Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రక్తికట్టిన ఐపీఎల్… నాలుగో బెర్త్ కోసం ఐదు జట్ల సమరం…

May 19, 2026 by M S R

.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వచ్చే 22న జరగబోయే బెంగుళూరు- హైదరాబాద్ మ్యాచ్ వెరీ స్పెషల్… అధికారికంగానే అడ్డగోలుగా పెంచబడిన రేట్లు… ఫుల్ బ్లాక్‌మార్కెట్… ఓ మేనియా ఏర్పడింది… ఇంత గిరాకీ, ఇంత హైప్, జనం టికెట్ల కోసం ఇంతగా విరగబడటం ఈమధ్యకాలంలో చూడలేదు… అయితే విశేషం ఏమిటంటే..?

ఆ మ్యాచ్‌‌కు ఐపీఎల్ టేబుల్, ప్లేఆఫ్‌కు సంబంధించి, గెలుపోటముల లాభనష్టాలకు సంబంధించిన విలువ జీరో… ఎవరు గెలిచినా ప్లేఆఫ్‌లో తేడా రాదు వాటికి… ఎందుకంటే… నిన్నటి మ్యాచులో చెన్నై మీద హైదరాబాద్ జట్టు గెలవడంతో… సమీకరణాలు చకచకా మారిపోయి… హైదరాబాద్, గుజరాత్ ప్లేఆఫ్‌కు వెళ్లిపోయాయి… సో, ఇవి రెండు ప్లస్ బెంగుళూరు ప్రస్తుతానికి ప్లేఆఫ్‌లో సేఫ్…

Ads

కానీ ఈ సీజన్‌లోనూ బాగా రాణిస్తున్న గత సీజన్ చాంపియన్ బెంగుళూరు, హైదరాబాద్ సొంత జట్టు… కోహ్లీ క్రేజీ ఉండనే ఉంది… అందులో ఈ మ్యాచు మీద అంత పిచ్చి జనానికి.! సేమ్, ముంబై, లక్నోలకు రెండేసి మ్యాచులున్నాయి… కానీ అవి గెలిచినా వాటికి వచ్చేదేమీ లేదు, ఖాళీగా ఇంటికి పోవడమే, కానీ వేరే జట్ల అవకాశాలను దెబ్బతీయగలవు…

ఎందుకంటే..? ప్లేఆఫ్ చివరి బెర్త్ కోసం ఇప్పుడు ఏకంగా ఐదు జట్ల నడుమ పోటీ… మ్యూజికల్ చెయిర్స్… అవి పంజాబ్, రాజస్థాన్, చెన్నై, కోల్‌‌కతా, ఢిల్లీ… నిజానికి అందరికన్నా ముందే పంజాబ్ ప్లేఆఫ్ అనుకున్నారు… కానీ వరుస ఆరు పరాజయాలతో క్లిష్టమైన సమీకరణాల్లో ఇరుక్కుంది… రాజస్థాన్‌కు మరో రెండు మ్యాచులున్నాయి… సో, వేరేవాళ్లతో పోలిస్తే దానికి అడ్వాంటేజ్, పైగా అవి ఇంటికెళ్లే ముంబై, లక్నో జట్లు కాబట్టి రాజస్థాన్‌కు ఆశలు ఎక్కువున్నాయి…

నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే… టార్గెట్ 181 మాత్రమే… కానీ రన్స్ వేగంగా రాని స్థితిలో అభిషేక్, హెడ్ ఔట్ కాగానే చాలామంది మ్యాచ్ చూడటం ఆపేశారు… కానీ ఇషాన్, క్లాసెన్ జాగ్రత్తగా నిలబడి, ఆడి హైదరాబాద్‌ను ప్లేఆఫ్‌లోకి తీసుకుపోయారు… శుభం… 2016 విజేత హైదరాబాద్… ఈసారి ఆ విజయాన్ని రిపీట్ చేస్తుందా..? ఏమో, గుజరాత్ కాచుకుని ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తికట్టిన ఐపీఎల్… నాలుగో బెర్త్ కోసం ఐదు జట్ల సమరం…
  • నాటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తున్నదంటే…?
  • అమెరికాలో అదానీ కేసు వింత ‘సెటిల్మెంట్’ కథ ఇదీ…
  • అధికారమే పరమావధి… ఓ జర్నలిస్టుకు అనుభవంతో తత్వబోధ
  • చట్టిలో సరుకేదో నింపుకెళ్లు… భువనచంద్రుడూ వేటూరికి తీసిపోడు…
  • పాపం సాయి భగీరథ్… ఆంధ్రజ్యోతికి కన్నీళ్లొక్కటే తక్కువ…
  • అయోధ్యకు బాలీవుడ్ డబ్బు… సెలబ్రిటీల భారీ పెట్టుబడులు…
  • ఎర్రన్నలు మొత్తుకుంటుంటారు కదా… చైనాలో ప్రెస్ ఫ్రీడమ్ తెలుసా..?!
  • ఎబోలా…! ఏమో, అజాగ్రత్తగా వదిలేస్తే మరో కోవిడ్..? అసలే ప్రాణాంతకం..!!
  • Virat Kohli … ఇప్పటికే అదే జోష్… అదే టెంపర్‌మెంట్… తగ్గేదేలే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions