, శాస్త్రీయత ఉంటాయనుకోవడం పెద్ద భ్రమ… ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది… పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనీ, తద్వారా క్రూడ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చుననీ, ఈమేరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందనీ ప్రభుత్వ భావన…
అంతేకాదు, రైతులకూ ఇది ఉపయోగకరం అనే వాదన… స్థూలంగా చూస్తే పైకి బాగానే కనిపిస్తుంది కానీ… మైలేజీ తగ్గుతుందని ప్రభుత్వమే అంగీకరిస్తోంది… మరోవైపు వాహనాల ఇంజన్లు సత్రోల్ అయిపోతాయనే ఆందోళన వాహనదారుల్లో ఉంది… పలుచోట్ల మెకానిక్కులు కూడా అదే చెబుతున్నారు… సో, ఈ20 పెట్రోల్ వినియోగంపై జనం ఏమనుకుంటున్నారనే సర్వే సందర్భసహితమే… కానీ..?
Ads
సీ-ఓటర్ సంస్థ సర్వేలో మరో ప్రధానాంశం ఏమిటంటే..? సర్వేలో మీరు ఏ పార్టీ వోటరు అని ప్రశ్నించడం! ముందుగా ఈ వార్త చదవండి…

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం విస్తృతంగా ప్రోత్సహిస్తున్నప్పుటికీ, ప్రజల్లో అనుమానాలు పోవట్లేదు! ఆ పెట్రోల్ వాడడం వల్ల తమ వాహనాలు పాడైపోతాయని చాలా మంది విశ్వసిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్ని కల్లో ఎన్డీయే కూటమికి ఓటేసినవారిలో సగం కంటే ఎక్కువ మంది ఈ20 పెట్రోల్ వినియోగంపై విము ఖత వ్యక్తంచేస్తున్నట్లు తాజాగా నిర్వహించిన సీఓటర్ సర్వేలో వెల్లడైంది.
దానివల్ల వాహనం పాడైపోతుందని, మైలేజీ తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై సీఓటర్ సంస్థ ఈ స్నాప్ పోల్‌ను జూలై 8, 9 తేదీల్లో టెలిఫోన్ ఇంటర్వ్యూయింగ్ విధానంలో నిర్వహించింది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలకు చెందిన 1,641 మందిని ప్రశ్నించింది. అంతా 18 ఏళ్లు దాటినవారే.
ఈ సర్వే ప్రకారం.. ఎన్డీయే ఓటర్లలో 52.5% మంది తమ వాహనాల్లో ఈ20 పెట్రోల్ వాడటానికి ఇష్టపడట్లేదు. 18.1% మంది అందుకు సుముఖంగా ఉండగా… 29.5% మంది ఎటూ తేల్చుకోలేమని చెప్పారు.
ఇక, యూపీఏ (ఇండి కూటమి) ఓటర్లలో 57.2% మంది తాము ఈ పెట్రోల్ వాడకానికి ప్రతికూలమని చెప్పగా, 18.63% మంది ఓకే అన్నారు. ఇతర పార్టీలకు ఓటు వేసినవారిలో 55% మంది ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకమన్నారు. మొత్తంగా 55.1% మంది ఈ20 పెట్రోలుకు నో చెప్పగా కేవలం 17.1% మంది మాత్రమే ఇథనాల్ పెట్రోల్ వాడతామన్నారు.
అసలు కేవలం 1641 మంది శాంపిల్ జాతి అభిప్రాయాన్ని ప్రతిబింబించదు… టెలిఫోన్ ఇంటర్వ్యూరింగ్‌కు పెద్ద శాస్త్రీయత లేదు… సో, ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోలేం, పైగా పార్టీలకూ ఈ20 వాడతారా లేదా అనే అభిప్రాయానికీ సంబంధం లేదు… ఉత్త హంబగ్…
బీజేపీ వోటరు ఐనంత మాత్రాన ఈ20 ఇంధనాన్ని సమర్థించాలని ఏమీ లేదు, యూపీఏ వోటర్లు ఖండితంగా దాన్ని వ్యతిరేకించాలనీ లేదు… అంతకు మించి ఒక వోటరు ఒకే పార్టీకి బద్దుడు అనే భావనే మూర్ఖత్వం… ఒక వోటరు లోకసభ ఎన్నికల్లో బీజేపీకి వోటేయవచ్చు, అదే వోటరు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వేయవచ్చు, అదే వోటరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పార్టీని ఎన్నుకోవచ్చు…
వోటరు ప్రాధాన్యతలు ఎన్నికలను బట్టి వేర్వేరుగా ఉంటాయి… అనేక కారణాలు తన వోటు వేసే ప్రాధాన్యతల్ని ప్రభావితం చేస్తాయి… సో, ఈ స్థితిలో పార్టీల వారీగా ఈ20 ఇంధనం ఆమోదనీయతపై సర్వే అనేది శుద్ధ మూర్ఖత్వం..!!
Share this Article