.
ఇండియన్లకు క్రికెెట్, సినిమాలు, రాజకీయాలు… ఇవే ముఖ్యం… క్రికెట్ అంటేనే ఓ మతం… ఓ పిచ్చి… అఫ్‌కోర్స్, దైనందిన వర్తమాన ఒత్తిళ్ల నుంచి క్రికెట్ వీక్షణంలో రిలాక్స్ వెతుక్కుంటాడు సగటు ఇండియన్… కానీ ఓ విశేషం ఏమిటంటే..?
ఈసారి ఐపీఎల్‌కు పెద్ద డిమాండ్ లేదు అనుకుంటున్నాం కదా… అంతటి జియో హాట్‌స్టార్ కూడా ఏకంగా 1000 కోట్ల నష్టాన్ని అంచనా వేసుకుంటోంది… ఎంతసేపూ బ్యాటర్లకు అనుకూలంగా పిచ్చులు తయారు చేసి, ఆటను చెత్త చెత్త చేశారనే విమర్శలు ఉన్నవే కదా… తోపు బౌలర్లు కూడా చేతులెత్తేస్తున్నారు…
Ads
అయితే..? 22న హైదరాబాద్, బెంగుళూరు జట్ల నడుమ జరగబోయే మ్యాచుకు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్, గిరాకీ, డిమాండ్ ఏర్పడింది… అనూహ్యం… ఎంత అంటే… కర్నాటక – తెలుగు రాష్ట్రాల బోర్డర్లు దాటి బెంగుళూరు ఫ్యాన్స్ వస్తున్నారు… కోహ్లీ క్రేజ్… మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్లు గిరాకీ ఏర్పడింది…

సింపుల్‌గా ఓ ఉదాహరణ చెప్పాలా… 3 వేల రూపాయల టికెట్ ధర బ్లాకులో లక్ష రూపాయల దాకా పలుకుతోంది… ఇదే అదునుగా స్టేడియం కూడా రేట్లు అడ్డగోలుగా పెంచేసింది… మరి గిరాకీని సొమ్ము చేసుకోవాలి కదా… ఎవడి దందా వాడిది… రేట్ల పెంపు ఇలా ఉందంటున్నారు…
950 టికెట్ 2000 కి
1500 ఉన్న టికెట్ 3000 కి
1910 ఉన్న టికెట్ 3500 కి
2500 ఉన్న టికెట్ 4500 కి
4500 ఉన్న టికెట్ 6000 కి
7000 ఉన్న టికెట్ ధర 10 వేల రూపాయలకు
23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర 30 వేల రూపాయలకు
30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర 45 వేలకు పెంపు
…. ఎస్, ఈ రెండు జట్ల మధ్య మ్యాచు విశేషం ఓసారి చూద్దాం… ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి బెంగుళూరు జట్టు పాయింట్ల టేబుల్ టాప్‌లో ఉంది… 16 పాయింట్లతో… మరోవైపు హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో ప్లేసులో ఉంది…
ప్లేఆఫ్ పోరులో రెండు జట్లకూ కీలకం ఈ మ్యాచ్… రెండూ దీటైన జట్లే ఈ సీజన్‌లో… అదీ అసలు విషయం… ఐనా ఇంత డిమాండ్ నెవ్వర్ ఎక్స్‌పెక్టెడ్… మంత్రులు, సీనియర్ బ్యూరోక్రాట్ల నుంచి సీఎంవో దాకా టికెట్లు, పాసుల కోసం పైరవీలు… ఒత్తిళ్లు…

ఓటీటీలో సినిమా చూడొచ్చు, టీవీలో సినిమా చూడొచ్చు… కానీ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ వేరు… ఆ మజా వేరు… జనం మధ్య, ఫుల్ డాల్బీలో చూస్తే ఆ థ్రిల్ వేరు… సేమ్, ఎక్కడో కూర్చుని టీవీలోనో, స్మార్ట్ ఫోన్‌లోనో మ్యాచ్ చూడొచ్చు… కానీ సగటు క్రికెట్ ప్రేమికుడికి సంతృప్తి ఉండదు… స్టేడియం వెళ్లాలి, కళ్లారా చూడాలి… కేరింతలు, చప్పట్లు… ఆ జోష్ వేరు కదా… అదీ ఇంత గిరాకీకి కారణం… పైగా సమస్కంధుల నడుమ పోరు.,.!!
ష్… టికెట్లకే ఇంత గిరాకీ ఉందంటే… బెట్టింగ్ రాయుళ్లలో ఎంత పూనకాలు లోడింగో అర్థమవుతోందిగా..!!
- ఇంకో రీజన్ ఏంటంటే… ఈసారి కావ్య పాప 20 కోట్లు ఖర్చు పెట్టి స్టేడియం మొత్తం కాషాయమయం చేసింది ( అంటే బీజేపీ కలర్ కాదు, సనాతనం కూడా కాదు )… సన్‌రైజర్స్ జెర్సీ కలర్… వన్ అఫ్ ది బెస్ట్ స్టేడియం ఎక్స్‌పీరియన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో… ఉప్పల్ గ్రౌండ్…. అంతేగాకుండా బెస్ట్ DJ కూడా… ఒక్కసారి ఆయా షేర్ (పారడైజ్ సినిమా పాట )అంటూ 40 వేల మంది ఫ్యాన్స్ ఉగిపోతే ఆ మజాయే వేరు కదా…
Share this Article