Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియా కూటమి కథ… ఇక ‘బభ్రాజమానం- భజగోవిందం…’

May 19, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  INDI కూటమి ముగింపు దశలోనా..? కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇచ్చిన సైలెంట్ పొలిటికల్ మెసేజ్..!
కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయంగా ఒక చిన్న ఈవెంట్ కాదు, దేశ ప్రతిపక్ష రాజకీయాల భవిష్యత్తుపై కూడా ఒక సైలెంట్ మెసేజ్ ఇచ్చిన ఈవెంట్‌.
ఎందుకంటే, INDI కూటమి పేరుతో కలిసి వచ్చిన ప్రధాన ప్రాంతీయ నేతల్లో చాలామంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.

అఖిలేష్ యాదవ్ లేరు
తేజస్వి యాదవ్ లేరు
ఎంకే స్టాలిన్ లేరు
మమతా బెనర్జీ లేరు
ఉద్ధవ్ ఠాక్రే లేరు
హేమంత్ సోరెన్ లేరు
ఒమర్ అబ్దుల్లా లేరు
అరవింద్ కేజ్రీవాల్ లేరు
NCP(SP) కూడా కనిపించలేదు.

Ads

ఇది కేవలం “బిజీ షెడ్యూల్” అనిపించే విషయం కాదు , ఎందుకంటే INDI కూటమి మొదట ఏర్పడినప్పుడు ప్రధాన లక్ష్యం “మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒకే వేదిక” అనే భావన.
ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే అక్కడకు ఈ నాయకులంతా పాలొమంటూ పరిగెత్తుకొచ్చి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చేతులెత్తి ఐక్యంగా వున్నాము అని చూపించే ప్రయత్నం చేశారు.

కానీ 2024 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు ప్రతి ప్రాంతీయ పార్టీకి మొదటి ప్రాధాన్యత: తమ రాష్ట్రం, తమ ఓటు బ్యాంక్, తమ పార్టీ భవిష్యత్తు. అందుకే “జాతీయ కూటమి” కంటే “ప్రాంతీయ లెక్కలు” ఎక్కువగా కనిపిస్తున్నాయి.

🔹 తమిళనాడులో స్టాలిన్‌కు కాంగ్రెస్ మధ్య దూరం ప్రకటించుకున్నారు. అది ఎంత దూరం పోయింది అంటే లోకసభ, రాజ్యసభలో పక్క పక్కన కూర్చోము అన్నంతగా. అన్నా డీఎంకే పూర్తిగా చీలిపోయి, నాశనం అయ్యే పరిస్థితిలో… ఢిల్లీలో వున్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా డిఎంకె NDA కు దగ్గర అవ్వచ్చు, అదే సమయంలో కాంగ్రెస్ కూడా అక్కడ DMKపై పూర్తిగా ఆధారపడకుండా 2029 సమయానికి విజయ్ తో దక్షిణాదిలో కూటమి ఏర్పాటు చేద్దాం అని పథకాల్లో ఉంది.

🔹 పంజాబ్‌లో కాంగ్రెస్ & AAP ఒకరికొకరు ప్రత్యక్ష శత్రువులు. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. గుజరాత్, హిమాచల్, గోవాలలో కూడా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేసింది.
🔹 బెంగాల్‌లో మమత కాంగ్రెస్‌ను నమ్మడం లేదు. కాంగ్రెస్ కూడా TMCపై పూర్తి విశ్వాసంతో లేదు. ఇక్కడ లెఫ్ట్, కాంగ్రెస్ ఒక జట్టు.

🔹 మహారాష్ట్రలో ఉద్ధవ్, శరద్ పవార్, కాంగ్రెస్ కలిసి ఉన్నా… లోపల సీట్ల లెక్కలు, నేతృత్వ పోటీలు ఇంకా ముగియలేదు. అసలు ఆ కూటమి ఉందో లేదో తెలియదు. ముఖ్యంగా ఉద్ధవ్ , శరద్ పవార్ పార్టీ ఎంపీలు NDA లో కలిసి పోవచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు ఇండి కూటమిలో కాంగ్రెస్ ఒక్కటే మిగిలి పోవచ్చు.

🔹 ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌కు కాంగ్రెస్ కంటే SP బలం ముఖ్యం. కాంగ్రెస్‌కు మాత్రం UPలో బతకడానికి SP అవసరం. ఇక్కడ కాంగ్రెస్ వేరే చిన్న పార్టీలతో కలిసి ఇండి కూటమి బయట పోటీ చేస్తుందా , అఖిలేష్ తో కలిసి పోతుందా 2027 అసెంబ్లీ ఎన్నికలు చెపుతాయి.

🔹 ఇక జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, నవీన్ పట్నాయక్ మేం ఎపుడూ బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరమే అని చెప్పుకుంటున్నారు. వారికి వారి రాష్ట్రాల్లో వారి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ముఖ్యం ముందు.
అంటే బయటికి “ఐక్యత” కనిపించినా లోపల ప్రతి పార్టీ తమ రాజకీయ ప్రాణరక్షణ కోసం వేర్వేరు దారుల్లో నడుస్తోంది.
ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఈ విభజన ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.

2027 ఎన్నికలు….
• ఉత్తరప్రదేశ్
• పంజాబ్
• ఉత్తరాఖండ్
• గోవా
• మణిపూర్
• హిమాచల్ ప్రదేశ్
ఇక్కడ ఇండి కూటమి అంటూ బలమైన చర్చ వచ్చే రాష్ట్రం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మాత్రమే. మిగతా చోట అంతా ఎవరికి వారే. అసలు ఇండి కూటమి అనేది కొన్ని చోట్ల లేదు.

➡️ పంజాబ్‌లో కాంగ్రెస్ vs AAP
➡️ ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఒంటరిగా
➡️ గోవాలో స్థానిక లెక్కలు, బీజేపీ, చిన్న పార్టీలు VS కాంగ్రెస్. చిన్న పార్టీలు.
➡️ హిమాచల్‌లో ప్రత్యక్ష BJP vs కాంగ్రెస్

2028 ఎన్నికలు….
• తెలంగాణ
• కర్ణాటక
• రాజస్థాన్
• మధ్యప్రదేశ్
• ఛత్తీస్‌గఢ్
ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎక్కువ రాష్ట్రాల్లో స్వతంత్రంగానే పోరాడుతుంది. దాదాపు ప్రతిచోట బీజేపీ vs కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ vs BRS vs BJP
కర్ణాటకలో కాంగ్రెస్ vs BJP vs JD(S)
రాజస్థాన్, MP, ఛత్తీస్‌గఢ్‌లలో నేరుగా BJP vs కాంగ్రెస్
అంటే “INDI కూటమి” అనే జాతీయ రాజకీయ బ్రాండ్ కంటే, “రాష్ట్రానికో వ్యూహం” అనే మోడల్‌నే పార్టీలు ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ.

2029 లోక్‌సభ ఎన్నికల దగ్గరికి వచ్చే వరకు ఈ కూటమి పేరుకే ఉండి… గ్రౌండ్‌లో మాత్రం “ఎవడి పోరాటం వారిదే” అనే పరిస్థితి కనిపించొచ్చు, లేదా అవసరం కోసం మళ్ళీ కలవచ్చు, కలిసినా ఆ ఐక్యత కనిపిస్తుందా? ఆ సమయానికి ఎన్ని పార్టీలు మిగులుతాయో చూడాలి .
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు, కానీ ప్రస్తుతం చూస్తే “శాశ్వత ప్రయోజనాలే” మాత్రమే కనిపిస్తున్నాయి … — ఉపద్రష్ట పార్ధసారధి

#INDIAAlliance #Congress #AAP #SP #DMK #TMC #KeralaPolitics #UPPolitics #IndianPolitics #TeluguPolitics #2029Elections #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కూటమి కథ… ఇక ‘బభ్రాజమానం- భజగోవిందం…’
  • కేజ్రీవాల్‌కు మరిన్ని ‘న్యాయచిక్కులు’… క్రిమినల్ కంటెంప్ట్ కేసు…
  • విజయ్ మంత్రుల్లో కీలకుడు… ఈ ‘సోషల్ షో’ చూడండి ఓసారి…
  • రంకు మొగుడు అంటే మాస్ ముతక… రంజు మొగుడు అంటే పాలిష్డ్…
  • ఇడ్లీని చక్కెరపాకంలో ముంచితే రసగుల్లా అట…! ఎవడా ఇడ్లీ ద్రోహి..?!
  • ఈ కేసులో అమ్మాయి మేజర్ కాబట్టి సరిపోయింది..!!
  • కన్నీటి అబద్ధాలకంటే… కాలర్‌ ఎగరేసే నిజాలే ఎప్పుడూ గొప్పవి!
  • సొంత ప్రధానినే ఆక్షేపిస్తే… సోయిలేని ‘పత్తాలాట మాటలు’ అంటారు..!!
  • బెంగాల్‌లో ఏం జరుగుతోంది..? మాయ రోగాలకు ‘కాయకల్ప చికిత్స’..!!
  • రక్తికట్టిన ఐపీఎల్… నాలుగో బెర్త్ కోసం ఐదు జట్ల సమరం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions