Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్ అపరిణతి! స్టేట్ అంటే నీ ఎస్టేట్ కాదు ముఖ్యమంత్రి గారూ!!

July 10, 2026 by M S R

.

తమిళనాడు సీఎం విజయ్ అనుభవరాహిత్యం కావచ్చు, రాజకీయాల్లో కొత్త కావడం వల్ల కావచ్చు, తన చుట్టూ ఉన్న కోటరీ రాంగ్ గైడెన్స్ కావచ్చు… బెంగాల్ కొత్త సీఎంతో పోలిస్తే వెలవెలాపోతున్నాడు… పాలనలో తన ముద్ర లేదు, రాంగ్ డెసిషన్స్, ఇన్నిరోజులైంది ఇదీ నా ముద్ర అనే బాపతు ఒక్క నిర్ణయమూ లేదు, పైగా ఇంకా స్టాలినే పాలిస్తున్నాడా అనిపించే కొన్ని నిర్ణయాలు!

తిరుప్పరంకుండ్రం కార్తీకదీపం కేసులో సేమ్ స్టాలిన్… దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్ల కొనసాగింపు, సేమ్ స్టాలిన్… నీట్ మాకు వద్దు, సేమ్ స్టాలిన్… సరే, ఈ ఉదాహరణలు ఎలా ఉన్నా సరే… పార్టీ అంటే తన అభిమాన సంఘాల సమాఖ్య, కార్యకర్తలు అంటే తన ఫ్యాన్స్, ప్రజలు  అంటే తన అభిమానులు అనే ఓ అపరిణత భావజాలంలో ఉన్నాడు విజయ్… తన చుట్టూ ఉన్నవాళ్లు, తన సేవకులు, తన వాళ్లకే టికెట్లు ఇవ్వడం కూడా అదే…

Ads

రాజకీయ సిద్ధాంతాలు, అవగాహన, సమాజం పట్ల- పాలన వ్యవస్థ పట్ల ఏమీ తెలియనితనం కనిపిస్తోంది… ఎందుకంటే… కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాడు తను… 32 బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు అట… ఆ బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నాడు… తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ…

అయ్యా, విజయ్… ఆ తొక్కిసలాట నీ తప్పు, నీ పార్టీ తప్పు, నువ్వు ప్రభుత్వానిది, పోలీసులది తప్పు అని చెప్పినా సరే… అది పార్టీ యవ్వారం… ఆదుకోవాలి అనుకుంటే ఒక్కో కుటుంబానికి కోటి ఇస్తావో రెండు కోట్లు ఇస్తావో నీ పార్టీ నిర్ణయించుకోవాలి… ప్రభుత్వ ఉద్యోగాలు దేనికి..? ఆ కుటుంబాలు నీ కోసం త్యాగం చేశాయి, ఆరిపోయాయి తప్ప, సమాజం కోసం కాదు, ఎవరినీ ఉద్దరించిన త్యాగాలు కావు…

ప్రభుత్వ ఉద్యోగాలు పోటీపడి గెలుచుకోవాల్సినవి… వేలు, లక్షల మంది పోటీపడతారు… వారిని కాదని, వీళ్లకు కొలువులు ఇవ్వడం అంటే 32 మంది అర్హులైన ఇతర నిరుద్యోగుల పొట్టగొట్టినట్టు..! వీళ్లు కొలువుల్లో చేరి ఎవరినీ ఏమీ ఉద్దరించేదేమీ ఉండదు, మరింత మూఢ భక్తులు కావడం తప్ప… ఇవి మరోరకం కారుణ్య నియామకాలు..!!

ఎవరైనా ఉద్యోగంలో ఉండి మరణిస్తే, ఆ కుటుంబంలో ఒకరికి ఆ కొలువు ఇస్తే ఒకరకంగా సమర్థనీయం… నిజానికి అదీ తప్పే… అది మెరిట్ ఎలా అవుతుంది..? సరే, ఎవరైనా జవాను దేశరక్షణలో ప్రాణాలు విడిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కొలువు ఇస్తే, జాతి కృతజ్ఞత చాటుకున్నట్టు అనుకుందాం, నిజానికి అదీ తప్పే… అంతేకాదు, ఏవో క్రీడాపోటీల్లో ఏదో ఊడబొడిస్తే ఏకంగా గ్రూపు-1 కొలువులు ఇవ్వడం మరీ బాధ్యతారాహిత్యం…

అర్హులైన మెరిటోరియస్ నిరుద్యోగులకు వంచించడమే అది! సో, సీఎం కుర్చీలో కూర్చున్నంత మాత్రాన స్టేట్ నీ ఎస్టేట్ కాదు, నీకోసం ప్రాణాలు విడిస్తే జాతి వాళ్లకు ఏమీ రుణపడిపోలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions