Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సొంత ప్రధానినే ఆక్షేపిస్తే… సోయిలేని ‘పత్తాలాట మాటలు’ అంటారు..!!

May 19, 2026 by M S R

.

‘‘ఇది పత్తాలాట కాదు, పత్తాలాడే ప్లేస్ కూడా కాదు, పత్తాలాడే టేబుల్ మీద వాగినట్టు వాగకు’’….. ఎవరు ఎవరిని ఇలా తిట్టారో అర్థం కాలేదా..? పైపైన వార్తలు చదివి ధర్మపురి అర్వింద్ అనే ఓ ఎంపీని జనం ఆక్షేపిస్తున్నట్టు అర్థం చేసుకుంటున్నారా..? తన షెకల్, మాటల్ చూస్తే అందరూ అలా అనుకుంటారేమో గానీ… తను రేవంత్ రెడ్డిని అన్నాడు ఆ మాటలు… కానీ అవి తనకే పర్‌ఫెక్ట్‌గా వర్తిస్తాయనే సోయి వదిలేశాడు… ఉల్టా తగిలాయి ఇవన్నీ… కౌంటర్ ప్రొడక్ట్…

ఇంకా తను ఏమంటాడంటే..? ‘‘ఏమో, మోదీకి రేవంత్‌కూ లింక్ ఉందేమో… సువేందు అధికారి అవుతాడేమో… కోమటిరెడ్డిని సీఎంగా చేస్తే మంచిగుండేది… కేసీ వేణుగోపాల్‌ కోసం పైసలు పెట్టిండు… రేవంత్‌కు సీఎం స్ట్రేచర్ లేదు… శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలలో ఒకరిని (జీవితాంతం కాంగ్రెస్‌లో ఉన్నోళ్లను) సీఎం చేస్తే సరిపోయేది…’’

Ads

సరే, నేనేమో మస్తు మైండ్ గేమ్ ఆడుతున్నాను అనుకున్నట్టున్నాడు సారు గారు… కానీ తన ప్రధానినే తను బ్యాడ్ చేస్తున్నాడనే సోయి లోపించింది… ఏమో, మోదీకి రేవంత్‌కూ ఏమైనా లింక్ ఉందేమో… సువేందు అవుతాడేమో అంటున్నాడంటే… రెండు అంశాలు…

1) నిజంగానే మోదీ రేవంత్‌ను సువేందును చేయాలని అనుకుంటే… అది ఈ అర్వింద్ సహా మిగతా బీజేపీ ముఖ్యులెవరూ పనికిరారని మోదీ ఫిక్సయినట్టు లెక్క… అది  నిజమేనంటావా అర్వింద్..? ఇదేం సోయి..? నీతోపాటు తోటి ఎంపీలను, రాష్ట్ర పార్టీ ముఖ్యులు కూడా పనికిరారని మోదీ చెబుతున్నాడని అంగీకరిస్తున్నట్టేనా..?  2) ఏకంగా మోదీని, అంటే తన పార్టీ ప్రధానిని ఆక్షేపిస్తున్నాడు అంటే… బీజేపీ నుంచి జంప్ అవుతున్నాడా కొంపదీసి..? మోదీ వ్యాఖ్యలకు వక్రబాష్యం చెప్పడం అంటే మోదీని ధిక్కరించడం, ఇది ఫిక్సేనా మిస్టర్ అరవింద్..?

సరే, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డిని సీఎంను చేయాలా..? శ్రీధర్ బాబును సీఎంను చేయాలా..? ఆ పార్టీ చూసుకుంటుంది గానీ… మీ పార్టీ పరిస్థితి ఏమిటి..? ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది పార్టీ చీలికలు, ఎనిమిది దిక్కులు… అసలు ముందుగా చక్కదిద్దుకోవాల్సింది మీ గోచీ బట్టలే కదా… అది లేక, కనిపించక, చక్కబడే సీన్ లేకనే ఏమో మోదీ మీరెవరూ పనికిరారు, ఆ రేవంత్ నయం అంటున్నాడని అర్థం చేసుకోవాలా..? ఆ కోపంతో, ఆ అక్కసుతో ఏకంగా మోదీ వ్యాఖ్యలకే వక్రబాష్యాలకు దిగినట్టు అర్థం చేసుకోవాలా..?

పోనీ, నువ్వు బీజేపీ వదిలిపోతావు అనుకుందాం… బీఆర్ఎస్‌లోకి పోలేవు… ఏళ్ల తరబడీ కాంగ్రెస్‌లో ఉండి, అనేక అవకాశాలిచ్చి ప్రయారిటీ ఇచ్చి, పదవులిచ్చిన కాంగ్రెస్‌ను అచ్చం నీ ఫ్రెండ్ జీవన్‌రెడ్డిలాగే వదిలేసి, సలహాదారు అవతారమెత్తి, రాజ్యసభ సభ్యుడు అయిపోయి… చివరకు అదే బీఆర్ఎస్ మీద ద్వేషం పెంచుకున్న మీ నాన్న డి.శ్రీనివాస్ చేదు అనుభవాలు నీకన్నా ఇంకెవరికి ఎక్కువ తెలుసు..? సో, బీఆర్ఎస్‌లోకి పోలేవు… కాంగ్రెస్ వాళ్లు పది ఆమడల దూరం ఉంచేస్తారు… ఇక మిగిలింది కవిత టీఆర్ఎస్…

నీకూ ఆమెకూ ఉప్పునిప్పు… పోలేవు… సాఫ్ట్, ఫాస్ట్ పేరిట నువ్వూ, ఈటల కలిసి బండి సంజయ్‌‌ను భ్రష్టుపట్టించే పనిలో పడ్డారని బీజేపీ కేడర్ అనుమానిస్తోంది… అందుకే చెప్పింది, మీ గోచీబట్ట పైలం నాయకా అని..!! క్లియర్‌గా రేవంత్ చెప్పాడు… ‘రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, కలిసిరా’ అని మోదీ చెప్పాడు అని… అది ఓ కేంద్రానికీ, ఓ రాష్ట్రానికీ నడుమ ఉండాల్సిన సత్సంబంధం… ఈ దిశలో మోదీని వెనకేసుకురావల్సిన నువ్వే వక్రబాష్యం చెబుతూ… మోదీ వ్యాఖ్యలకే తప్పుడు అర్థాలను జనంలోకి తీసుకువెళ్తున్నావంటే… ఏదో తేడా కొడుతోంది..!!

అన్నట్టు… రేవంత్‌ది సీఎం స్థాయి కాదు అని కదా నువ్వున్నది… హహహ… నువ్వు ఎంపీగానే మిగిలిపోయావు… రేవంత్ ఏకంగా సీఎంగా ఎదిగాడు… ఎవరి రేంజ్ ఏమిటనే డిబేట్ పెట్టి, స్వయంగా బట్టలూడదీసుకోవడం దేనికి నాయకా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రభుత్వ శాఖల్లో ‘డిజిటల్ పాలన’… కొత్త సీఎస్ సంజయ్ జాజు ముద్ర!
  • భారీ ఆర్థిక మోసం ‘షేర్ బజార్’ – ‘కిసాన్ పరివార్’ స్కామ్ వెనుక అసలు కథ!
  • విజయ్ అపరిణతి! స్టేట్ అంటే నీ ఎస్టేట్ కాదు ముఖ్యమంత్రి గారూ!!
  • యూ టూ ఈటల!! అచ్చం హరీష్ భాషే!! ఎవరిని ఆక్షేపిస్తున్నట్టు!?
  • నిదా ఖాన్ బెయిల్ ఇష్యూ! మరి కృష్ణుడి పుట్టుక మీద వ్యాఖ్యలు దేనికి..?!
  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions