Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిదా ఖాన్ బెయిల్ ఇష్యూ! మరి కృష్ణుడి పుట్టుక మీద వ్యాఖ్యలు దేనికి..?!

July 10, 2026 by M S R

.

దిగువ కోర్టుల్లో న్యాయాన్యాయ తీర్పులపై ఓ చెక్ పెట్టాల్సిన సుప్రీంకోర్టు మరో విషయంలోనూ ఓ కట్టడి తప్పుకుండా పెట్టాలేమో… అపెక్స్ కోర్టుగా దాని బాధ్యత అది… నిజానికి ఒక న్యాయమూర్తి మీద గానీ, ఒక తీర్పు మీద గానీ ఓ సామాన్యుడు ఏమైనా వ్యాఖ్యానిస్తే కోర్టు ధిక్కారం అంటుంటారు…

న్యాయమూర్తుల ఎంపిక, పదోన్నతుల దాకా వాళ్లు ఏదనుకుంటే అదే… కొలీజియం పేరిట ఓ ఇష్టారాజ్యం… సరే, మోదీకి దాన్ని ఎలా బ్రేక్ చేయాలో తెలియక, చేతకాక సైలెంట్ అయిపోయాడు, చివరకు వందల కోట్ల నోట్ల కట్టల ఆధారాలు దొరికినా ఆ ఢిల్లీ హైకోర్టు జడ్జిని కూడా ఏమీ చేయలేకపోయాడు… ఇవన్నీ ఎలా ఉన్నా…

Ads

బెయిళ్లు, కేసుల విచారణల సందర్భంగా జడ్జిలు ఏవేవో కామెంట్లు చేస్తున్నారు… అవి మీడియాలో వస్తాయని కూడా వాళ్లకు తెలుసు… ఆ వ్యాఖ్యల ప్రభావం అంతిమ తీర్పు మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు… ఐనా చేసేస్తున్నారు… మరీ సున్నితమైన, కోట్లాదిమంది మనోభావాలకు సంబంధించీ వ్యాఖ్యలు చేస్తున్నారు… అదెలా సమంజసం..?

విషాదం ఏమిటంటే..? వీటిని ఎవరూ ప్రశ్నించరు, ఆక్షేపించరు… విషయం ఏమిటంటే..? టీసీఎస్ మతమార్పిడి కేసుల గురించి తెలుసు కదా… హెచ్ఆర్ హెడ్ నిదా ఖాన్ ఓ గ్యాంగ్ క్రియేట్ చేసి, బెదిరిస్తూ మతమార్పిడి వైపు మళ్లించే కుట్రదారి…

విషయం బయటికొచ్చింది… అది బీజేపీ ప్రభుత్వమున్న రాష్ట్రం కాబట్టి కేసులు నమోదయ్యాయి… ఏ మమతో సీఎం అయి ఉంటే ఎక్కడికక్కడ హషప్… అంతేకాాదు, ఫిర్యాదులు చేసినవాళ్లనే శిక్షించేవాళ్లు… నిదా ఖాన్ చాన్నాళ్లు పరారీలో ఉంది… పట్టుకొచ్చారు పోలీసులు, జైలులో పారేశారు…

ఇక లాయర్లు దిగుతారు కదా… యాకూబ్ మెమన్, అఫ్జల్ గురుల కోసం అర్థరాత్రి సుప్రీం తలుపులు తెరిపించిన ఘనమైన న్యాయవ్యవస్థ కదా మనది… నిదా ఖాన్ లాయర్లు సగటు లాయర్లకన్నా వంద అడుగుల ముందున్నారు… అయ్యో, ఆమె గర్భిణి అనే వాదనతో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు… ప్రసవం వరకూ బెయిల్ కావాలట…

సరే, ఏదో విచారించారు, ఇచ్చేశారు బెయిల్… కానీ ఆ సందర్భంగా జడ్జి జస్టిఫికేషన్ ఏమిటయ్యా అంటే..? “ఏ బిడ్డ కూడా శ్రీకృషునిలాగా కారాగారంలో జన్మ అనే సామాజిక వివక్షకు, కళంకానికీ గురి కాకూడదు” … సారాంశం ఇదే… ఇది విస్మయానికి గురిచేస్తోంది… అసలు సుప్రీంకోర్టుకు ఏమైనా సోయి ఉందా దిగువ కోర్టుల్లో ఏం జరుగుతున్నదో…

కోట్లాదిమంది హిందువుల మనోభావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేయడానికి జడ్జిలకు ఏమైనా ప్రత్యేక అర్హతలున్నాయా..? ఇతర మతాల జోలికి ఇలా వెళ్లగలరా..? ఈ దేశంలో అందరికీ అలుసు హిందూమతమే…

యువరానర్… క‌ృష్ణుడి తల్లి నేరస్తురాలు కాదు, ఆమె పాలకుడి క్రూరస్వభావం వల్ల బాధితురాలు… అక్రమ నిర్బంధితురాలు… ఐనా సరే, కృష్ణుడు యశోద బిడ్డగా గోకులంలో హుందాగా, ఏ వివక్ష లేకుండా, తోటి సమాజం ప్రేమానురాగాల నడుమ పెరిగాడు… వివక్ష లేదు, కళంకం లేదు… మరి నీకెలా కనిపించింది..? నిదా ఖాన్ కేసుకూ దీనికి ఏమైనా సామ్యం ఉందా..?

మరెందుకు ఇలాంటి వ్యాఖ్యలు..? అవును, ఏ తల్లీ తన బిడ్డ జైలులో పుట్టాలని అనుకోదు, కానీ ఏ తల్లి పుట్టని తన బిడ్డను అడ్డుగా పెట్టుకుని జైలు నుంచి తప్పించుకోవాలని కుట్రలు చేయదు… కానీ నిదా ఖాన్ సపరేట్ కదా… ఇలాంటివి ఇండియాలోనే కనిపిస్తాయి మనకు… మోదీ చాలా విషయాల్లో గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్టు అని చెప్పుకొండి, కానీ ఈ దేశ న్యాయవ్యవస్థ విషయంలో ఫెయిల్..!!

శనిశింగాపూర్ దగ్గర నుంచి శబరిమల దాకా… ప్రతి హిందూ విశ్వాసంలోకి న్యాయవ్యవస్థ ఎంటరవుతోంది… ప్రభుత్వం చేతగాక చూస్తూ ఉండిపోతోంది..!! ఇదుగో ఇలాంటి వ్యాఖ్యల దాకా!! పిరికి, అసమర్థ హిందూ సమాజం అనే తేలికభావనేనా!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ ప్రభుత్వమా… బహుపరాక్! నీళ్లను జనరేట్ చేయలేం..!!
  • ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…
  • ‘‘ఇలా కేసులు పడితే, ఇక ఎవరూ దేవుళ్ల మీద సినిమాలు తీయలేరు’’
  • లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడితే… ఇదుగో ఇలాంటి ప్రమాదాలే !!
  • కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!
  • మరో వారసుడి నిరాశాపూరిత ఎంట్రీ – మోహన్‌ బాబునూ వాడుకోలేదు !!
  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!
  • నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions