Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Shreyas Iyer … సర్పంచ్ సాబ్ చెత్త రికార్డు… పరువు పోయిందిగా…

May 18, 2026 by M S R

.

ఇంకా ఆశలు ఏమీ ఉడిగిపోలేదు… ప్లేఆఫ్ వైపు పరుగులో పంజాబ్ జట్టు కూడా ఉంది… కానీ మరో పరాజయం పంజాబ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసింది… ఏదో లక్నో, కోల్‌కతా, చెన్నై, ముంబై జట్లలాగే ఈసారి నాసిరకం ఆటతీరు ఏమీ కనబరచడం లేదు పంజాబ్… మొొదట్లోనే వరుసగా ఆరు విజయాలు… కానీ హఠాత్తుగా ఏమైంది..?

వరుసగా ఆరు పరాజయాలు… ఇప్పుడు అదే లక్నో, అదే కోల్‌కతా, అదే చెన్నై, అదే ముంబై నయం అనిపిస్తున్నాయి… నిజం, చెన్నై అకస్మాత్తుగా పుంజుకుంది, రాజస్థాన్ జట్టు కూడా ప్లేఆఫ్ బరిలోనే ఉంది… ఇప్పుడిక ఆ జట్లతో పంజాబ్ ప్లేఆఫ్ సమీకరణాల్లో పోటీపడాల్సిన దురవస్థ…

Ads

ప్రస్తుతం బెంగుళూరు 18 పాయింట్లతో ఏ సమీకరణాలు అక్కర్లేదకుండా, అందరికన్నా ముందే ప్లేఆఫ్‌కు చేరుకుంది… 2020, 2021, 2022, 2024 సీజన్లలో కూడా ప్లేఆఫ్ జట్టు ఇది… 2025లో, అంటే గత సీజన్ చాంపియన్… ఇప్పుడు మళ్లీ ప్లేఆఫ్… అంటే ఆరు సంవత్సరాలుగా అదే కన్సిస్టెన్సీ… అంటే అంత బలమైన కూర్పు… బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగుల్లో ఎక్కడా తగ్గడం లేదు…

మొదట్లో కాస్త బాగానే ఆడినట్టు అనిపించినా సరే… రాజస్థాన్, ఢిల్లీ హఠాత్తుగా వెనకబడిపోయాయి… ఇప్పుడున్న స్థితిలో బెంగుళూరుతోపాటు హైదరాబాద్, గుజరాత్ కూడా బలంగా కనిపిస్తున్నాయి…

సరే, పంజాబ్ విషయానికి వస్తే… విజయవంతమైన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ మంచి ప్రశంసలు పొందుతున్నాడు కదా… కానీ ఆరు వరుస పరాజయాలు తనను మబ్బుల్లో నుంచి నేల మీదకు పడేశాయి… ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది పంజాబ్… అదేమిటంటే..?

ఒకే సీజన్‌లో 9 సార్లు 200 ప్లస్ పరుగుల్ని సమర్పించుకున్న జట్టు ఇదే… మెన్స్ టీ20 మ్యాచుల్లో 46 సార్లు 200 ప్లస్ రన్స్ ఇచ్చింది ఈ జట్టే… (శ్రేయస్ కెప్టెన్సీలో తను ఆడిన జట్లు 31 సార్లు ఇలా 200 ప్లస్ రన్స్ ఇచ్చాయి)…

అంటే అర్థం ఏమిటి..? ఫీల్డింగ్, బౌలింగ్ వ్యూహాల్లో శ్రేయస్ తేలిపోతున్నాడని… ఈ సీజన్‌లో అయితే బౌలింగ్ మరీ పూర్… అర్షదీప్ సింగ్ (వైడ్ బాల్ సింగ్), చాహల్, అజ్మత్, ఫెర్గూసన్, హర్‌ప్రీత్ వికెట్లు తీయలేకపోగా, ధారాళంగా పరుగులు ఇచ్చేశారు… సో, సర్పంచ్ సాబ్ కెప్టెన్సీ వైఫల్యాలను ఈ ఆరు వరుస పరాజయాలు ఎత్తిచూపుతున్నాయి… సరిదిద్దుకోవాల్సిందే… లేదంటే కష్టమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎబోలా…! ఏమో, అజాగ్రత్తగా వదిలేస్తే మరో కోవిడ్..? అసలే ప్రాణాంతకం..!!
  • Virat Kohli … ఇప్పటికే అదే జోష్… అదే టెంపర్‌మెంట్… తగ్గేదేలే…
  • అపరిపక్వత, పిరికి, కుళ్లు, అసూయ…ఇజ్జత్ పోగొట్టుకున్న రజినీకాంత్…
  • Shreyas Iyer … సర్పంచ్ సాబ్ చెత్త రికార్డు… పరువు పోయిందిగా…
  • మెడికల్ మాఫియా..! తిండికన్నా మందుల్నే ఎక్కువ తినిపిస్తుంది..!!
  • విధికి ఎదురీత..! మెడికల్ హిస్టరీని మార్చేసిన 6 గంటల అద్భుతం..!
  • 3 పెళ్లిళ్లు చేసుకుని 17 ఏళ్లు వేస్ట్ చేశాను… ఇప్పుడు బుద్దొచ్చింది…
  • పెదవి కొరికే పెదవి కొరకే… వేటూరి సుఖాలాపనలు బోలెడు…
  • అప‘జయం’ రవి..! ప్రేమ, పెళ్లి ఓ బూటకం… మనుషుల నాటకం..!!
  • సీఎం జోసెఫ్ విజయ్ టర్కీ టవల్ కథ..! కాస్త థిక్ స్కిన్ అవసరం బాసూ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions